ప్రధాన మంత్రి కార్యాలయం
జలియన్‌వాలా బాగ్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
13 APR 2025 9:03AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జలియన్‌వాలా బాగ్ అమరవీరులకు ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించారు.. ఎవరికీ తల వంచక వారందించిన అజేయ స్ఫూర్తిని రాబోయే తరాలు సైతం ఎప్పటికీ స్మరించుకొంటూనే ఉంటాయని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘జలియన్‌వాలా బాగ్ అమరవీరులకు మనం శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాం. ఎవరికీ తల వంచక వారు చాటిన స్ఫూర్తిని భావి తరాల వారు కూడా సదా స్మరించుకొంటూ ఉంటారు. ఇది నిజానికి మన దేశ చరిత్రలో ఒక విషాదభరిత అధ్యాయం. అమరవీరుల త్యాగం భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఒక పెనుమార్పును తీసుకువచ్చిన ఘట్టంగా నిలిచిపోయింది’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2121701)
आगंतुक पटल : 31
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada