ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచి ఆహారాన్ని తీసుకోవాలని, ఊబకాయాన్ని ఎదుర్కోవాలని ప్రధానమంత్రి పిలుపు
Posted On:
19 APR 2025 1:13PM by PIB Hyderabad
ప్రజలందరూ అవగాహనతో కూడిన ఆహార పద్దతులను అవలంబించాలని, ఆరోగ్యవంతమైన జీవనానికి ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరారు. ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఈ పిలుపునిచ్చారు. చిన్న చిన్న ప్రభావవంతమైన మార్పుల ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించిన ప్రధాని.. నూనెల వాడకం తగ్గించటం వంటి పనులు పూర్తి ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచడానికి గణనీయంగా దోహదం చేస్తాయని అన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ జే.పీ. నడ్డా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన ఒక పోస్టుకు బదులిస్తూ ఆయన ఈ విధంగా పేర్కొన్నారు.
“ఆలోచించి ఆహారం తీసుకోవటం, ఆరోగ్యకరమైన జీవనం అనే పిలుపుతో #WorldLiverDay ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని జరుపుకోవటం ప్రశంసనీయం. నూనెలు తగ్గించడం వంటి చిన్న చిన్న పనులు పెద్ద తేడాను చూపెడతాయి. స్థూలకాయంపై అవగాహన పెంచడం ద్వారా ఆరోగ్యకరమైన భారత్ ను నిర్మిద్దాం. #StopObesity"
(Release ID: 2122971)
Visitor Counter : 38
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam