రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

లిస్బన్‌లో ‘సిటీ కీ ఆఫ్ ఆనర్’ను స్వీకరించిన భారత్ రాష్ట్రపతి


• పోర్చుగల్ అధ్యక్షుడు ఏర్పాటు చేసిన విందుకు హాజరైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

• మేం జ్ఞాన-ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారత్‌కున్న బలాలను ఉపయోగించుకోవడంలో పోర్చుగల్‌ను మా భాగస్వామిగా భావిస్తాం: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

Posted On: 08 APR 2025 11:44AM by PIB Hyderabad

పోర్చుగల్‌‌లోని లిస్బన్ లో గల సిటీ హాలులో నిన్న (2025 ఏప్రిల్ 7నిర్వహించిన ఒక కార్యక్రమంలో లిస్బన్ మేయరు చేతులమీదుగా ‘సిటీ కీ ఆఫ్ ఆనర్’ను భారత్ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అందుకొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూఈ సన్మానానికి మేయరుకులిస్బన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారులిస్బన్ దాపరికం లేని ఆలోచనలకుప్రజల ఆప్యాయతకుసహనశీలత్వానికిభిన్నత్వం పట్ల గౌరవానికిసంస్కృతికి కూడా ప్రసిద్ధి చెందిందని ఆమె అన్నారులిస్బన్ నగరం సాంకేతిక మార్పునవకల్సనడిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్డిజిటల్ పరివర్తన రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్న ప్రపంచ నగరం అని తెలుసుకొని తాను సంతోషిస్తున్నానని ఆమె తెలిపారుఈ రంగాల్లో భారత్పోర్చుగల్‌ మరింత సహకరించుకొనే అవకాశాలు ఉన్నాయని ఆమె అన్నారు.

పోర్చుగల్ అధ్యక్షుడు శ్రీ మార్సెలో రెబెలో డి సూసా  నిన్న సాయంత్రం పలసియో డా అజుడాలో రాష్ట్రపతి గౌరవార్థం ఏర్పాటు చేసిన ఒక విందు కార్యక్రమంలో శ్రీమతి ముర్ము పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూమన రెండు దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలు శతాబ్దాల నాటివనిఈ సంబంధాలు మన సామూహిక భావనపై చెరగని ముద్ర వేశాయన్నారువాటిలో మన రెండు దేశాల గత కాలం ఒక భాగంగా ఉందనిఇది వాస్తుకళచారిత్రక స్థలాలుభాషలే కాక మన వంట పద్ధతుల్లో ప్రతిబింబిస్తోందన్నారు.
ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉందనిఇండియా-పోర్చుగల్ ద్వైపాక్షిక సంబంధాలు 50వ సంవత్సరాన్ని పూర్తి చేసుకొంటున్న ఘట్టాన్ని మనం ఈ ఏడాదిలోనే పండుగలా జరుపుకొంటున్నామని రాష్ట్రపతి తెలిపారుమన ఉభయ దేశాల మధ్య సహజ అనుబంధానికి తోడు అనేక రంగాల్లో సహకారానికి గల అవకాశాలుమన చారిత్రక సంబంధాలు ఒక చైతన్యభరితదార్శనిక భాగస్వామ్యంలా రూపొందే దిశలో పురోగమిస్తున్నాయని ఆమె అన్నారుసైన్టెక్నాలజీరక్షణఐటీఅంకుర సంస్థలుపరిశోధనవిద్యారంగ సహకారంతోపాటు సాంస్కృతిక సహకారం సహా వివిధ రంగాలలో భారత్పోర్చుగల్‌ల మధ్య సహకారం నిరంతరాయంగానుప్రగతిశీల దృక్పథంతోను వృద్ధి చెందుతున్నందుకు రాష్ట్రపతి శ్రీమతి ముర్ము సంతోషాన్ని వ్యక్తం చేశారు.
జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థగా భారత్ అందరికీ ప్రయోజనాలు దక్కే సమ్మిళితనిరంతర అభివృద్ధి నమూనాను ఆవిష్కరించడానికి సైన్టెక్నాలజీసమాచారటెలికమ్యూనికేషన్ టెక్నాలజీడిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్అంకుర సంస్థలునవకల్పన వంటి రంగాల్లో తనకున్న బలాలను ఉపయోగించుకొంటోందని రాష్ట్రపతి అన్నారుఈ ప్రయత్నాల్లో పోర్చుగల్‌ను భారత్ తన భాగస్వామిగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఐరోపా సంఘంతో భారత్ సంబంధాలను ప్రోత్సహించడంలో పోర్చుగల్ పోషిస్తున్న పాత్రను రాష్ట్రపతి ప్రశంసించారుఈయూకు పోర్చుగల్ అధ్యక్ష పదవీబాధ్యతలను నిర్వహించిన కాలంలోనే ఇండియా-ఈయూ మొట్టమొదటి శిఖరాగ్ర సదస్సును నిర్వహించారని, 2021 మే నెలలో మరోసారి పోర్చుగల్ అధ్యక్షతన చారిత్రక ‘‘ఇండియా-ఈయూ ప్లస్ 27’’ నాయకత్వ శిఖరాగ్ర సదస్సు సైతం పోర్చుగల్‌లో చోటు చేసుకొందని రాష్ట్రపతి గుర్తు చేశారు.

***


(Release ID: 2120050) Visitor Counter : 36