ప్రధాన మంత్రి కార్యాలయం
గౌరవ బెల్జియం యువరాణి ఆస్ట్రిడ్ ను కలిసిన భారత ప్రధాని
प्रविष्टि तिथि:
04 MAR 2025 5:49PM by PIB Hyderabad
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం గౌరవ బెల్జియం యువరాణి ఆస్ట్రిడ్ ను కలిశారు. 300 మంది సభ్యులతో కూడిన ఆర్థిక బృందంతో భారత పర్యటన కోసం ఆమె తీసుకున్న చొరవను భారత ప్రధానమంత్రి అభినందించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:
“గౌరవ బెల్జియం యువరాణి ఆస్ట్రిడ్ ను కలవడం సంతోషాన్నిస్తోంది. 300 మంది సభ్యులతో కూడిన ఆర్థిక బృందానికి నేతృత్వం వహిస్తూ భారత పర్యటన కోసం చొరవ చూపడంపట్ల ఆమెకు హృదయపూర్వక అభినందనలు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, వ్యవసాయం, జీవ శాస్త్రాలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, విద్యాపరమైన వినిమయాల్లో సరికొత్త భాగస్వామ్యాల ద్వారా మన ప్రజలకు అపరిమితమైన అవకాశాలను అందించడం కోసం ఎదురుచూస్తున్నాను.
@MonarchieBe”
(रिलीज़ आईडी: 2108322)
आगंतुक पटल : 34
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam