సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
శ్రేష్ఠత పురస్కారాలు
ఏవీసీజీ-ఎక్స్ ఆర్ రంగాల్లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాల దిశగా భవిష్య ప్రణాళికలతో సన్నద్ధం
Posted On:
10 MAR 2025 2:03PM by PIB Hyderabad
పరిచయం
కేంద్ర సమాచార, ప్రసారమంత్రిత్వశాఖ సహకారంతో, ఆసిఫా( ఏఎస్ఐఎఫ్ఏ) ఇండియా సంస్థ నిర్వహించబోయే వేవ్స్ శ్రేష్ఠత పురస్కారాలు... షో రీళ్ళు, అడ్వర్టైజింగ్ ఫిలిమ్ ల రంగం కోసం నిర్దేశించిన ప్రతిష్ఠాత్మకమైన పోటీలు. యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ కి సంబంధించిన పలు రంగాల్లో పనిచేసే వృత్తి నిపుణులు, విద్యార్థుల కోసం ఈ పోటీలను నిర్వహిస్తారు. దేశ వినోద రంగంలో అత్యుత్తమ స్థాయి సృజనాత్మకతను ప్రదర్శించే విధంగా పోటీలో పాల్గొనే వారు కొత్త తరహా ఆలోచనలతో ముందుకు రాగలరని వేవ్స్ సీజన్-1 ఆశిస్తోంది.

మొత్తం మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలను ఒక చోటికి చేర్చే ఉత్తమ నైపుణ్యాల వేదికగా అవతరించాలనే లక్ష్యంతో ప్రపంచ ఆడియో విజువల్, వినోదరంగ సదస్సు – వేవ్స్ తొలి సదస్సు జరగనుంది. ప్రపంచ మీడియా, వినోద రంగాల దృష్టిని ఆకర్షించడం ద్వారా భారత్ మీడియా, వినోద రంగాలను, ఆయా రంగాల్లో పనిచేసేవారిని వివిధ దేశాల మీడియా రంగంతో అనుసంధించాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటవుతోంది.
మే 1 నుంచి 4వ తేదీ వరకూ, ముంబయి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ అండ్ జియో వరల్డ్ గార్డెన్స్ లో ఈ సదస్సు జరుగుతుంది. బ్రాడ్ కాస్టింగ్ అండ్ ఇన్ఫోటెయిన్మెంట్, ఏవీసీజీ-ఎక్స్ ఆర్, డిజిటల్ మీడియా అండ్ ఇన్నోవేషన్, ఫిలిమ్స్ అనే నాలుగు కీలక రంగాలపై దృష్టి సారించే వేవ్స్, భారత వినోద రంగ పరిశ్రమల భవిష్యత్తును నిర్దేశించే నాయకులు, సృజనకారులు, సాంకేతిక నిపుణులను ఒక చోటకు చేర్చనుంది.
వేవ్స్ పోటీల్లో రెండో కీలక రంగమైన ఏవీసీజీ-ఎక్స్ ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ – ఎక్స్టెండెడ్ రియాలిటీ) లో శ్రేష్ఠత పోటీలు కీలకాంశంగా ఉంటాయి. ఏవీసీజీ-ఎక్స్ ఆర్ రంగంలో ఈ పోటీ పట్ల సర్వత్రా నెలకొన్న ఆసక్తికి గుర్తుగా ఇప్పటికే 1,276 మంది తమ పేర్లను నమోదు చేసుకొన్నారు.
సూచనలు

వేవ్స్ శ్రేష్ఠత పోటీల్లో పాల్గొనేందుకు ముఖ్యమైన సూచనలు:
1. నమోదు ప్రక్రియ: డబ్ల్యూఏఓఈ (వేవ్స్ శ్రేష్ఠత పురస్కారాలు)ల్లో పాల్గొనే అందరూ తమ ప్రాజెక్టులను ఆన్లైన్ ద్వారానే సమర్పించారు. వీరిలో పోటీ కోసం అర్హత పొందిన వారు పోటీల తుది కార్యక్రమానికి, పురస్కారాల సంరంభానికి స్వయంగా హాజరు కావలసి ఉంటుంది.
2. నమోదు విధానం: ఫిలిమ్ ఫ్రీవే వేదిక ద్వారా అందిన డిజిటల్ దరఖాస్తులను మాత్రమే స్వీకరించారు. దరఖాస్తుదారులు స్వయంగా వచ్చి ఫిజికల్ దరఖాస్తులను అందించే వీలును కల్పించలేదు.
3. అర్హత: పోటీలో పాల్గొనేందుకు ఎటువంటి వయో పరిమితి లేదు. పాఠశాల విద్యార్థులు, కళాశాలల్లో డిగ్రీ, పీజీ కోర్సులను అభ్యసించే విద్యార్థులు ‘విద్యార్థి’ విభాగంలో పాల్గొంటారు. మిగతా వారంతా ‘ప్రొఫెషనల్’ విభాగం ద్వారా పోటీలో పాల్గొనవచ్చు.
నమోదు ప్రక్రియ
యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ సంబంధిత రంగాలకు సంబంధించిన నిపుణులు, విద్యార్థులకు పోటీల్లో పాల్గొనే అర్హతను కల్పించారు. పాల్గొనదలచిన వారు యానిమేషన్, లఘు చిత్రం, గేమ్ డిజైన్, లేదా వీఎఫ్ఎక్స్ సీక్వెన్స్ కు సంబంధించి తమ అత్యుత్తమ ప్రాజెక్టును సమర్పించవలసిందిగా సూచించారు. దరఖాస్తు స్వీకరణకు ఎటువంటి రుసుమునూ వసూలు చేయలేదు, కాగా ఫిబ్రవరి 28వ తేదీకల్లా దరఖాస్తు స్వీకరణ గడువు ముగిసింది.
పోటీ విభాగాలు
శ్రేష్ఠత పురస్కారాలు
1. విద్యార్థి షో రీళ్ళు
· ఉత్తమ మోడలింగ్
· ఉత్తమ టెక్స్చరింగ్
· ఉత్తమ లైటింగ్
· ఉత్తమ రిగ్గింగ్
· ఉత్తమ యానిమేషన్
· ఉత్తమ డిజిటల్ పెయింటింగ్
· ఉత్తమ మ్యాట్ పెయింటింగ్
· మోషన్ గ్రాఫిక్స్
· ఉత్తమ కంపోస్టింగ్
· ఉత్తమ ఎఫ్ ఎక్స్
2. ప్రొఫెషనల్ యాడ్ ఫిలిమ్స్
· ఉత్తమ కథ
· ఉత్తమ స్క్రీన్ ప్లే
· ఉత్తమ ఛాయాగ్రహణం
· ఉత్తమ దర్శకత్వం
· ఉత్తమ వీఎఫ్ఎక్స్
· ఉత్తమ యానిమేషన్
· ఉత్తమ మోడలింగ్
· ఉత్తమ లైటింగ్
· ఉత్తమ చిత్రం
· ఉత్తమ టెక్స్చరింగ్

విద్యార్థి షో రీళ్ళు, ప్రొఫెషనల్ యాడ్ ఫిలిమ్స్ అనే రెండు విభాగాల కింద పోటీలను నిర్వహిస్తున్నారు.
పోటీల్లో ముఖ్యమైన తేదీలు
పోటీల్లో కీలక దశలు- సంబంధిత తేదీలు
● దరఖాస్తు సమర్పణకు ఆఖరు తేదీ- 28.02.2025
● దరఖాస్తుల ఎంపిక- 01.03.2025 - 08.03.2025
● న్యాయ నిర్ణేతల సమీక్ష- 09.03.2025 - 29.03.2025
● తుది ఫలితాలు- 01.04.2025
● విజేతలతో ముఖాముఖి- 02.04.2025 - 05.04.2025
●పురస్కార ప్రదాన కార్యక్రమం - 01.05.2025 - 04.05.2025
ఎంపిక ప్రమాణాలు- న్యాయ నిర్ణేతలు
సృజనాత్మకత, నవ్యత, కథను చెప్పడంలో చూపిన నైపుణ్యం ఆధారంగా విశిష్ఠ వ్యక్తులతో కూడిన న్యాయనిర్ణేతల మండలి పురస్కార విజేతలను ఎంపిక చేస్తుంది. ఏవీసీజీ-ఎక్స్ ఆర్ రంగంలో అత్యంత ప్రభావం చూపిన ప్రాజెక్టులను ఈ కీలక అంశాలు ఎత్తి చూపుతాయి.
సృజన, నవ్యత (25%)
· సృజన: కథ, పాత్రలు, ఇతివృత్తాల పరంగా ప్రాజెక్టులోని నవ్యత, విలక్షణతల బేరీజు.
· నూతన ఆలోచనలు: కథను చెప్పే విధానం, యానిమేషన్ పద్ధతుల్లో వినూత్న ధోరణుల ప్రదర్శన.
సాంకేతిక పాటవం (25%)
· యానిమేషన్ నాణ్యత: ఉత్తమ సాంకేతికత, సృజనాత్మకతల ద్వారా యానిమేషన్ లో సాధించిన ఉన్నతస్థాయి ప్రమాణాలు.
· సాంకేతిక సాధనాల వినియోగం: 2డీ, 3డీ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కాంపోజిటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను ప్రభావవంతంగా వినియోగించిన పద్ధతి .
· శబ్దగ్రహణం, సంగీతం: యానిమేషన్ లో సరిగ్గా ఇమిడిపోయిన నాణ్యమైన శబ్ద(ఆడియో), సంగీతాలు.
కథా కథన చాతుర్యం(20%)
· ఇతివృత్తం, పాత్రల చిత్రణ: ఇతివృత్తంలో బలం, పాత్రల చిత్రణలో స్పష్టత.
· కథన వేగం, ఒరవడి : కథనం ముందుకు సాగే వేగం, ప్రేక్షకులను ఆకట్టుకున్న తీరు.
కళాత్మకత (15%)
· ఆహ్లాదకర దృశ్యావిష్కరణ : చిత్రీకరణలో వినియోగించిన వర్ణాలు, నేపథ్య దృశ్యాలు, పాత్రల చిత్రణ పరంగా చూపిన కళాత్మకత, వెరసి ప్రేక్షకులకు రసాత్మకత అనుభూతిని అందించిన తీరు.
· చిత్రంలోని కళాత్మక విలువలు: యానిమేషన్, కథనాలకి తగినట్లుగా అమరిన విజువల్ డిజైన్
మనసులపై వేసిన ముద్ర (15%)
· ప్రేక్షకులను మమేకం చేసిన వైనం: ప్రేక్షకులను కథలో లీనం చేయగలిగిన సామర్థ్యం.
· ప్రేక్షకులను పట్టి నిలిపిన తీరు: ప్రేక్షకుల్లో వివిధ అనుభూతులను కలిగించి, వారిని ఆద్యంతమూ ఆకట్టుకున్న తీరు.
న్యాయ నిర్ణేతల మండలి సభ్యులు:
· డాక్టర్ అనస్టేషియా డిమిట్రా
· బ్రయానా యార్ హౌజ్
· ప్రమితా ముఖర్జీ
· ధీమంత్ వ్యాస్
· బీ ఎన్ విచార్ * *డాక్టర్ భా

పురస్కారం
శ్రేష్ఠత పురస్కారాలకు సంబంధించిన టాప్-20 జాబితాలో చోటు పొందిన ప్రాజెక్టులన్నింటికీ ట్రోఫీ, ఇతర బహుమతులతో సహా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుంది! విజేతలకు మే నెలలో ముంబయిలో జరిగే వేవ్స్’25 కార్యక్రమానికి హాజరయ్యేందుకు రవాణా ఖర్చులు, సదుపాయాలే కాక, వసతిని కూడా కల్పిస్తారు. పోటీల సమీక్ష, సత్కార కార్యక్రమాలకి సంబంధించి కీలక తేదీలు:
సమీక్ష: 01.03.25 to 31.03.25
తుది జాబితా ఎంపికకు సంబంధించిన ప్రకటన: 10.04.25
విజేతలకు సత్కారం: మే’25, 01-04 తేదీల్లో, ముంబయి జియో వరల్డ్ సెంటర్ లో..
ముగింపు
ఏవీసీజీ-ఎక్స్ ఆర్ రంగంలో కొత్త ఆలోచనలు, సృజనాత్మకతలకు పెద్ద పీట వేసే వేవ్స్ శ్రేష్ఠత పురస్కారాలు, విద్యార్థులకు, ఆ రంగంలో పని చేస్తున్న వారికీ ప్రపంచ స్థాయి వేదికను కల్పిస్తాయి. వీఎఫ్ఎక్స్, గేమింగ్, సంబంధిత రంగాల్లో అత్యున్నత స్థాయి నాణ్యతను ఆశిస్తున్న ఈ పోటీ, ఈ రంగంలో ప్రతిభావంతులకు వివిధ బహుమతులు, గుర్తింపు అందించడమే కాక, ముంబయిలో జరగబోయే వేవ్స్’25 సదస్సులో పాల్గొనే అపురూపమైన అవకాశాన్ని కలిగిస్తుంది.
Reference
Kindly find the pdf file
***
వేవ్స్ గురించి
మీడియా, వినోద రంగాల్లో మైలురాయి వంటి తొలి వేవ్స్ సదస్సు (ప్రపంచ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమిట్) ను భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 1 నుంచి 4 వ తేదీ వరకూ ముంబయిలో నిర్వహిస్తారు. మీరు పరిశ్రమలో సేవలందిస్తున్న నిపుణులైనా, సృజనకారులైనా, ఆవిష్కర్తలయినా, సదస్సు మీకు ప్రపంచ స్థాయి మీడియా, వినోద రంగాల్లో పని చేస్తున్న ఇతరులతో కలిసి పని చేసేందుకు, అనుసంధానమై మరింత తోడ్పాటును అందించేందుకు అవకాశాలని కల్పిస్తుంది. కంటెంట్ సృష్టి, మేధోపరమైన హక్కులు, సాంకేతిక సృజనలో అగ్రగామి దేశంగా భారత్ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు వేవ్స్ సదస్సు దోహదపడుతుంది. ప్రసార విభాగాలు, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, సినిమాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, శబ్ద గ్రహణ, సంగీత రంగాలు, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమాలు, జెనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఎక్స్టెండెడ్ రియాలిటీ తదితర రంగాల్లోని పరిశ్రమలపై సదస్సు దృష్టి కేంద్రీకరిస్తుంది.
మీ సందేహాలు, ప్రశ్నలకు జవాబులు ఇక్కడ : here
రండి, మాతో ప్రయాణించండి! వేవ్స్ సదస్సు లో పాల్గొనేందుకు ఇప్పుడే now మీ పేర్లను నమోదు చేసుకోండి! (అతి త్వరలో మీ ముందుకు..!)
***
(Release ID: 2110036)
Visitor Counter : 13
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada