ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫిబ్రవరి 21న ఢిల్లీలో 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనాన్ని ప్రారంభించనున్న ప్రధాని


71ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో జరగనున్న మరాఠీ సాహిత్య సమ్మేళనం: స‌జీవ‌మైన మరాఠీ సాహిత్య ఔన్నత్యానికి జరుగుతున్న ఈ ఉత్సవం, సమకాలీనాంశాల్లో అది పోషిస్తున్న పాత్రను అన్వేషిస్తుంది

Posted On: 20 FEB 2025 7:29PM by PIB Hyderabad

ఇటీవలే మరాఠీ భాషకు ప్రాచీన హోదాను ప్రభుత్వం కల్పించింది. ఈ నేపథ్యంలో, భారతదేశ ఘనమైన సంస్కృతిని, వారసత్వాన్ని గొప్పగా ప్రదర్శిస్తూ ఈ నెల 21న... 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ వేదికగా జరిగే ఈ కార్యక్రమాన్ని సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు.

ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు నిర్వహించే ఈ సమ్మేళనంలో ప్యానెల్ చర్చలు, పుస్తక ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రముఖ రచయితలతో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది కాలాతీతమైన మరాఠీ సాహిత్య ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తూ నిర్వహిస్తున్న ఉత్సవం...  భాషా పరిరక్షణ, అనువాదం, సాహిత్యంపై డిజిటలైజేషన్ ప్రభావం తదితర సమకాలీన అంశాల్లో మరాఠీ సాహిత్యం పోషిస్తున్న పాత్రను అన్వేషిస్తూ గురించి చర్చలు నిర్వహిస్తారు.  

71 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో మరాఠీ సాహిత్య సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఏకీకృతమైన ఈ సాహిత్య స్ఫూర్తిని ప్రదర్శిస్తూ 1,200 మందితో సాహిత్య రైలు పుణే నుంచి ఢిల్లీ చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 2,600కు పైగా కవితా సమర్పణలు, 50 పుస్తకావిష్కరణలు జరుగుతాయి. అలాగే 100 పుస్తక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పండితులు, రచయితలు, కవులు, సాహిత్యాభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.


 

***


(Release ID: 2105163) Visitor Counter : 53