హోం మంత్రిత్వ శాఖ
డ్రగ్ నెట్‌వర్కులపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం : కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
* మత్తుమందుల ఊసే ఉండని భారత్‌ను సాకారం చేసే నిరంతర కృషిలో భాగంగా, అంతర్జాతీయ నౌకావాణిజ్య సరిహద్దు సమీపంలో రూ.1,800 కోట్ల విలువైన 300 కేజీల మాదకద్రవ్యాల స్వాధీనం... ఇది ఒక మహత్తర విజయం
* సముద్ర జలాల్లో చేపట్టిన ఈ చర్య, మత్తుపదార్థాల దుష్టశక్తిని రూపు మాపడానికి మోదీ సర్కారు అనుసరిస్తున్న ‘సంపూర్ణ ప్రభుత్వ దృక్పథాని’కి ఒక గొప్ప ఉదాహరణ
* ఘన విజయాన్ని సాధించిన గుజరాత్ పోలీస్ ఏటీఎస్‌కు, భారతీయ తీరరక్షకదళానికీ హోం మంత్రి ప్రశంసలు
Posted On:
14 APR 2025 12:35PM by PIB Hyderabad
డ్రగ్ నెట్‌వర్కులను మోదీ ప్రభుత్వం కూకటివేళ్లతో సహా పెకలిస్తోందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు.
‘‘సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోం మంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ-
‘‘మాదక పదార్థాలు మచ్చుకైనా కనిపించని దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలన్న నిరంతర ప్రయత్నాల్లో భాగంగా, అంతర్జాతీయ నౌకావాణిజ్య సరిహద్దు దగ్గర 300 కిలోల మత్తు పదార్థాలను జప్తు చేసి ఒక గొప్ప విజయాన్ని దక్కించుకొన్నాం. ఈ మత్తుపదార్థాల విలువ రూ.1,800 కోట్ల వరకు ఉంటుంది. సముద్ర ప్రాంతంలో చేపట్టిన ఈ చర్య, ‘ప్రభుత్వ సకల శక్తియుక్తులనూ వినియోగించి’ మరీ మత్తుమందుల దుష్ట శక్తిని సమూలంగా తుడిచిపెట్టాలన్న మోదీ సర్కారు విధానానికి దక్కిన ఓ అద్భుత విజయం. ఈ మహత్తర విజయాన్ని సాధించిన గుజరాత్ పోలీస్ శాఖ ఏటీఎస్‌ను, భారతీయ తీరరక్షకదళాన్ని ప్రశంసిస్తున్నాను ’’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు.
***
(Release ID: 2121995)
Visitor Counter : 5