సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచానికి ఖాదీ


పోటీలో పాల్గొని ప్రతిష్ఠాత్మక భారత వస్త్ర విశేషాలను ప్రపంచ వేదికపై చాటండి

Posted On: 27 FEB 2025 4:40PM by PIB Hyderabad

 పరిచయం

image.jpeg

సుసంపన్నమైన భారత వస్త్ర విశేష వారసత్వాన్నిప్రపంచవ్యాప్త ఫ్యాషన్ పోకడలను మిళితం చేయడం ‘ప్రపంచానికి ఖాదీ (మేక్ ది వరల్డ్ వేర్ ఖాదీ)’ కార్యక్రమ లక్ష్యంఈ దిశగా ప్రకటన నిపుణులుఫ్రీలాన్సర్లకు ప్రేరణనిచ్చేలా ఉత్సాహాన్ని నింపే పోటీలకు రంగం సిద్ధమవుతోందిప్రారంభ ప్రపంచ దృశ్యశ్రవ్య వినోద సదస్సు (వేవ్స్)లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారుప్రపంచానికంతటికీ ప్రీతిపాత్రమయ్యేలా ఖాదీని అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ గా నిలపడం దీని లక్ష్యంసమాచారప్రసార మంత్రిత్వ శాఖతో కలిసి భారత ప్రకటన సంస్థల సంఘం (ఏఏఏఐనిర్వహిస్తున్న ఈ పోటీలో దేశీయఅంతర్జాతీయ మార్కెట్లకు చెందిన నిపుణులుఉత్సాహవంతులు పాల్గొని డిజిటల్ముద్రణవీడియోప్రయోగాత్మక మార్గాల్లో తమ సృజనాత్మక భావాలకు రూపమివ్వొచ్చువ్యూహాత్మక ఆలోచనలుసృజనాత్మకతకు ప్రపంచానికి ఖాదీ పోటీ ప్రాధాన్యమిస్తుందిఖాదీ బ్రాండ్ ఇమేజీని పెంచేలావినియోగదారీ భాగస్వామ్యాన్ని పెంచి ఖాదీకి ప్రపంచ వ్యాప్త ఆదరణను కలకాలం నిలిపేలా కొత్త ఆలోచనలను ఇది ప్రోత్సహిస్తుంది.

 

మే నుంచి వరకు ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్జియో వరల్డ్ గార్డెన్స్ లో నిర్వహించనున్న వేవ్స్.. మీడియావినోద రంగాల్లో నిస్సందేహంగా ఓ ముఖ్యమైన మైలురాయిగా నిలవనుందిఅనేక కార్యక్రమాలను ఒకే వేదికపై నిలిపే ఈ విశిష్ట కార్యక్రమం ద్వారా.. భారతీయ ప్రతిభను ఈ రంగంలోని అంతర్జాతీయ ప్రముఖులతో వేవ్స్ అనుసంధానం చేయనుందినాలుగు ప్రాతిపదికలు వేవ్స్ కు ముఖ్యమైన ఆధారాలుగా ఉన్నాయిసమాచార ప్రసారంటీవీ కార్యక్రమాలుఏవీజీసీ-ఎక్స్ఆర్ (యానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్కామిక్స్ఎక్స్టెండెడ్ రియాల్టీ), డిజిటల్ మీడియాఆవిష్కరణసినిమాలుసమాచార ప్రసారంటీవీ ప్రసార విభాగంలో భాగమైన మేక్ ది వరల్డ్ వేర్ ఖాదీ పోటీ.. ప్రకటనమార్కెటింగ్ నిపుణులను ఒక్కచోటికి చేర్చి మీడియావినోద రంగంలో బ్రాండ్ వ్యూహాలను రూపొందించేలా ప్రోత్సహిస్తుందివేవ్స్ లో భాగంగా నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక క్రియేట్ ఇన్ ఇండియా పోటీల్లో భాగమైన ఈ చాలెంజి భాగంక్రియేట్ ఇన్ ఇండియా పోటీల్లో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 73,000 మంది సృజనకారులు నమోదు చేసుకున్నారుమరోవైపుఫిబ్రవరి 15 నాటికి ఖాదీ ఛాలెంజిలో 112 మంది నమోదు చేసుకున్నారుఖాదీని అగ్రగామిగా నిలిపిప్రపంచ వేదికపై భారత సృజన శక్తిని చాటడానికి రంగం సిద్ధమైంది.

కావాల్సినవి:

image.png

 

ముఖ్యమైన తేదీలు

image.png

పోటీదారులకు మార్గదర్శకాలు

  1. పెద్దసంఖ్యలోభిన్న నేపథ్యాలున్న ప్రేక్షకులను చేరేలా సందేశాన్ని రూపొందించడం.

  1. ఫైల్ పరిమాణం ఎంబీలకు మించకుండా చూసుకుంటూమీ ప్రచార ప్రాజెక్టును ఒకే పీడీఎఫ్ ఫైల్ గా సమర్పించండి.

  1. మీరు అందించిన ఫైల్ లో గోప్యతను పాటించండిఅంటేమీ గుర్తింపును లేదా మీ యజమాని వివరాలను ప్రదర్శించేలా ఉన్న సమాచారం దేనినీ అందులో చేర్చకండిఅది మీ అనర్హతకు కారణమవుతుంది.

  1. సృజనాత్మకబ్రాండింగ్ నిపుణులతో కూడిన ప్యానెల్ ఎంట్రీలను పరిశీలించి నిష్పాక్షికంగాకూలంకశంగా మూల్యాంకనం చేస్తుంది.

  1. నమోదు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

బహుమతులుగుర్తింపు

image.png

 

ముగింపు

వేవ్స్ ‘ప్రపంచానికి ఖాదీ’ (మేక్ ది వరల్డ్ వేర్ ఖాదీకార్యక్రమం ప్రకటన నిపుణులుఫ్రీలాన్సర్లకు తమ సృజనాత్మకతనువ్యూహ చతురతను ప్రదర్శించడం కోసం అద్భుతమైన అవకాశాన్నిస్తుందిప్రారంభ ప్రపంచ దృశ్యశ్రవ్య వినోద సదస్సు (వేవ్స్)లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విస్తృతంగా నిర్వహిస్తున్న క్రియేట్ ఇన్ ఇండియా పోటీల్లో ముఖ్యమైన విభాగంభారత సృజన రంగాన్ని మరింతగా విస్తరించేలా దీనిని రూపొందించారుఖాదీని అంతర్జాతీయఅభిలషణీయ బ్రాండ్ గా నిలపడం ద్వారా.. సుసంపన్నమైన భారత వస్త్ర విశేష వారసత్వాన్ని చాటడం మాత్రమే కాకుండామీడియావినోద రంగాల్లో సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యంముఖ్య విధాన నిర్ణేతలుసాంకేతిక నిపుణులుఔత్సాహిక పారిశ్రామికవేత్తలుపోటీలో భాగస్వాములకు తమ ఆలోచనలను పంచుకోవడం కోసం ప్రతిష్ఠాత్మక వేవ్స్ కార్యక్రమం ఓ వేదికగా నిలుస్తుందిఇది వారికి అమూల్యమైన గుర్తింపును అందించడమే కాకుండాఖాదీని అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యానికి దోహదం చేస్తుందిఅంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాబల్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది

ఆధారాలు:

  1. https://wavesindia.org/challenges-2025

  1. https://events.tecogis.com/waveskhadichallenge/expressions

  1. https://x.com/WAVESummitIndia/status/1887071165044359592/photo/1

Click here to download PDF 

 

 

***

 


(Release ID: 2106874) Visitor Counter : 6