ప్రధాన మంత్రి కార్యాలయం
వికసిత్ భారత్‌ను సాకారం చేసే కృషిలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శాలకు కట్టుబడి ఉంటామని పౌరులు పునరుద్ఘాటించాలి: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
14 APR 2025 12:18PM by PIB Hyderabad
‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) ను సాకారం చేసే దిశగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శాలకు కట్టుబడి పనిచేస్తామని పునరుద్ఘాటించాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశపౌరులకు ఈ రోజు పిలుపునిచ్చారు. రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘ఆధునిక భారతదేశ గొప్ప ఆలోచనపరులలోనూ, సంస్థలను ఏర్పాటు చేయడంలోనూ బాబాసాహెబ్ ఒకరని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ (@rajnathsingh) ఒక వ్యాసంలో రాశారు. ప్రధాన సంస్థల ఏర్పాటులో డాక్టర్ అంబేద్కర్ పోషించిన పాత్రను ఆయన గుర్తు తెచ్చుకొన్నారు. అంతేకాకుండా ‘వికసిత్ భారత్’ను సాకారం చేసే దిశలో బాబాసాహెబ్ ఆదర్శాలకు కట్టుబడి ముందుకు దూసుకుపోతామంటూ పౌరులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాలని కూడా కోరారు.’’
(रिलीज़ आईडी: 2121693)
आगंतुक पटल : 39
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
Khasi
,
English
,
Urdu
,
हिन्दी
,
Nepali
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam