ప్రధాన మంత్రి కార్యాలయం
సౌదీ అరేబియాలో ప్రధానమంత్రి అధికార పర్యటన- ఫలితాలు
Posted On:
23 APR 2025 2:25AM by PIB Hyderabad
I. వ్యూహాత్మక భాగస్వామ్య మండలి
*2025 ఏప్రిల్ 22న జెడ్డాలో జరిగిన భారత్ - సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి (ఎస్పీసీ) నాయకుల రెండో సమావేశానికి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించారు. మండలి ఎస్పీసీ ఆధీనంలోని రాజకీయ, రక్షణ, భద్రతా, వాణిజ్య, పెట్టుబడి, ఇంధనం, సాంకేతిక, వ్యవసాయం, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన వివిధ కమిటీలు, ఉపకమిటీలు, వర్కింగ్ గ్రూపుల పనితీరును కౌన్సిల్ సమీక్షించింది. చర్చల అనంతరం ఇరువురు నేతలు మినిట్స్ పై సంతకాలు చేశారు.
*గత కొన్ని సంవత్సరాల్లో సంయుక్త విన్యాసాలు, , శిక్షణ కార్యక్రమాలు రక్షణ రంగంలో సహకారం లాంటి అంశాలలో రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతమయిన నేపథ్యంలో, ఎస్పీసీ కింద రక్షణ సహకారంపై కొత్త మంత్రిత్వ స్థాయి ఏర్పాటు చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది.
*ఇటీవలి సంవత్సరాల్లో గణనీయమైన వేగంతో అభివృద్ధి చెందిన సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఎస్పీసీ కింద పర్యాటక, సాంస్కృతిక సహకార మంత్రిత్వ కమిటీని కొత్తగా ఏర్పాటు చేయాలని కూడా కౌన్సిల్ నిర్ణయించింది.
భారత్-సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి (ఎస్పీసీ) కింద నాలుగు కమిటీలు ఈ కింది విధంగా ఉంటాయి.
(1) రాజకీయ, దౌత్య, భద్రతా సహకార మంత్రిత్వ కమిటీ
(2) రక్షణ సహకార కమిటీ
(3) ఆర్థిక, ఇంధన, పెట్టుబడులు, టెక్నాలజీ కమిటీ.
(4) పర్యాటక, సాంస్కృతిక సహకార కమిటీ
II. పెట్టుబడులపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ (హెచ్ఎల్టీఎఫ్)
*ఇంధనం, పెట్రోరసాయనాలు, మౌలిక వసతులు, సాంకేతికత, ఫిన్‌టెక్, డిజిటల్ మౌలిక వసతులు, టెలికమ్యూనికేషన్‌లు, ఔషధాలు, తయారీ, ఆరోగ్యం సహా అనేక విభాగాల్లో భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ అరేబియా ముందుకు వచ్చినందున ఆయా రంగాల్లో వాటిని వేగంగా ప్రోత్సహించడంపై పెట్టుబడుల సంబంధిత సంయుక్త ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ఒప్పందానికి వచ్చింది.
*భారత్ లో రెండు రిఫైనరీల ఏర్పాటులో కలసి పనిచేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
*పన్ను విధానం వంటి రంగాల్లో హెచ్ఎల్టీఎఫ్ సాధించిన పురోగతి భవిష్యత్తులో విశేష పెట్టుబడి సహకారానికి ప్రధాన మైలురాయిగా నిలిచింది.
III. ఒప్పందాలు/అవగాహన ఒప్పందాల జాబితా
*శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష కార్యకలాపాల రంగంలో సహకారంపై సౌదీ స్పేస్ ఏజెన్సీ, భారత అంతరిక్ష విభాగం మధ్య అవగాహన ఒప్పందం.
*ఆరోగ్య రంగంలో సహకారంపై సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం.
*యాంటీ డోపింగ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్ రంగంలో సహకారంపై సౌదీ అరేబియా యాంటీ డోపింగ్ కమిటీ (ఎస్ఏఏడీసీ), నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, ఇండియా (నాడా) మధ్య అవగాహన ఒప్పందం.
*ఇన్వార్డ్ సర్ఫేస్ పార్శిల్ లో సహకారంపై సౌదీ పోస్ట్ కార్పొరేషన్ (ఎస్పీఎల్), భారత కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ కు చెందిన తపాలా శాఖ మధ్య ఒప్పందం.
***
(Release ID: 2124037)
Visitor Counter : 26
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada