ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈశాన్య ఢిల్లీలోని దయాళ్‌పూర్‌లో భవనం కూలిన ఘటన... ప్రాణనష్టం... ప్రధానమంత్రి సంతాపం


* పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

Posted On: 19 APR 2025 9:02PM by PIB Hyderabad

ఈశాన్య ఢిల్లీలోని దయాళ్‌పూర్‌లో ఒక భవనం శనివారం కూలిపోయి ప్రాణనష్టం జరగగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను ఆ వ్యక్తుల కుటుంబాలకు ఇస్తామని, గాయపడిన వారికి రూ.50,000 వంతున అందజేస్తామని ఆయన ప్రకటించారు.


సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో  పీఎంఓ ఇండియా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:


‘‘ఈశాన్య ఢిల్లీలోని దయాళ్‌పూర్‌లో ఒక భవనం శనివారం కూలిపోయిన ఘటనలో ప్రాణనష్టం జరిగిందని తెలిసి నేను బాధపడ్డాను. తమ ప్రియతములను కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్థానిక పాలన యంత్రాంగం బాధితులకు సహాయక చర్యలు చేపడుతోంది.


ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఇస్తాం. గాయపడిన వారికి రూ.50,000 అందజేస్తాం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)’’ అని పేర్కొంది.


(Release ID: 2123078) Visitor Counter : 7