ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం... రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
01 MAY 2025 9:05AM by PIB Hyderabad
గుజరాత్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘గుజరాత్ ప్రజలు గర్వపడే సందర్భమైన ఆ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు... ఆ రాష్ట్ర ప్రజలకు నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుజరాత్ తనదైన విశిష్ట సంస్కృతికి, ఉత్సాహపూరిత స్ఫూర్తితో పాటు క్రియాశీలత్వానికి కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గుజరాత్ ప్రజలు వివిధ రంగాల్లో రాణించారు. ఈ రాష్ట్రం మరిన్ని విజయాలు సాధిస్తూ, ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2125670)
Visitor Counter : 9
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam