ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎం) ద్వారా బీహార్ లో 120.10 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ పాట్నా-అర్రా-ససారం కారిడార్ (ఎన్ హెచ్ -119ఏ) నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం
Posted On:
28 MAR 2025 4:16PM by PIB Hyderabad
బీహార్ లోని పాట్నా నుంచి ససారం (120.10 కి.మీ) వరకు నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ , బ్రౌన్ ఫీల్డ్ పాట్నా - అర్రా - ససారం కారిడార్ నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. మొత్తం రూ.3,712.40 కోట్ల పెట్టుబడితో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎం) ద్వారా ఈ ప్రాజెక్టును చేపడతారు.
ప్రస్తుతం ససారాం, అర్రా, పట్నా మధ్య కనెక్టివిటీ ప్రధానంగా రాష్ట్ర రహదారులు (ఎస్ హెచ్-2, ఎస్ హెచ్ -12, ఎస్ హెచ్ -81, ఎస్ హెచ్ -102) ద్వారా కొనసాగుతోంది. అయితే అర్రా పట్టణం సహా ఆ మార్గంలో భారీ ట్రాఫిక్ కారణంగా ప్రయాణానికి 3-4 గంటల సమయం పడుతోంది. భారీగా పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించేందుకు గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌తో పాటు 10.6 కిలోమీటర్ల బ్రౌన్‌ఫీల్డ్ హైవేను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఇది అర్రా, గ్రహిణి, పిరో, బిక్రమ్‌గంజ్, మోకర్, ససారాం వంటి భారీగా విస్తరించిన ప్రాంతాల అవసరాలను తీర్చడానికి దోహదపడుతుంది.
ఈ ప్రాజెక్ట్ మార్గాన్ని ఎన్ హెచ్-19, ఎన్ హెచ్-319, ఎన్ హెచ్-922, ఎన్ హెచ్-131జి, ఎన్ హెచ్-120 వంటి ప్రధాన రవాణా మార్గాలతో అనుసంధానించనున్నారు. ఇది ఔరంగాబాద్, కైమూర్, పాట్నాకు నిరంతర రవాణా సదుపాయాన్ని అందిస్తుంది. ఇంకా, ఈ ప్రాజెక్ట్ పాట్నాలోని జయ ప్రకాశ్ నారాయణ అంతర్జాతీయ విమానాశ్రయం, నిర్మాణంలో ఉన్న బిహిత విమానాశ్రయంతో పాటు, ససారాం, అర్రా, దానాపూర్, పాట్నా మొదలైన నాలుగు 4 ప్రధాన రైల్వే స్టేషన్లు, అలాగే పాట్నాలోని ఒక అంతర్గత జల మార్గ టర్మినల్‌కు అనుసంధానం కల్పిస్తుంది. ఇది పాట్నా రింగ్ రోడ్డుకు ప్రత్యక్ష అనుసంధానంతో, సరుకులు, ప్రయాణికుల వేగవంతమైన రవాణాకు తోడ్పడుతుంది.
పాట్నా-అర్రా-ససారం కారిడార్ నిర్మాణం పూర్తయితే అది ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. లక్నో, పాట్నా, రాంచీ, వారణాసిల మధ్య రవాణా అనుసంధానం మరింత మెరుగు పడుతుంది. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఉన్న ఈ ఈ ప్రాజెక్టు మౌలిక సదుపాయాలను పెంచి ఉపాధి కల్పనతో పాటు బీహార్ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టు 48 లక్షల పనిదినాలను సృష్టిస్తుంది. పట్నా, దాని చుట్టుపక్కల విస్తరిస్తున్న ప్రాంతాలలో అభివృద్ధి, సంపద పెరుగుదలకు కొత్త అవకాశాలను అందిస్తుంది.
కారిడార్ స్వరూపం

ప్రాజెక్ట్ వివరాలు
ముఖ్య భాగాలు
|
వివరాలు
|
ప్రాజెక్టు పేరు
కారిడార్
|
4-లేన్ల గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ పాట్నా-అర్రా-ససారం కారిడార్
పాట్నా-అర్రా-ససారం (ఎన్ హెచ్-119ఎ)
|
పొడవు (కిలోమీటర్లలో )
|
120.10
|
మొత్తం సివిల్ పనుల వ్యయం (రూ. కోట్లలో)
|
2,989.08
|
భూసేకరణ వ్యయం (రూ. కోట్లలో)
|
718.97
|
మొత్తం పెట్టుబడి వ్యయం (రూ. కోట్లలో)
|
3,712.40
|
నిర్మాణ విధానం
|
హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఎఎం)
|
కలవనున్న ప్రధాన రహదారులు
|
జాతీయ రహదారులు - ఎన్హెచ్-19, ఎన్హెచ్-319, ఎన్హెచ్-922, ఎన్హెచ్-131జీ, ఎన్హెచ్-120
రాష్ట్ర రహదారులు - ఎస్హెచ్-2, ఎస్హెచ్-81, ఎస్హెచ్-12, ఎస్హెచ్-102
|
అనుసంధానం కానున్న ఆర్థిక/సామాజిక/రవాణా మార్గాలు
|
విమానాశ్రయాలు: జయ్ ప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం (పట్నా), బిహితా విమానాశ్రయం (రాబోయేది)
రైల్వేస్టేషన్లు: ససారం, అర్రా, దానాపూర్, పాట్నా
ఇన్ ల్యాండ్ వాటర్ టెర్మినల్: పాట్నా
|
అనుసంధానం కానున్న ప్రధాన నగరాలు/ పట్టణాలు
|
పాట్నా, అర్రా, ససారం
|
ఉపాధి కల్పన సామర్ధ్యం
|
22 లక్షల పనిదినాలు (ప్రత్యక్షంగా), 26 లక్షల పనిదినాలు (పరోక్షంగా)
|
ఆర్థిక సంవత్సరం-25లో వార్షిక సగటు రోజువారీ ట్రాఫిక్ (ఏఏడీటీ)
|
17,000-20,000 ప్యాసింజర్ కార్ యూనిట్లు (పీసీయూలు) గాఅంచనా
|
|
|
****
(Release ID: 2116395)
Visitor Counter : 29
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam