ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్య ప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో దుర్ఘటన...ప్రాణనష్టం...ప్రధానమంత్రి సంతాపం


* పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

प्रविष्टि तिथि: 27 APR 2025 9:49PM by PIB Hyderabad

మధ్య ప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఆదివారం ఓ ప్రమాదం కారణంగా ప్రాణనష్టం జరిగినందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల్లో ప్రతి ఒక్కరికీ  రూ.2 లక్షల వంతున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్‌గ్రేషియాను వారి ఆత్మీయులకు అందించనున్నట్లు,  అలాగే గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 వంతున ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:

‘‘మధ్య ప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ప్రమాదం కారణంగా ప్రాణనష్టం జరిగిందని తెలిసి బాధపడ్డాను. తమ ప్రియతములను కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మృతులకు ప్రతి ఒక్కరికీ  రూ.2 లక్షల వంతున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను వారి ఆత్మీయులకు ఇస్తాం. గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 వంతున ఇస్తాం: ప్రధానమంత్రి @narendramodi’’

 

 

 

***

MJPS/VJ


(रिलीज़ आईडी: 2124836) आगंतुक पटल : 35
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam