హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పద్మ అవార్డులు-2026 నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

Posted On: 15 MAR 2025 3:50PM by PIB Hyderabad

2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులు-2026 కోసం నామినేషన్లుసిఫార్సుల స్వీకరణ 2025 మార్చి 15న ప్రారంభించారుపద్మ అవార్డుల నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ 2025 జూలై 31. పద్మ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు/సిఫార్సులను రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.inపై ఆన్ లైన్ లో మాత్రమే స్వీకరిస్తారు.

పద్మ విభూషణ్పద్మ భూషణ్ పద్మశ్రీ పేర్లతో ఇచ్చే పద్మ అవార్డులు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. 1954లో ఏర్పాటైన ఈ అవార్డులను ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారుకళలుసాహిత్యంవిద్యక్రీడలువైద్యంసోషల్ వర్క్సైన్స్ అండ్ ఇంజనీరింగ్పబ్లిక్ అఫైర్స్సివిల్ సర్వీస్ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ వంటి అన్ని రంగాలు విభాగాలలో విశిష్టఅసాధారణ విజయాలు సేవలకు గాను ఈ అవార్డును ఇస్తారుజాతివృత్తిహోదా లేదా లింగ భేదం లేకుండా వ్యక్తులందరూ ఈ అవార్డులకు అర్హులుడాక్టర్లుసైంటిస్టులు మినహా పీఎస్ యూల్లో పనిచేసే వారితో సహా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం పద్మ అవార్డులకు అనర్హులు.

ప్రభుత్వం పద్మ అవార్డులను “ప్రజల పద్మ”గా మార్చడానికి కట్టుబడి ఉందిఅందువల్లపౌరులందరూ స్వీయ నామినేషన్ సహా నామినేషన్లు/సిఫారసులు చేయాలని కోరుతోందిమహిళలుసమాజంలోని బలహీన వర్గాలుఎస్సీలుఎస్టీలుదివ్యాంగులు ఇంకా సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న వారిలో గుర్తింపు పొందేందుకు అర్హత కలిగిన ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించడానికి సమష్టి ప్రయత్నాలు జరగాలని ప్రభుత్వం భావిస్తోంది.

నామినేషన్లు/సిఫారసులు పైన పేర్కొన్న పోర్టల్‌లోని ఫార్మాట్‌లో సూచించిన సంబంధిత వివరాలను కలిగి ఉండాలిసిఫారసు చేసే వ్యక్తి సంబంధిత రంగం/శాఖలో చేసిన విశిష్టమైనఅసాధారణమైన కృషి/సేవ‌ను స్పష్టంగా తెలియచేస్తూ గరిష్టంగా 800 పదాల్లో వివరణాత్మక సమాచారం ఉండాలి.

సంబంధిత వివరాలు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ (https://mha.gov.inలోని ‘Awards and Medals’ విభాగంలోనూపద్మ అవార్డుల పోర్టల్ (https://padmaawards.gov.inలోనూ అందుబాటులో ఉన్నాయిఈ అవార్డులకు సంబంధించిన నియమ నిబంధనలను ఈ లింక్‌లో చూడవచ్చుhttps://padmaawards.gov.in/AboutAwards.aspx.

 

***


(Release ID: 2111700) Visitor Counter : 10