హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పద్మ పురస్కారాలు–2026 నామినేషన్ల సమర్పణకు ఈ సంవత్సరం జూలై 31 వరకు గడువు

Posted On: 11 APR 2025 12:53PM by PIB Hyderabad

వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రకటించే ‘పద్మ పురస్కారాలు–2026’కు నామినేషన్లు, సిఫారసులను స్వీకరించడాన్ని 2025 మార్చి 15న ప్రారంభించారు. నామినేషన్లను సమర్పించడానికి చివరి తేదీ 2025 జూలై 31. పద్మ పురస్కారాలకు నామినేషన్లను, సిఫారసులను రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌ ( https://awards.gov.in ) లో ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు.

పద్మ పురస్కారాలు.. అంటే పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ.. ఇవి దేశంలో అన్నింటికన్నా ఉన్నతమైన పౌర పురస్కారాలు. 1954లో ఏర్పాటు చేసిన ఈ పురస్కారాలను ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. ఈ పురస్కారాల్లో భాగంగా ‘విశిష్ట కృషి’ని గుర్తిస్తారు. పద్మ పురస్కారాలను కళ, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సమాజ సేవ, సైన్స్, ఇంజినీరింగ్, ప్రజా వ్యవహారాలు (పబ్లిక్ అఫైర్స్), సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమ వంటి అన్ని రంగాల్లో విశిష్ట, అసాధారణ విజయాలకు, సేవకుగాను అందజేస్తుంటారు. జాతి, వృత్తి, పదవి, పురుషుడు, మహిళ అనే భేద భావానికి తావీయకుండా అందరు వ్యక్తులు ఈ పురస్కారాలకు అర్హులు. వైద్యులు, శాస్త్రవేత్తలు తప్ప... ఇతర ప్రభుత్వోద్యోగులు, పీఎస్‌యూలలో పనిచేసే ప్రభుత్వోద్యోగులు పద్మ పురస్కారాలకు అర్హులు కారు.

పద్మ అవార్డులను ‘‘పీపుల్స్ పద్మ’’ (ప్రజల పద్మ) పురస్కారాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ కారణంగా, పౌరులంతా నామినేషన్ చేయవచ్చు, సిఫారసు చేయవచ్చు. పౌరులు తమను తాము నామినేట్ చేయడానికీ అవకాశం ఉంది. మహిళలు, సమాజంలో బలహీన వర్గాల వారు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, దివ్యాంగజనులు, సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తున్న వారిలో శ్రేష్ఠత్వం, విజయాల ఆధారంగా సిసలైన గుర్తింపునకు నోచుకోగలిగే ప్రతిభావంతులను గుర్తించేందుకు ఉమ్మడి ప్రయత్నాలు చేయవచ్చు.

 

పైన తెలిపిన పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఫార్మేట్‌లో నిర్దిష్టమైన, సందర్భశుద్ధి కలిగిన వివరాలన్నీ నామినేషన్లు, సిఫారసులలో పేర్కొనాలి. ఒక వర్ణనాత్మక సైటేషన్‌‌ను (ఇది 800 పదాలను మించకూడదు) కూడా జోడించాలి. ఇది సిఫారసు చేస్తున్న వ్యక్తికి ఆ వ్యక్తికి సంబంధించిన రంగంలో గాని, డిసిప్లిన్‌లో గాని సాధించిన విశిష్ట, అసాధారణ విజయాలు, అందించిన సేవలను గురించిన స్పష్టమైన సమాచారాన్ని జతపరచాలి.

ఈ విషయంలో విస్తృత వివరణ హోం శాఖ వెబ్‌సైట్ ( (https://mha.gov.in) లో ‘పురస్కారాలు, పతకాలు’ శీర్షికన పద్మ పురస్కారాల పోర్టల్ (https://padmaawards.gov.in) లో అందుబాటులో ఉంది. ఈ అవార్డులకు సంబంధించిన విధానాలు, నియమాలు వెబ్‌సైట్‌లో https://padmaawards.gov.in/AboutAwards.aspx అనే లింకులో అందుబాటులో ఉన్నాయి.

***


(Release ID: 2120994) Visitor Counter : 26