WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వేవ్స్- 2025లో భాగంగా ‘ఇన్నొవేట్2ఎడ్యుకేట్: హాండ్ హెల్డ్ డివైజ్ డిజైన్ చాలెంజ్’ తుది పోటీదారులను ప్రకటించిన ఇండియన్ డిజిటల్ గేమింగ్ సొసైటీ

 Posted On: 27 APR 2025 4:53PM |   Location: PIB Hyderabad

ఇన్నోవేట్2ఎడ్యుకేట్: హ్యాండ్‌హెల్డ్ డివైస్ డిజైన్ పోటీలో అగ్రస్థానంలో ఉన్న 10 మంది తుది పోటీదారులను ఇండియన్ డిజిటల్ గేమింగ్ సొసైటీ (ఐడీజీఎస్) ప్రకటించింది. రాబోయే ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు (వేవ్స్)-2025లో భాగంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహకారంతో ఐడీజీఎస్ ఈ పోటీని నిర్వహిస్తోంది. సాంకేతికత, విద్య, గేమింగ్‌లు అన్నీ కలిసి యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించడంతోపాటు అభ్యసనానుభవంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేలా.. హాండ్ హెల్డ్ డివైజ్‌ల రంగంలో అద్భుత ఆవిష్కరణల దిశగా వారిని ఆలోచింపజేయడం, పరికరాల రూపకల్పన దీని లక్ష్యం.

సంబంధిత రంగంలో ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, విద్యావేత్తలు, డిజైనర్లతో కూడిన న్యాయనిర్ణేతల బృందం అన్నివిధాలా నిశితంగా పరిశీలించి 10 వినూత్న ఆలోచనలను తుదిపోటీకి ఎంపిక చేసింది. కాగా, మొత్తం 1856 పోటీదారులు నమోదు చేసుకున్నారు. ఎరుడిటియో సహ వ్యవస్థాపకుడు శ్రీ ఇంద్రజిత్ ఘోష్, హుయాన్ ఇండియా, సార్క్ కంట్రీ మేనేజర్ శ్రీ రాజీవ్ నాగర్, స్క్విడ్ అకాడమీ సహ వ్యవస్థాపకుడు, ప్రొడక్ట్ హెడ్ శ్రీ జెఫ్రీ క్రే న్యాయనిర్ణేతలుగా ఉన్నారు.

టాప్ 10 ఫైనలిస్టులు:

1. కర్ణాటక పర్వ - కోడ్ క్రాఫ్ట్ జూనియర్ (కర్ణాటక)

2. విద్యార్థి – పిల్లల కోసం స్మార్ట్ లెర్నింగ్ టాబ్లెట్: ఉమ్మడి, ప్రత్యేక/వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రూపొందించిన విద్యా పరికరం (కర్ణాటక, ఆంధ్రప్రదేశ్)

తక్కువ వ్యయంతో, వాయిస్ సాయంతో నడిచే స్మార్ట్ లెర్నింగ్ టాబ్లెట్ ను యువ ఆవిష్కర్తలు రూపొందించారు. పరస్పర సంభాషణలకు ఇందులో అవకాశం ఉంటుంది. ఈఎస్పీ 8266 లేదా రాస్బెర్రీ పై ద్వారా పనిచేస్తుంది. పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఈ పరికరాన్ని రూపొందించారు. అధిక వ్యయం, కనెక్టివిటీ సమస్యల వల్ల చాలావరకూ అందుబాటులో ఉండని సాంప్రదాయక, డిజిటల్ అభ్యసన పరికరాలకు ప్రత్యామ్నాయంగా ఇది ఉపయోగపడుతుంది. స్క్రీన్ రహితంగా, ఇంటర్నెట్ లేకుండా ఇది అందుబాటులో ఉంటుంది.

image.jpeg

3. టెక్ టైటాన్స్ – చేతిరాతపై పరస్పర సాయంతో స్మార్ట్ హాండ్ రైటింగ్ లెర్నింగ్ డివైస్ (తమిళనాడు)

ఇది సాంప్రదాయక రాత పద్ధతులను ఆధునిక సాంకేతికతతో మిళితం చేస్తుంది. పిల్లలు చేతిరాత నేర్చుకునే విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేలా రూపొందించిన పరికరం ‘స్మార్ట్ హ్యాండ్ రైటింగ్ లెర్నింగ్ డివైస్’. పరస్పర అభిప్రాయ వినిమయాన్ని, వివిధ భాషల అభ్యసన అనుభవాన్ని వాస్తవికంగా అందిస్తుంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రారంభ దశలో ఉన్న పిల్లల కోసం ఆఫ్‌లైన్‌లో, తక్కువ వ్యయంతో లభించే పరికరంగా ఇది ఉపయోగపడుతుంది.

image.jpeg

4. ప్రొటోమైండ్స్– ఎడ్యుస్పార్క్ (ఢిల్లీ, కేరళ, యూపీ, బీహార్)

ఎడ్యుస్పార్క్: 6 నుంచి 8 సంవత్సరాల వయస్సున్న చిన్నారుల్లో ఉత్సుకతను రేకెత్తించడానికి, మేధో వికాసాన్ని వేగవంతం చేయడానికి దీనిని రూపొందించారు. తక్కువ ధరలోనే లభించే ఈ పరికరం కృత్రిమ మేధ సాయంతో పనిచేస్తుంది. వ్యక్తిగత అవసరాలకు తగిన (అడాప్టివ్) ఏఐ ఇంజిన్ దీని ప్రత్యేకత. పిల్లలు ఆడుకోవడానికి సుడోకు, గణిత పోటీలు, చిక్కుముడులు, మొమొరీ పోటీల వంటివి ఇందులో లభిస్తాయి. ప్రతి పిల్లవాడూ తనకు తగిన వేగంతో పురోగతి సాధించేలా సహాయపడుతూ.. పోటీలో కాఠిన్య స్థాయిలను ఈ పరికరం సర్దుబాటు చేస్తుంది.

image.jpeg

5. అపెక్స్ అచీవర్స్ – బాడ్‌మాస్ క్వెస్ట్: స్మార్ట్ ఎడ్యుకేషన్ కోసం గేమిఫైడ్ మ్యాథ్స్ లెర్నింగ్ (తమిళనాడు)

బాడ్‌మాస్ (బ్రాకెట్స్, ఆర్డర్, విభజన/గుణకారం, కూడిక/తీసివేత) చాలావరకు పిల్లలకు సమస్యగా ఉండి గణితంలో వారి ఆత్మవిశ్వాసాన్ని, పురోగతిని తగ్గిస్తుంది. ‘బాడ్‌మాస్ క్వెస్ట్’ దానిని మార్చేస్తుంది. ఒక అద్భుతమైన, ప్రోత్సాహకాలతో కూడిన ప్రస్థానంగా అభ్యసన ప్రక్రియను తీర్చిదిద్దుతుంది.

image.jpeg

6. సైన్స్‌వర్స్ – పిల్లల కోసం అత్యావశ్యకమైన ఇంటరాక్టివ్ ఎడ్యుకేషనల్ హాండ్ హెల్డ్ డివైజ్ (ఇండోనేషియా)

7. వీ 20 – వీఫిట్ – ఆటల ద్వారా పరస్పర అభ్యసనం (తమిళనాడు)

image.jpeg

8. వారియర్స్- మహా-శాస్త్ర (దేహి)

మహా శాస్త్ర అనేది నుంచి 18 సంవత్సరాల వయస్సున్న విద్యార్థులకు మరింత మెరుగైన అభ్యసనానుభవాన్ని అందించడం కోసం రూపొందించిన ఓ వినూత్న విద్యాపరమైన వ్యవస్థ. సమ్మిళితత్వంతోపాటు పనితీరును మెరుగుపరచడం కోసం రూపొందించిన ఈ వేదిక.. క్విజ్‌లు, వాస్తవికంగా ఉండే డిజిటల్ నమూనాలు, ఏఐ ఆధారిత శిక్షణలను ఒక్కచోటకు తెస్తుంది. దేశంలోనూ, దేశం అవతలా ఉన్న విద్యార్థుల కోసం అవసరాలకు అనుగుణంగా వివిధ భాషల్లో సహకారాన్ని అందిస్తుంది. ఇందులో ప్రధాన భాగం హ్యాండ్‌హెల్డ్ ఏఐ-ఆధారంగా పనిచేసే పరికరం. పరస్పరం ఆటలు, ఎవరికివారికి ప్రత్యేకంగా క్విజ్‌లు, లోరా- ఆధారిత మెష్టాస్టిక్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి ఆన్లైన్ సహకారం ద్వారా ఇది విద్యార్థులను అందులో నిమగ్నులయ్యేలా చేస్తుంది.

image.jpeg

9. కిడ్డీమైత్రి- A Handheld Mathematical Gaming Console (ముంబయి, ఒడిశా, కర్ణాటక)

కొందరు భారతీయ విద్యార్థులను పరీక్షించగా, వారిలో సగానికి పైగా ప్రాథమిక సంఖ్యాశాస్త్రంలో కనీస అంతర్జాతీయ ప్రమాణాల కన్నా దిగువన ఉన్నారు. కిడ్డీమైత్రి టీమ్ దీనిని సవాలుగా తీసుకుంది. జాతీయ విద్యావిధానం- 2020 స్ఫూర్తితో స్థానిక భాషలో అభ్యసనం, సాంకేతిక ఏకీకరణ, సాంప్రదాక భారతీయ విలువలపై ప్రత్యేకంగా దృష్టిపెడుతూ.. స్థానిక, ప్రభావవంతమైన అభ్యసన విధానాలను రూపొందించింది.

image.jpeg

10. ఇ-గ్రూట్స్ - మైక్రో కంట్రోలర్ మాస్టరీ కిట్ (తమిళనాడు)

image.jpeg

ఎంపికైన టాప్ 10 బృందాలు ముంబయిలో వేవ్స్-2025 సందర్భంగా జరిగే ఓ ప్రత్యేక ప్రదర్శనలో తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి. ఈ ఛాలెంజ్ విజేతలను గ్రాండ్ ఫినాలేలో మంత్రిత్వ శాఖ సన్మానిస్తుంది.

 

వేవ్స్ గురించి

మీడియా, వినోద రంగాల్లో కీలకమైన కార్యక్రమమైన తొలి ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు (వేవ్స్)ను ముంబయిలో మే 1 నుంచి 4 వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది.

మీరు సంబంధిత రంగంలో నిపుణులైనా, పెట్టుబడిదారులైనా, సృజనకారులైనా, ఆవిష్కర్తలైనా... అనుసంధానం, భాగస్వామ్యం, ఆవిష్కరణలతో మీడియా, వినోద రంగంలో ప్రతిభను చాటుకునేందుకు అత్యున్నత అంతర్జాతీయ వేదికగా ఈ సదస్సు నిలుస్తుంది.

భారతీయ సృజన శక్తిని వేవ్స్ విస్తృతంగా చాటబోతోంది. కంటెంట్ సృజన, మేధో సంపత్తి, సాంకేతిక ఆవిష్కరణల నిలయంగా దేశ స్థానాన్ని మరింత సుస్థిరం చేయనున్నది. సమాచార ప్రసారం, ముద్రణ మాధ్యమాలు, టీవీ, రేడియో, సినిమా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సంగీతం, ప్రకటనలు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వేదికలు, ఉత్పాదక కృత్రిమ మేధ, అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్) వంటి పరిశ్రమలు, రంగాలపై దృష్టి సారించారు.

ఏవైనా సందేహాలున్నాయా? జవాబుల కోసం ఇక్కడ  చూడండి.

పీఐబీ వేవ్స్ బృందం ఎప్పటికప్పుడు అందించే తాజా ప్రకటనలను చదవండి.

రండి, మాతో కలసి  ప్రయాణించండి! ఇప్పుడే  వేవ్స్ కు రిజిస్టర్ చేసుకోండి.   

 

***


Release ID: (Release ID: 2124832)   |   Visitor Counter: 6