హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హోలీ సీ అత్యున్నత అధిపతి, పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ గౌరవార్థం మూడు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు

Posted On: 21 APR 2025 10:09PM by PIB Hyderabad

హోలీ సీ (రోమన్ క్యాథలిక్ చర్చివాటికన్ సిటీ పాలకమండలిఅత్యున్నత అధిపతిపవిత్ర పోప్ ఫ్రాన్సిస్ ఈ రోజు (2025, ఏప్రిల్ 21) తుది శ్వాస విడిచారుఆయన గౌరవార్థం దేశవ్యాప్తంగా దిగువ పేర్కొన్న ప్రకారం మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలి:

  1. మంగళవారం (ఏప్రిల్ 22), బుధవారం (ఏప్రిల్23)న అధికారిక సంతాప దినాలుగా పాటించాలి.

  2. అంత్యక్రియలు నిర్వహించే రోజు సైతం అధికారిక సంతాప దినంగా పాటించాలి.

అధికారిక సంతాప దినాలు పాటించే రోజుల్లో దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేస్తారుఅలాగే ఈ సమయంలో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు జరగవు.

 


(Release ID: 2123387) Visitor Counter : 21