WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కమ్యూనిటీ రేడియో కంటెంట్ చాలెంజ్ స్థానిక ప్రభావానికి ప్రాధాన్యం

 Posted On: 27 FEB 2025 4:34PM |   Location: PIB Hyderabad

కమ్యూనిటీ రేడియో స్టేషన్ల నుంచి సృజనాత్మకప్రభావశీలనవ్య ధోరణులతో కూడిన కంటెంట్ రాబట్టడం లక్ష్యంగా కమ్యూనిటీ రేడియో కంటెంట్ చాలెంజ్ నిర్వహిస్తున్నారుస్థానికుల గళంగా మారేలా వాటిని సాధికారం చేయడంతో పాటు ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి కృషి చేసేలా వాటిని ఉత్తేజితం చేయాలన్నది ధ్యేయంవేవ్స్ క్రియేట్ ఇండియా చాలెంజ్ తొలి సీజన్లో కమ్యూనిటీ రేడియో కేంద్రాలు చేసిన సేవలను కేంద్ర సమాచారప్రసారాల మంత్రిత్వ శాఖకమ్యూనిటీ రేడియో అసోసియేషన్ (సీఆర్ఏసహకారంతో నిర్వహిస్తున్న వేదిక గుర్తిస్తుందిఇప్పటి వరకు పోటీల్లో పాల్గొనేందుకు 246 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారువాటిలో 14 అంతర్జాతీయ ఎంట్రీలున్నాయి.

కమ్యూనిటీ రేడియో కంటెంట్ చాలెంజ్

లక్షలాది మందికి గళంగా మారేందుకు మీ అవకాశం అందిపుచ్చుకోండి.

మీడియాఎంటర్టైన్మెంట్ (ఎం అండ్ రంగం యావత్తునూ ఐక్యం చేసే హబ్ అండ్ స్పోక్ వేదిక ప్రపంచ ఆడియోవిజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సదస్సు (వేవ్స్తొలి ఎడిషన్ప్రపంచ ప్రసిద్ధమైన ఈవెంట్ ప్రపంచ ఎం అండ్ రంగం దృష్టిని భారతదేశ ఎం అండ్ రంగం వైపు ఆకర్షిస్తుందిఅంతే కాదు... భారత ఎం అండ్ రంగంఅందులోని ప్రతిభతో దాన్ని అనుసంధానం చేస్తుంది.

 

ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ అండ్ జియో వరల్డ్ గార్డెన్లో 2025 మే 1-4 తేదీల మధ్యన ఈవెంట్ జరుగుతుందిబ్రాడ్ కాస్టింగ్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ఏవీజీసీ-ఎక్స్ఆర్డిజిటల్ మీడియా అండ్ ఇన్నోవేషన్చలన చిత్రాలు అనే నాలుగు మూల స్తంభాలపై సదస్సును నిర్వహిస్తున్నారుభారతదేశ వినోద పరిశ్రమ భవిష్యత్తును ప్రదర్శించేందుకు నాయకులుకంటెంట్ సృష్టికర్తలుసాంకేతిక నిపుణులు అందరినీ వేవ్స్ ఒక వేదిక పైకి తెస్తుంది.

బ్రాడ్ కాస్టింగ్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ విభాగం కింద నిర్వహిస్తున్న కమ్యూనిటీ రేడియో కంటెంట్ చాలెంజ్ సామాజిక వర్గాల్లో సమాచార వ్యాప్తిఅనుసంధానతసామాజిక కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేయడంలో కమ్యూనిటీ రేడియో పాత్రను అందరికీ తెలియచేస్తుంది.

 

పోటీ లక్ష్యాలు

ఇన్నోవేషన్ను ప్రోత్సహించడంసహకారాన్ని పటిష్ఠం చేయడంలో కమ్యూనిటీ రేడియో స్టేషన్ల శక్తిసామర్థ్యాలను ప్రాచుర్యంలోకి తేవడం ఈ పోటీ ప్రధాన లక్ష్యం.

పోటీ లక్ష్యాలు

  • కమ్యూనిటీ రేడియో వేడుక

కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ప్రసారం చేసిన ప్రత్యేక ప్రసంగాలుకథనాలను వెలుగులోకి తేవడం.

  • ఇన్నోవేషన్ కు ప్రోత్సాహం

కొత్త ఫార్మాట్లుకళాత్మక ప్రక్రియలుకథలు వినిపించడంలో కొత్త మెళకువలను ప్రయోగాత్మకంగా అనుసరించేలా సీఆర్ఎస్ లలో స్ఫూర్తి నింపడం.

  • సహకారం పటిష్ఠత

సీఆర్ఎస్ లు తమకు గల పరిజ్ఞానాలను ఇతరులతో పంచుకునేందుకుపరస్పరం నేర్చుకునేందుకుఅనుసంధానతలు నిర్మించుకునేందుకు అవకాశాలు కల్పించడం.

  • ప్రభావాన్ని విస్తరించడం

తమ సమాజాల్లో వాస్తవిక మార్పునకు కారణం అయిన ప్రోగ్రామ్లను గుర్తించిబహుమతులు అందించడం.

ఎంట్రీలు సమర్పించాల్సిన విభాగాలు

విశిష్టమైన అయిదు విభాగాల్లో ఎంట్రీలు సమర్పించాల్సిందిగా కమ్యూనిటీ రేడియో స్టేషన్లను (సీఆర్ఎస్వేవ్స్ పోటీ ఆహ్వానిస్తోందిప్రతీ ఒక్క విభాగానికి సామాజికాభివృద్ధిలో ప్రత్యేక స్థానం ఉందివిభిన్న రంగాల్లో సానుకూల మార్పు తేవడానికి కమ్యునిటీ రేడియోలు చేసిన ప్రభావవంతమైన కృషిని ఈ విభాగాలు వెలుగులోకి తెస్తాయి.

  • ప్రజారోగ్యంభద్రత : ప్రజారోగ్య సమస్యలుఅత్యవసర స్థితులు ఎదుర్కొనేందుకు సంసిద్ధతవ్యాధుల నివారణపరిశుభ్రత విధానాలుఆరోగ్య చైతన్య కల్పన వంటి విభాగాల్లో సమస్యల పరిష్కారానికి తాము చేపట్టిన వినూత్న కార్యక్రమాలను కమ్యునిటీ రేడియోలు ప్రదర్శిస్తాయి.

  • విద్యఅక్షరాస్యత : సమాజంలోని ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తుల జీవన నాణ్యత మెరుగుపరిచే దిశగా పరిజ్ఞానంనైపుణ్యాలకు మెరుగులు దిద్దివారిని సాధికారం చేసేందుకు చేపట్టిన విద్యాఅక్షరాస్యత కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.

  • మహిళలుబాలల అభివృద్ధిసామాజిక న్యాయంమద్దతు : సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాలకు మద్దతు ఇవ్వడంసమానత్వంతో కూడిన సమాజ స్థాపించడం లక్ష్యంగా చేపట్టిన స్త్రీపురుష సమానతబాలల హక్కులుసాధికారతసామాజిక న్యాయ కార్యక్రమాలను ఈ విభాగంలో ప్రదర్శిస్తారు.

  • వ్యవసాయంగ్రామీణాభివృద్ధి గ్రామీణ సమాజంలో సామాజికఆర్థికాభివృద్ధి సాధన కోసం చేపట్టిన సుస్థిర వ్యవసాయంవ్యవసాయ నవకల్పనలుగ్రామీణ ఔత్సాహిక పారిశ్రామికుల ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు ప్రదర్శిస్తారు.

  • సాంస్కృతిక పరిరక్షణ : భారతదేశానికి చెందిన సమున్నతమైన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించిప్రోత్సహించేందుకు చేపట్టిన కార్యక్రమాలుసాంప్రదాయిక కళారీతులుభాషలుఆచరణలను భవిష్యత్ తరాలకు అందించేందుకు చేపట్టిన కార్యక్రమాలు ఈ విభాగంలోకి వస్తాయి.

ఎంట్రీలు సమర్పించాల్సిన విభాగాలు

  • ప్రజారోగ్యంభద్రత

  • విద్యఅక్షరాస్యత

  • మహిళలుబాలల అభివృద్ధిసామాజిక న్యాయంమద్దతు

  • వ్యవసాయంగ్రామీణాభివృద్ధి

  • సాంస్కృతిక సంరక్షణ

నమోదుకు మార్గదర్శకాలు

ఈ పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి గల వారి పేర్ల నమోదు కార్యక్రమం 2025 ఫిబ్రవరి 28 వరకు ఉంటుందికేంద్ర సమాచారప్రసారాల శాఖ (ఎంఐబీఅనుమతి పొందినచెల్లుబాటులో ఉన్న రెన్యువల్ లైసెన్సు కలిగిన కమ్యూనిటీ రేడియో స్టేషన్లు (సీఆర్ఎస్అన్నింటికీ పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుందిప్రతీ స్టేషన్... పైన పేర్కొన్న ఐదు విభాగాల్లో ఏదో ఒక విభాగంలో మాత్రమే పోటీకి దరఖాస్తు చేసేందుకు అనుమతిస్తారుఒకే విభాగంలో లేదా విభిన్న విభాగాల్లో బహుళ ఎంట్రీలు సమర్పించినట్టయితే అనర్హతకు దారి తీస్తుంది.

  • కార్యక్రమం వృత్తి నిపుణులు లేదా వృత్తి నైపుణ్యంలో ప్రత్యేక గుర్తింపు పొందిన స్వరాలు గల వారు రూపొందించినది కాకూడదు.

  • దరఖాస్తు చేసిన కమ్యూనిటీ రేడియో స్టేషన్లు రూపొందించిన కార్యక్రమాలను మాత్రమే అవార్డులకు అనుమతిస్తారు.

  • పోటీకి వచ్చే కార్యక్రమాలేవీ గతంలో ఏదైనా సంస్థ లేదా సంఘం నుంచి అవార్డులు పొందినవి కాకూడదు.

  • పోటీకి నిలిపే కార్యక్రమాలు వాస్తవికంగా కమ్యునిటీ రేడియోలు 01.06.2023 నుంచి 31.06.2024 మధ్య కాలంలో ప్రసారం చేసినవి మాత్రమే అయి ఉండాలి.

  • నిర్మాణంలో ఉన్న లేదా ఇంతవరకు ప్రసారం కాని కార్యక్రమాలను పోటీకి అనుమతించరు.

  • ప్రతీ ఎంట్రీకి కూడా దాని గురించిన వివరణ జత చేయాల్సి ఉంటుంది (వివరణ ఇంగ్లీష్హిందీలో 250 పదాల్లో ఉండాలి).

  • సంబంధిత పత్రాలుకార్యక్రమానికి సంబంధించిన ఆడియో ఫైల్ (ఎంపీ 3 ఫార్మాట్లో మాత్రమేజత చేసిన ఎంట్రీలు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.

  • దరఖాస్తులను ఫిబ్రవరి 28, 2025 వరకు మాత్రమే అనుమతిస్తారు.

ఎంట్రీల సమర్పణ విధివిధానాలు

పోటీకి సమర్పించే కార్యక్రమాలు ఫార్మాట్కాలవ్యవధికంటెంట్దాని ప్రభావాన్ని వివరించే పత్రాలు సహా నిర్దిష్ట అర్హతలు కలిగినవై ఉండాలి.

  • ప్రోగ్రాం అర్హత ప్రతీ ఒక్క కార్యక్రమం అరగంట నిడివి గలది లేదా ఒక సీరీస్లో సింగిల్ ఎపిసోడ్ అయి ఉండాలి.

  • ప్రోగ్రాం ఫార్మాట్లు టాక్ షోలుడాక్యుమెంటరీలుసంగీత కార్యక్రమాలువిద్యా కార్యక్రమాలులైవ్ షోలుఫోన్ ఇన్ కార్యక్రమాలు లేదా ఏ ఇతర కళారీతిలో అయినా ఎంట్రీలుండవచ్చు.

మద్దతు మెటీరియల్స్ :

  • కార్యక్రమ వివరణ: కార్యక్రమం ఏ అంశానికి సంబంధించినదిలక్ష్యాలేమిటి అనేవి తెలియచేసే సంక్షిప్త వివరణ అందించాలి.

  • ప్రభావ నివేదికలు: సమాజంలో ఎంత మందికి ఆ కార్యక్రమం చేరిందిదాని ప్రభావం ఏమిటి అనేది కూడా వివరించాలి.

  • ప్రేక్షకుల అభిప్రాయాలు: కార్యక్రమంపై ప్రేక్షకుల అభిప్రాయాలేమిటి తెలియచేయడంతో పాటు వారి కామెంట్లు కూడా పొందుపరచాలి.

ఎంట్రీలు సమర్పించే విధానం

ఎంట్రీలకు పోర్టల్ :

అధికారిక పోటీ వెబ్ సైటు ద్వారా మాత్రమే ఎంట్రీలు సమర్పించాల్సి ఉంటుందిఅన్ని రకాల మెటీరియల్స్ ఎలాంటి లోపాలు లేకుండా అప్ లోడు చేయాల్సి ఉంటుంది.

ఫార్మాట్:

ఆడియో ఫైల్స్ అన్నీ ఎంపీ 3 ఫార్మాట్లో ఉండాలిమద్దతుగా సమర్పించే పత్రాలన్నీ పీడీఎఫ్ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి.

మదింపు విధానం

వేవ్స్ పోటీకి వచ్చిన ఎంట్రీలను నిష్పక్షపాతంగాసమగ్రంగా మదింపు చేసేందుకు ప్రతీ కమ్యూనిటీ రేడియో కార్యక్రమం విషయంలో ఈ దిగువ కొలమానాలను అనుసరిస్తారు.

మదింపునకు కొలమానాలు

కమ్యూనిటీ రేడియో కంటెంట్ చాలెంజ్

01 - ఔచిత్యంప్రభావం

02 - సహజత్వంసృజనాత్మకత

03 - నిర్మాణ నాణ్యత

04 - సమాజ భాగస్వామ్యం

05 - విద్యాపరంగా విలువ

06 - సాంస్కృతిక పరిరక్షణ

07 - సుస్థిరతప్రతిరూపత

08 - సామాజిక మార్పుమద్దతు

తుది ఎంపిక

మీడియా ప్రముఖులుభారత కమ్యూనిటీ రేడియో అసోసియేషన్ (సీఆర్ఏఐప్రతినిధులు సభ్యులుగా గల నిపుణుల బృందం రెండంచెల విధానం ద్వారా వేవ్స్ కాంపిటీషన్ కు వచ్చే ఎంట్రీలను మదింపు చేసి విజేతలను నిర్ణయిస్తుంది.

ఎంపిక విధానం

న్యాయనిర్ణేతలు

  • ప్రసిద్ధ మీడియా ప్రముఖులు

  • భారత కమ్యూనిటీ రేడియో అసోసియేషన్ (సీఆర్ఏఐప్రతినిధులు

తుది జాబితా

  • టాప్ 5 ఎంట్రీల ఎంపిక

  • రెండంచెల మదింపు విధానం

-------------------------------

తుది ఎంపిక :

ఎంట్రీల తుది జాబితాలో నుంచి విజేతలను ఎంపిక చేస్తారుమదింపు విధివిధానాల ఆధారంగా తుది దశకు పంపుతారు.

వేవ్స్ కాంపిటీషన్లో భాగంగా నిర్వహిస్తున్న కమ్యూనిటీ రేడియో కంటెంట్ చాలెంజ్ దేశంలోని కమ్యూనిటీ రేడియో స్టేషన్లు నిర్వహించిన ప్రభావవంతమైన కృషిని గుర్తించిప్రశంసలందించే విలువైన వేదికకమ్యూనిటీ రేడియో విభాగంలో నవ్యతనుసహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థానిక సమాజాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంసాధికారతలో కమ్యూనిటీ రేడియోలు నిర్వహిస్తున్న పాత్రను ఇది వెలుగులోకి తెస్తుంది.

 

***


Release ID: (Release ID: 2106888)   |   Visitor Counter: 25