ప్రధాన మంత్రి కార్యాలయం
థాయిలాండ్ రాజ దంపతులతో ప్రధానమంత్రి సగౌరవ సమావేశం
Posted On:
04 APR 2025 6:45PM by PIB Hyderabad
థాయ్‌లాండ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ ఫ్రా వజిరక్లావోయుహువా, రాణి సుతిదా బజ్రసుధాబి మలలక్షణతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బ్యాంకాక్‌లోని దుసిట్ రాజసౌధంలో సగౌవర సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారత్-థాయిలాండ్ ఉమ్మడి సాంస్కృతిక వారసత్వంపై తమ మనోభావాలను పంచుకున్నారు. అలాగే భారత్ నుంచి థాయిలాండ్‌కు బుద్ధ భగవానుని అవశేషాలు చేరడంతోపాటు రెండు దేశాల మధ్య ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడంలో ఈ కార్యక్రమం సానుకూల ప్రభావాన్ని చూపిందని వారు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య బహుముఖ దౌత్య సంబంధాలను మరింత పటిష్ఠం చేసే మార్గాలపైనా వారు చర్చించారు.
(Release ID: 2119112)
Visitor Counter : 16
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam