ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 30 MAR 2025 2:34PM by PIB Hyderabad

భారత్ మాతాకీ జై,

భారత్ మాతాకీ జై,

భారత్ మాతాకీ జై,

గుడి పడ్వానూతన సంవత్సరారంభం సందర్భంగా నేను మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.  అత్యంత గౌరవనీయ సర్‌ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ స్వామి గోవింద్ గిరి జీ మహారాజ్స్వామి అవధేశానంద్ గిరి జీ మహారాజ్ప్రజాదరణ పొందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ డాక్టర్ అవినాష్ చంద్ర అగ్నిహోత్రిఇతర గౌరవ ప్రముఖులుఇంకా ఇక్కడ హాజరైన సీనియర్ సహచరులారాఈరోజు రాష్ట్ర యజ్ఞం అనే పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు లభించిందిఈరోజు చైత్ర శుక్ల ప్రతిపాద  ఎంతో ప్రత్యేకమైన రోజుపవిత్ర నవరాత్రుల ఉత్సవాలు కూడా కూడా ఈరోజు ప్రారంభమవుతున్నాయిదేశంలోని వివిధ ప్రాంతాల్లో గుడి పడ్వాఉగాదినవరే పండుగలను కూడా ఈ రోజు జరుపుకుంటున్నారుఅలాగే ఈరోజు ఝులేలాల్ జీగురు అంగద్ దేవ్ జీ జయంతి కూడాఇవే కాకుండాఈ రోజు మన స్ఫూర్తి ప్రదాతఅత్యంత గౌరవనీయ డాక్టర్ సాహెబ్ జయంతి సందర్భం కూడాఅలాగేఈ ఏడాది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఘనమైన 100 ఏళ్ల ప్రయాణం కూడా పూర్తవుతోందిఈ సందర్భంలోఈ రోజు స్మృతి మందిరాన్ని సందర్శించిగౌరవనీయ డాక్టర్ సాహెబ్,  గౌరవనీయ గురూజీకి నివాళులర్పించే అవకాశం నాకు లభించింది.

మిత్రులారా,

ఈ మధ్యనే మన రాజ్యాంగం 75 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకున్నాంవచ్చే నెల మన రాజ్యాంగ శిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి.  ఈ రోజునేను దీక్షాభూమిలో బాబా సాహెబ్‌కు నమస్కరించిఆయన ఆశీస్సులు తీసుకున్నానుఈ మహనీయులకు నేను ప్రణమిల్లుతున్నానునవరాత్రి సహా అన్ని పండుగల సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు నాగ్‌పూర్‌లోఈ పవిత్ర సంఘ సేవ యాత్రలోమనం ఒక పవిత్ర సంకల్పం విస్తరణకు సాక్షులమవుతున్నాంఇప్పుడే మాధవ్ నేత్రాలయ కుల్‌గీతంలో విన్నాంఇది ఆధ్యాత్మికతవిజ్ఞానంవిశ్వాసంమార్గదర్శకంతో కూడిన అద్భుతమైన పాఠశాలమానవత్వానికి అంకితమైన ఈ సేవా మందిరం ప్రతి అణువులోనూ ఒక దేవాలయంలా నిలుస్తుందిపూజ్య గురూజీ ఆదర్శాలపై అనేక దశాబ్దాలుగా లక్షలాది మందికి సేవలందిస్తున్న సంస్థ మాధవ్ నేత్రాలయంప్రజల జీవితాల్లో తిరిగి వెలుగు ప్రసాదించిందిఈ రోజు మాధవ్ నేత్రాలయ కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన జరిగింది.. ఈ కొత్త క్యాంపస్‌తోఈ సేవా కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగనున్నాయిఇది వేలాదిమంది కొత్తవారి జీవితాల్లో వెలుగును ప్రసరింపజేస్తుందివారి జీవితాల్లోని చీకట్లు తొలగిపోతాయిమాధవ్ నేత్రాలయతో అనుసంధానమైన ప్రతి ఒక్కరి సేవాభావానికివారు చేసిన పనులకు నా అభినందనలు తెలియజేస్తున్నానువారికి నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను.

మిత్రులారా,

ఎర్రకోట నుంచి నేను అందరి ప్రయత్నాల గురించి మాట్లాడానుఈరోజు దేశం ఆరోగ్య రంగంలో చేస్తున్న విధంగామాధవ్ నేత్రాలయం ఆ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళుతోందిదేశంలోని ప్రతి పౌరుడు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను పొందడం మా ప్రాధాన్యతగా ఉందిదేశంలో నిరుపేదలకు కూడా ఉత్తమ వైద్యం అందాలిదేశంలోని ప్రతి పౌరుడు గౌరవంతో జీవించాలిదేశం కోసం తమ జీవితాలను అంకితం చేసిన వృద్ధులు చికిత్స గురించి ఆందోళనతో జీవించే పరిస్థితి ఉండకూడదుఇది ప్రభుత్వ విధానం.  అందుకే నేడు ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది మందికి ఉచిత వైద్య సదుపాయాలు అందిస్తున్నాంవేలాది జన ఔషధి కేంద్రాలు దేశంలోని పేదమధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలకు మందులను అందిస్తున్నాయిదేశంలో ఇప్పుడు సుమారు వెయ్యి డయాలిసిస్ కేంద్రాలు పనిచేస్తున్నాయిఇవి ఉచిత డయాలిసిస్ సేవలను ఒక యజ్ఞంగాకొనసాగిస్తున్నాయిదీని ద్వారా దేశ ప్రజల వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయివారికి ఆరోగ్య పరంగా ప్రయోజనాలు అందుతున్నాయిగత 10 సంవత్సరాల్లోగ్రామాల్లో లక్షలాది ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయిఇక్కడ ప్రజలు దేశంలోని ప్రముఖ వైద్యుల నుంచి టెలిమెడిసిన్ ద్వారా సంప్రదింపులు పొందుతున్నారుప్రాథమిక చికిత్సను అందుకుంటున్నారు ఇంకా అవసరమైన తదుపరి సహాయాన్ని పొందుతున్నారువ్యాధి పరీక్షల కోసం వందలాది కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం ఇప్పుడు వారికి లేదు

మిత్రులారా,

మేం కేవలం మెడికల్ కాలేజీల సంఖ్యను రెండింతలు చేయడమే కాకుండాదేశంలో పని చేస్తున్న ఎయిమ్స్ ల సంఖ్యను మూడింతలు చేశాందేశంలో మెడికల్ సీట్లు కూడా రెండింతలు అయ్యాయిరాబోయే కాలంలో ప్రజలకు మరింత మంది మంచి డాక్టర్లు అందుబాటులో ఉండేలా చేయడం మా లక్ష్యంస్వాతంత్ర్యం తర్వాత తొలిసారిమేము చాలా సాహసోపేత నిర్ణయం తీసుకున్నాందేశంలోని పేద పిల్లలు కూడా వైద్యులుగా మారి తమ కలలను సాకారం చేసుకోవాలనే ఉద్దేశంతోవిద్యార్థులకు వారి మాతృభాషలో వైద్య విద్య అభ్యసించే అవకాశాన్ని అందించాంఆధునిక వైద్య శాస్త్రానికి సంబంధించిన ఈ ప్రయత్నాలతో పాటుదేశం తన సాంప్రదాయ పరి జ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేస్తోందిమన యోగాఆయుర్వేదం కూడా నేడు మొత్తం ప్రపంచంలో ఒక కొత్త గుర్తింపును పొందాయి.  భారతదేశం గౌరవం పెరుగుతోంది.

మిత్రులారా,

ఏ దేశ మనుగడయినా దాని సంస్కృతిచైతన్యం విస్తరణ తరతరాలుగా కొనసాగడంపై ఆధారపడి ఉంటుందిమన దేశ చరిత్రను చూస్తేవందల ఏళ్ల కొద్దీ బానిసత్వంఅనేక దండయాత్రలుభారతదేశ సామాజిక వ్యవస్థను చిన్నభిన్నం చేయడానికి జరిగిన ఎన్నో దుర్మార్గ ప్రయత్నాలు కనిపిస్తాయికానీ భారతదేశ చైతన్యం ఎప్పటికీ అంతం కాలేదుఆ జ్యోతి వెలుగుతూనే ఉంది. ఇది ఎలా సాధ్యమైందిఎందుకంటే అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా ఈ చైతన్యాన్ని సజీవంగా ఉంచడానికి దేశంలో కొత్త సామాజిక ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయిభక్తి ఉద్యమం ఇందుకు ఒక ఉదాహరణ. ఇది మన అందరికీ బాగా తెలిసిన విషయమేమధ్యయుగంలో ఉన్న ఆ క్లిష్ట కాలంలోమన సాధువులు భక్తి భావనల ద్వారా జాతీయ చైతన్యానికి కొత్త శక్తిని అందించారుగురు నానక్ దేవ్ కబీర్దాస్తులసీదాస్సూరదాస్ఇక్కడ మన మహారాష్ట్రలో సంత్ తుకారాంసంత్ ఏకనాథ్సంత్ నామదేవ్సంత్ జ్ఞానేశ్వర్ వంటి అనేక సాధువులు తమ మౌలిక ఆలోచనలతో మన జాతి చైతన్యానికి ప్రాణం పోశారుఈ ఉద్యమాలు వివక్షకు అడ్డుకట్ట వేసిసమాజాన్ని ఐక్యత అనే దారంతో అనుసంధానించాయి.

అలాగేస్వామి వివేకానంద వంటి మహానుభావులు ఉన్నారుఆయన నిరాశలో మునిగిపోయిన సమాజాన్ని కదిలించారుదాని అసలు స్వరూపాన్ని గుర్తు చేశారుఆత్మవిశ్వాసాన్ని కలిగించారు.  మన జాతీయ చైతన్యాన్ని నిర్జీవం కాకుండా కాపాడారుబానిసత్వం చివరి దశల్లోడాక్టర్ సాహెబ్గురూజీ వంటి గొప్ప వ్యక్తులు మన జాతీయ చైతన్యానికి కొత్త శక్తిని అందించేందుకు కృషి చేశారుఈరోజు మనం చూస్తున్నదిజాతీయ చైతన్యాన్ని సంరక్షించేందుకు,  ప్రోత్సహించేందుకు 100 ఏళ్ల క్రితం నాటిన ఆలోచనా బీజం నేడు మహా వటవృక్షంగా ప్రపంచం ముందు ఉండడాన్ని మనం చూస్తున్నాంసూత్రాలుఆదర్శాలు ఈ వటవృక్షాన్ని మరింత ఎత్తుకు పెంచాయిలక్షలాదిమంది స్వయంసేవకులు దాని శాఖలుగా నిలుస్తున్నారుఇది సాధారణ వటవృక్షం కాదు. భారతదేశ అమర సంస్కృతికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఒక ఆధునిక అక్షయ వృక్షంగా నిలిచి భారతీయ సంస్కృతినిమన జాతి చైతన్యాన్ని నిరంతరం ఉత్తేజపరుస్తోంది.

మిత్రులారా,

ఈరోజుమేము మాధవ్ నేత్రాలయ కొత్త ప్రాంగణ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలోదృష్టి గురించి మాట్లాడటం సహజందృష్టి మన జీవితాల్లో దిశను నిర్దేశిస్తుందిఅందుకే వేదాలు కూడా పశ్యేమ శరదః శతమ్అంటే శత వసంతాలను చూసే భాగ్యం కలగాలనికోరతాయిఅంటేమనం శత వసంతాలు చూడాలని ఆకాంక్షించాలిఈ దృష్టి కేవలం కళ్లతో చూడడం మాత్రమే కాదుబాహ్య దృష్టితో పాటు అంతర్గత దృష్టి కూడా ఉండాలిఅంతర్గత దృష్టి గురించి మాట్లాడినప్పుడువిదర్భ ప్రాంత మహానీయుడు శ్రీ గులాబ్రావు మహారాజ్ సహజంగానే మనకు గుర్తుకు వస్తారుఅందరూ ఆయన్ని  ప్రజ్ఞాచక్షు అని పిలిచేవారుచిన్న వయసులోనే ఆయన తన దృష్టిని కోల్పోయారుకానీ లోపం ఆయన రచనా సామర్థ్యాన్ని తగ్గించలేదుఆయన అనేక గ్రంథాలు రచించారుఇప్పుడు ఎవరికైనా ఈ ప్రశ్న రావచ్చు — కళ్లతో చూడలేని ఒక వ్యక్తి ఎలా ఇన్ని గ్రంథాలు ఎలా రాయగలిగారుదానికి సమాధానం ఏమిటంటే — కళ్లు లేకపోవచ్చుకానీ ఆయన వద్ద దృష్టి ఉందిఆ దృష్టి ఆత్మసాక్షాత్కారానికి సంబంధించినదిజ్ఞానానికి సంబంధించినదిదృష్టి అనేది కేవలం బయటి ప్రపంచాన్ని చూడటానికి మాత్రమే కాదుఅంతర్గతంగా లోకాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కూడాఈ దృష్టి వ్యక్తికీ,  సమాజానికీ కూడా అపారమైన శక్తిని అందిస్తుందిరాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కూడా అటువంటి ఒక సంస్కార యజ్ఞంఇది అంతర్గత దృష్టిబాహ్య దృష్టి రెండింటితో పనిచేస్తోందిబాహ్యదృష్టిగా మనం మాధవ్ నేత్రాలయాన్ని చూస్తాంఅంతర్గత దృష్టితో సేవకు పర్యాయంగా సంఘ్ ను చూస్తాం

మిత్రులారా,

ఇక్కడ ఒక గొప్ప మాట ఉంది —

పరోపకారాయ ఫలంతి వృక్షాఃపరోపకారాయ వహంతి నద్యః।

పరోపకారాయ దుహంతి గావఃపరోపకారార్థమిదం శరీరం।।”

అంటేవృక్షాలు పరోపకారం కోసం ఫలిస్తాయినదులు పరోపకారం కోసం ప్రవహిస్తాయిగోవులు పరోపకారం కోసం పాలిస్తాయిమన శరీరం కూడా పరోపకారం కోసమే ఉందిమన శరీరానికి అసలు అర్థం పరోపకారం చేయడంఇప్పుడుఈ సేవా భావన మన సంస్కారాల్లో భాగం అయిపోయినప్పుడుసేవే సాధనగా మారుతుందిఅది కేవలం ఒక కార్యం కాకుండాఆత్మసాక్షాత్కారం సాధించేందుకు మార్గంగా మారుతుందిఈ సాధన ప్రతి స్వయంసేవకుడి జీవితానికి ప్రాణవాయువులాంటిదిఈ సేవా సంస్కారంఈ సాధనఈ ప్రాణవాయువు తరతరాలుగా ప్రతి స్వయంసేవకుడిని తపస్సు కోసం ప్రేరేపిస్తోంది.ఈ సేవా భావం ప్రతి స్వయంసేవకుడిని నిరంతరం ముందుకు సాగేలా చేస్తుందిఅతనిని ఎన్నటికీ అలసిపోనివ్వదుఆగిపోనివ్వదుపూజ్య గురూజీ తరచుగా ఇలా చెప్పేవారు —“జీవితం ఎంతకాలం సాగిందో కాదుఅది ఎంత ఉపయోగకరంగా ఉన్నదో అటువంటి జీవితం అసలైన జీవితం.” మన జీవితం ప్రాముఖ్యత దాని కాలంతో కాదుఅది ఇతరులకు ఎంత ఉపయోగకరంగా మారిందో అనే దానిలో ఉందిమేం దేశం కోసం దేవుని నుండి ప్రేరణ తీసుకున్నాంరాముడి నుండి దేశ భక్తి నేర్చుకున్నాంమా కర్తవ్యాన్ని నిరంతరం నిర్వర్తిస్తూ ఉంటాంఅందుకే మనం చూస్తున్నాం —పని ఎంత పెద్దదైనాచిన్నదైనాఏ రంగంలోనైనాసరిహద్దు గ్రామాలుకొండ ప్రాంతాలుఅరణ్య ప్రాంతాలు అయినాసంఘ స్వయంసేవకులు నిస్వార్థంగా సేవచేస్తూనే ఉంటారుఎక్కడో ఎవరో వనవాసి కల్యాణ ఆశ్రమం పనిని తమ లక్ష్యంగా చేసుకుని అందులో నిమగ్నమయ్యారుఇంకో చోట ఎక్కడో ఎవరో ఏకలవ్య విద్యాలయ ద్వారా ఆదివాసీ పిల్లలకు బోధిస్తూ ఉన్నారుమరో చోట ఎవరో సాంస్కృతిక చైతన్యం కోసం పని చేస్తున్నారుఅలాగేఎవరో సేవా భారతిలో చేరి పేదలువెనుకబడిన వారికి సేవలందిస్తున్నారు

ఇటీవలి కాలంలో ప్రయాగ్‌లో జరిగిన కుంభమేళాలో స్వయంసేవకులు లక్షల మందికి ఎలా సహాయం చేశారో చూశాంఅంటేఎక్కడ సేవ ఉందో అక్కడ స్వయంసేవకులు ఉన్నారుఎప్పుడైనా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడుఅది వరదల విధ్వంసం అయినాలేదా భూకంపం అయినా స్వయంసేవకులు క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా అక్కడకు చేరుకుంటారువారు తమ సమస్యలు పట్టించుకోరుతమ బాధల గురించి ఆలోచించరుకేవలం సేవా భావంతో పనిలో నిమగ్నమైపోతారుసేవ మా హృదయాలలో ఉందిఅది యజ్ఞకుండంఅందులో మేము సమిధలవుతాంనదిగా సముద్రంలో కలసిపోతాం

మిత్రులారా,

ఒకసారి ఇంటర్వ్యూలో గౌరవ గురూజీని ఒక ప్రశ్న అడిగారు — సంఘాన్ని ఎందుకు సర్వవ్యాప్తమని పిలుస్తారుగురూజీ ఇచ్చిన సమాధానం ఎంతో ప్రేరణదాయకంఆయన సంఘాన్ని వెలుగుతో పోల్చారుగురూజీ అన్నారు — వెలుగు సర్వవ్యాప్తమవుతుందికానీఅది అన్ని పనులను ఒక్కటే చేయదుఅయితేఅది చీకటిని తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందిఇతరులు పని చేసేందుకు మార్గాన్ని చూపుతుందిగురూజీ ఇచ్చిన ఈ బోధన మనకు ఒక జీవన మంత్రంమనం వెలుగుగా మారి చీకటిని తొలగించాలిఅడ్డంకులను దూరం చేయాలిమార్గాన్ని సృష్టించాలి.ఈ భావన మన జీవితాంతం మన మనసులోంచి వినిపిస్తూ ఉండాలిప్రతిఒక్కరూ ఈ ఆలోచనను కొంతమేర అయినా అనుసరించేందుకు ప్రయత్నించాలినేను-నువ్వు కాదునేను మేము కాదు, “ఇదం రాష్ట్రాయ ఇదం న మమ” (ఇది దేశానిదేనాది కాదు).

మిత్రులారా,

ప్రయత్నాల సమయంలో “నేను” కంటే “మేము” అనే భావనపై దృష్టి పెట్టినప్పుడుదేశం తొలి ప్రాధాన్యం అనే భావనతో ఉన్నప్పుడువిధానాలు నిర్ణయాలలో దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని పరిగణించినప్పుడు అప్పుడు ప్రతి చోటా ఆ ప్రభావంఆ వెలుగు స్పష్టంగా కనిపిస్తుంది.అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మన దేశాన్ని కట్టిపడేసిన సంకెళ్లను తెంచడం అత్యంత ముఖ్యంఈ రోజు మనం చూస్తున్నాం — భారతదేశం బానిసత్వ మనస్తత్వం నుంచి ముందుకు సాగుతోంది. 70 ఏళ్ల పాటు దేశంపై మిగిలిపోయిన బానిసత్వపు మచ్చలు ఇప్పుడు జాతీయ గర్వానికి సంబంధించిన కొత్త అధ్యాయాలతో మాసిపోతున్నాయిభారత ప్రజలను తక్కువగా చూడడానికి రూపొందించిన ఆంగ్లేయ చట్టాలను ఇప్పుడు దేశం మార్చుకుందిబానిసత్వపు ఆలోచనతో రూపొందించిన శిక్షాస్మృతి స్థానంలో ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత వచ్చిందిమన ప్రజాస్వామ్య ప్రాంగణంలో ఇక రాజ్ పథ్ లేదుఇక అది కర్తవ్య పథమేబానిసత్వానికి సంకేతం మన నావికాదళం జెండా మీద కూడా ముద్రితమైంది. ఇప్పుడు శివాజీ మహారాజ్ చిహ్నం నావికాదళం జెండా మీద కొలువు తీరిందిదేశం కోసం వీర సావర్కర్ చిత్రహింసలకు గురైననేతాజీ సుభాష్ బాబు స్వాతంత్ర్య యుద్ధ గర్జన చేసిన ఆండమాన్ దీవులు కూడా ఇప్పుడు స్వాతంత్ర్య సమరయోధుల పేర్లను సంతరించుకున్నాయి

మిత్రులారా,

మన వసుధైక కుటుంబం మంత్రం ఈరోజు ప్రపంచం నలుమూలలకూ చేరుతోందిమన కార్యకలాపాల్లో కూడా ఈ భావనను ప్రపంచం చూస్తోంది,  అనుభవిస్తోందికొవిడ్ మహమ్మారి వచ్చినప్పుడుభారతదేశం ప్రపంచాన్ని కుటుంబంగా భావించి టీకాలు అందించిందిప్రపంచంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు జరిగినాభారతదేశం పూర్తి అంకితభావంతో సేవ చేయడానికి సంసిద్ధంగా ఉంటుందినిన్ననే మీరు చూశారు —మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించినప్పుడుభారతదేశం అక్కడి ప్రజలకు సహాయం అందించడానికి ఆపరేషన్ బ్రహ్మ ద్వారా మొదటగా చేరుకుందితుర్కియేలో భూకంపం వచ్చినప్పుడు,నేపాల్‌లో భూకంపం సంభవించినప్పుడుమాల్దీవుల్లో నీటి సంక్షోభం ఏర్పడినప్పుడు కూడా భారతదేశం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఆపన్న హస్తం అందించిందియుద్ధం వంటి సమయాల్లో కూడా భారతదేశం ఇతర దేశాల పౌరులను సురక్షితంగా తరలించడం కోసం సహాయంగా నిలుస్తోందిఈరోజు భారతదేశం అభివృద్ధి చెందడాన్ని ప్రపంచం చూస్తోందిమొత్తం గ్లోబల్ సౌత్ గళంగా కూడా భారత్ ఈ విశ్వ సోదరభావ స్స్పూర్తి మన సంస్కృతీ విలువల విస్తరణను చాటుతోంది

మిత్రులారా,

ఈరోజు భారతదేశానికి ఉన్న అతి పెద్ద ఆస్తి మన యువతఇప్పటి భారత యువత ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నదో మనం స్పష్టంగా చూస్తున్నాంవారిలో సవాళ్ళను ప్రమాదాలను స్వీకరించే సామర్థ్యం గతంతో పోలిస్తే చాలా రెట్లు పెరిగింది.వారు కొత్త ఆవిష్కరణలు చేస్తూస్టార్ట్-అప్ ప్రపంచంలో తమ జెండా ఎగరవేస్తున్నారుముఖ్యంగా — ఈరోజు భారత యువత తమ వారసత్వంపై గర్వపడుతున్నారుతమ సంస్కృతిని చూసి గర్విస్తున్నారుఇటీవల ప్రయాగరాజ్ మహా కుంభమేళ లో మనం చూశాంనేటి యువత లక్షల సంఖ్యలో పాల్గొని ఈ సనాతన సంప్రదాయంతో అనుసంధానమై గర్వభావంతో నిండిపోయారుఈ రోజు భారత యువత దేశానికి  ఏది అవసరమో గుర్తించి ఆ దిశగా శ్రమిస్తున్నారుభారత యువత “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమాన్ని విజయవంతం చేసిందిఅలాగేవారు “వోకల్ ఫర్ లోకల్” భావనకు పూర్తి మద్దతు అందిస్తున్నారు.ఈ రోజు యువతలో ఒక ఉత్సాహం ఏర్పడిందివారిలో దేశం కోసం బ్రతకాలిదేశం కోసం ఏదో చేయాలి అనే భావనఆటస్థలాల నుంచి అంతరిక్ష శిఖరాల వరకుమన యువత దేశ నిర్మాణ స్పూర్తితో నిరంతరం ముందుకుముందుకు సాగుతోందిఇదే యువత 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య పతాకాన్ని పట్టుకొని గర్వంగా ముందుకు సాగుతోందిఅప్పటికి మన స్వాతంత్ర్యానికి 100 సంవత్సరాలు పూర్తవుతాయినాకు పూర్తి విశ్వాసం ఉందిసంఘటితం,, అంకితభావంసేవ అనే ఈ త్రివేణి వికసిత భారత ప్రయాణానికి ఇంకా ఎక్కువ శక్తిని,  దిశను అందిస్తూనే ఉంటుందిఎన్నో సంవత్సరాలుగా సంఘ్ చేసిన కష్టం ఇప్పుడు ఫలితాలు ఇస్తోందిఎన్నో సంవత్సరాల తపస్సు ఇప్పుడు వికసిత భారత కొత్త అధ్యాయాన్ని రాస్తోంది.

మిత్రులారా,

సంఘ్ ఏర్పడినప్పుడు భారతదేశ పరిస్థితులు భిన్నంగా ఉండేవిసందర్భాలు కూడా పూర్తిగా వేరు.1925 నుంచి  1947 వరకు అది ఒక పోరాట కాలందేశానికి స్వాతంత్ర్యం అనే మహత్తర లక్ష్యం ముందుండేదిఈ రోజుసంఘ్ 100 ఏళ్ల ప్రయాణం అనంతరందేశం మరో కీలక దశ వద్ద నిలిచింది. 2025 నుంచి 2047 వరకు —ఈ ముఖ్యమైన కాలంలో మళ్లీ మన ముందు మహత్తర లక్ష్యాలు ఉన్నాయిఒకప్పుడు గౌరవ గురూజీ ఒక పత్రంలో రాశారు —మన మహత్తర దేశానికి నేను ఒక చిన్న రాయి అయినా సరే పునాదిగా ఉండాలనుకుంటున్నానుఅయోధ్యలో రామ మందిర నిర్మాణం సందర్భంగా నేను చెప్పినట్టుగా —సేవా సంకల్పాన్ని మనం ఎప్పటికీ సజీవంగా ఉంచుకోవాలిమన శ్రమను ఎప్పటికీ కొనసాగించాలివికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసుకోవాలిమరొక వెయ్యి సంవత్సరాల పాటు బలమైన భారతదేశానికి పునాదులు వేయాల్సిన బాధ్యత మనపై ఉందినాకు పూర్తి విశ్వాసం ఉంది —గౌరవ డాక్టర్ సాహెబ్,  గురూజీ వంటి మహానుభావుల మార్గదర్శనం మనకు ఎల్లప్పుడూ శక్తిని అందిస్తూనే ఉంటుందిమనం అభివృద్ధి చెందిన భారత్ ను సాధిస్తాంమన గత తరాల బలిదానాలను అర్ధవంతంగా చేస్తాంఈ సంకల్పంతోఈ శుభ నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ మరో సారి శుభాకాంక్షలుమీకు చాలా చాలా ధన్యవాదాలు!

గమనికఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు అనువాదం.

***


(Release ID: 2116972) Visitor Counter : 24