రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రైలింజన్ల తయారీలో సరికొత్త అధ్యాయం: 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,681 రైలింజన్లను తయారు చేసి అమెరికా, ఐరోపా దేశాలను అధిగమించిన భారత్


19% పెరిగిన తయారీ

2024-25 ఆర్థిక సంవత్సరంలోనే 1,681 రైలింజన్ల తయారీ

2023-24 ఆర్థిక సంవత్సరంలో తయారు చేసిన 1,472 కంటే ఇది 209 అధికం

‘మేక్ ఇన్ ఇండియా’ వృద్ధికి చోదకశక్తి: గత 10 ఏళ్లలో 9,168కి పెరిగిన రైలింజన్ల తయారీ

2024-25 కాలంలో 917నుంచి రెట్టింపు అయిన వార్షిక సగటు తయారీ

Posted On: 02 APR 2025 4:55PM by PIB Hyderabad

2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,681 రైలింజన్లను తయారు చేసి భారతదేశం రైలింజన్ల తయారీలో ప్రపంచ అగ్రగామిగా అవతరించిందిఈ విజయంతో అమెరికాయూరప్దక్షిణ అమెరికాఆఫ్రికాఆస్ట్రేలియా వంటి దేశాలను భారత్ అధిగమించింది. ఇది ప్రపంచ రైల్వే రంగంలో పెరుగుతున్న భారతదేశపు ఆధిపత్యాన్ని చాటుతోంది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ కేటగిరీల్లో మొత్తం 1,681 రైలింజన్లను తయారు చేయడం ద్వారా భారతీయ రైల్వేల... ఇంజన్ తయారీ యూనిట్లు ఒక అద్భుతమైన ప్రస్థానాన్ని సాధించాయిఇది గత ఆర్థిక సంవత్సరం 2023-24లో తయారు చేసిన 1,472 రైలింజన్ల సంఖ్యతో పోలిస్తే ఇది 209 అధికం...అంటే 19% అధికంగా తయారు చేశారురైల్వే మౌలిక సదుపాయాలనుసామర్థ్యాన్ని పెంపొందించడంలో అన్ని విభాగాల గణనీయమైన విజయాలను ప్రతిబింబిస్తూఈ రికార్డు స్థాయి తయారీతో దేశంలోనే ఇప్పటి వరకు అత్యధిక సంఖ్యలో రైలింజన్లు తయారయ్యాయి.

రైలింజన్ల తయారీలో ఈ నిరంతర పెరుగుదల "మేక్ ఇన్ ఇండియాకార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాల ప్రత్యక్ష ఫలితంగా నిలిచింది. 2004-2014 మధ్య కాలంలోమొత్తం 4,695 రైలింజన్లను భారత్ తయారు చేసింది. అంటే జాతీయ వార్షిక సగటు 470. అయితే2014-2024 కాలంలోరైలింజన్ల తయారీ గణనీయంగా పెరిగింది. ఈ కాలంలో ఏకంగా 9,168 రైలింజన్లు తయారు చేశారు. అంటే వార్షిక సగటు సుమారుగా 917కి పెరిగింది.

2024-25 ఆర్థిక సంవత్సరంలోభారత రైల్వేల తయారీ యూనిట్లలో రికార్డు స్థాయిలో 1,681 రైలింజన్లు తయారయ్యాయిఆయా యూనిట్లలో తయారు చేసిన రైలింజన్ల సంఖ్య కింది విధంగా ఉంది –

చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ 700 రైలింజన్లను తయారు చేయగా, బనారస్ లోకోమోటివ్ వర్క్స్ 477 ఇంజన్లనుపాటియాలా లోకోమోటివ్ వర్క్స్ 304 ఇంజన్లను, అలాగే మాధేపురామార్హౌరా యూనిట్లు చెరో 100 ఇంజన్లను తయారు చేశాయి.

దేశంలో తయారైన రైలింజన్లలో ఎక్కువ భాగం సరుకు రవాణా చేసే రైళ్ల కోసం ఉద్దేశించినవే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తయారైన 1,681 రైలింజన్ల వివరాలు కేటగిరీల వారీగా కింది విధంగా ఉన్నాయి:

• డబ్ల్యుఎజి-9/9 హెచ్ రైలింజన్లు: 1,047

• డబ్ల్యుఎజి -9 హెచ్‌హెచ్ రైలింజన్లు: 7

• డబ్ల్యుఎజి -9 ట్విన్ రైలింజన్లు: 148

• డబ్ల్యుఎపి -5 రైలింజన్లు: 2

• డబ్ల్యుఎపి -7 రైలింజన్లు: 272

• ఎన్ఆర్‌సి రైలింజన్లు: 5

• డబ్ల్యుఎజి-12బి రైలింజన్లు: 100

• డబ్ల్యుడిజి 4జి/6జి రైలింజన్లు: 100

 

***


(Release ID: 2118099) Visitor Counter : 21