సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్లకు, డీజేలకు పిలుపు: వేవ్స్ 2025 పోటీలో చేరేందుకు చివరి అవకాశం!
' ప్రతిధ్వని: ది ఈడీఎం ఛాలెంజ్' రిజిస్ట్రేషన్ గడువు 2025 మార్చి 31 వరకు పొడిగింపు
ఎలక్ట్రానిక్ సంగీతంలో అంతర్జాతీయ వేదికపై మీ ప్రతిభను చాటే అవకాశాన్ని కోల్పోవద్దు!
Posted On:
05 MAR 2025 4:26PM by PIB Hyderabad
ఔత్సాహిక డీజేలు, నిర్మాతలు, ఎలక్ట్రానిక్ సంగీత కళాకారులకు ఎలక్ట్రానిక్ సంగీతం, డీజే కళాత్మకతలో తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు, ప్రదర్శించడానికి వరల్డ్ ఆడియో అండ్ వీడియో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) 2025 ఒక వేదికను అందిస్తోంది. మీరు ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ అయితే, డీజేయింగ్ పై అభిరుచి కలిగి ఉంటే వేవ్స్-2025 మీ ప్రతిభను ప్రదర్శించడానికి అత్యుత్తమ వేదిక.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ అండ్ బి) ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ (ఐఎంఐ) సహకారంతో ఆడియో, విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో మీ సృజనాత్మక ప్రతిభ, ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఉత్తేజకరమైన అవకాశాన్ని అందించే 'క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్'లో భాగంగా "ప్రతిధ్వని: ది ఈడీఎమ్ ఛాలెంజ్" ను నిర్వహిస్తోంది. ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ (ఈడీఎమ్) సృష్టించడంలోను, ప్రొడ్యూస్ చేయడంలోనూ అనుభవం ఉన్న ఏ దేశానికి చెందిన కళాకారులైనా, స్వరకర్త లైనా, సంగీతకారులైనా, ప్రదర్శకులలైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. మ్యూజిక్ ఫ్యూజన్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్, డీజింగ్ ఆర్టిస్ట్రీకి గ్లోబల్ సెంటర్ గా భారత్ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ పోటీ దోహదపడుతుంది. ఈ పోటీ ఇతివృత్తం "ప్రతిధ్వని: ది ఈడీఎమ్ ఛాలెంజ్" అంతర్జాతీయ సంగీత శైలులను సమన్వయంగా ఉపయోగించి సాంస్కృతికంగా సంపన్నమైన సంగీత స్వరాన్ని సృష్టించడంపై దృష్టి పెడుతుంది.
ఈ రకమైన సంగీతానికి విపరీతమైన డిమాండ్ కారణంగా, ఈడీఎమ్ ఛాలెంజ్ కోసం రిజిస్ట్రేషన్ గడువును అధికారికంగా మార్చి 31, 2025 వరకు పొడిగించారు
అర్హత నిబంధనల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రిజిస్టర్ చేసుకోవడానికి https://indianmi.org/resonate-the-edm-challenge/ మీద క్లిక్ చేయండి.
ప్రపంచ ఎలక్ట్రానిక్ నృత్య సంగీత రంగంలో తమదైన ముద్ర వేయడానికి ఎలక్ట్రానిక్ సంగీత ఔత్సాహికులకు, కళాకారులకు ఇదొక సువర్ణావకాశం. కాబట్టి, వేవ్స్ 2025 లో 'క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్' చొరవ కింద ఈ అద్భుతమైన పోటీలో పాల్గొనడానికి ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
"ప్రతిధ్వని: ది ఈడీఎమ్ ఛాలెంజ్" గ్రాండ్ ఫినాలే గురించి:
మే 1-4, 2025 మధ్య ముంబైలో జరిగే ఈ పోటీ గ్రాండ్ ఫినాలేలో టాప్ 10 ఫైనలిస్టులు ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఇండస్ట్రీకి చెందిన వారి ముందు ప్రదర్శన ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సాటిలేని ప్రదర్శన వారికి ప్రేక్షకులు, సృష్టికర్తలు, సంగీత నిర్మాతలు, పరిశ్రమ ప్రముఖుల నుండి సాటిలేని గుర్తింపును తెచ్చిపెడుతుంది. అందువల్ల, ఫైనలిస్టులు భారతదేశ సృజనాత్మక రంగంలో భాగంగా రాబోయే కళాకారులు, ప్రముఖ సృష్టికర్తలతో కలిసి పనిచేయడానికి, అనుసంధానం చేయడానికి అవకాశం ఉంటుంది.
గడియారం తిరుగుతోంది. క్షణాలు దొర్లిపోతున్నాయి. కేంద్ర సమాచార, మంత్రిత్వ శాఖ కల్పించిన ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు.
ప్రపంచం మీ మాట వినడానికి సిద్ధంగా ఉంది. బీట్ వదలడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
మరిన్ని వివరాలకు సంప్రదించండి - wavesatinfo@indianmi.org
ఈడీఎమ్ ఛాలెంజ్ లో రిజిస్టర్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయండి
వేవ్స్ 2025 గురించి:
మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ (ఎం అండ్ఇ) రంగానికి మైలురాయి అయిన మొదటి వేవ్స్ ను భారత ప్రభుత్వం 2025 మే 1 నుండి 4 వరకు మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించనుంది.
మీరు పరిశ్రమ నిపుణుడు, పెట్టుబడిదారు, సృష్టికర్త లేదా నూతన ఆవిష్కర్త అయితే ఎం అండ్ ఇ రంగానికి అనుసంధానం కావడానికి సహకరించడానికి, సృజనాత్మకతకు, దోహదపడటానికి అత్యుత్తమ ప్రపంచ వేదికను ఈ సదస్సు అందిస్తుంది. కంటెంట్ సృష్టి, మేధో సంపత్తి, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా భారతదేశ సృజనాత్మక శక్తిని పెంచడానికి వేవ్స్ సిద్ధంగా ఉంది. ఇది ప్రధానంగా దృష్టి సారించే పరిశ్రమలు, రంగాలలో బ్రాడ్ కాస్టింగ్, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, ఫిల్మ్స్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సౌండ్ అండ్ మ్యూజిక్, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, జనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఎక్స్ టెండెడ్ రియాలిటీ (ఎక్స్ ఆర్) ఉన్నాయి.
ఏవైనా ప్రశ్నలున్నాయా? సమాధానాలు ఇక్కడ here
రండి, మాతో ప్రయాణించండి! వేవ్స్ కోసం ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి (త్వరలో రాబోతోంది!). now
***
(Release ID: 2108708)
Visitor Counter : 8