ప్రధాన మంత్రి కార్యాలయం
ఎస్ఓయూఎల్ నాయకత్వ ఫిబ్రవరి 21, 22లలో న్యూ ఢిల్లీలో చర్చావేదిక: స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్‌కు ప్రధానమంత్రి అభినందనలు
* ‘ఈ వేదిక నాయకత్వానికి సంబంధించిన అంశాల్ని చర్చించడానికి
జీవనంలో వివిధ రంగాలకు చెందిన వారిని ఒక చోటుకు తీసుకువస్తుంది’
Posted On:
18 FEB 2025 8:45PM by PIB Hyderabad
ఎస్ఓయూఎల్ (స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్) వారు నాయకత్వ చర్చావేదిక కార్యక్రమాన్ని ఈ నెల 21న న్యూ ఢిల్లీలో నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
నాయకత్వానికి సంబంధించిన అంశాల్ని చర్చించడానికి జీవనంలో వివిధ రంగాలకు చెందిన వారిని ఈ వేదిక ఒక చోటుకు తీసుకువస్తుందని శ్రీ మోదీ అన్నారు. వక్తలు వారి ప్రేరణాత్మక జీవన యాత్రలను గురించి, కీలక అంశాలపై వారి ఆలోచనల గురించి తెలియజేస్తారని, ఈ కార్యక్రమం ప్రత్యేకించి యువ శ్రోతలను ఆకట్టుకోగలదని కూడా శ్రీ మోదీ చెప్పారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా రాశారు:
ఎస్ఓయూఎల్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌ను ఈ నెల 21, 22 లలో న్యూ ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నందుకు స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్‌ను నేను అభినందిస్తున్నాను. నాయకత్వానికి సంబంధించిన అంశాల్ని చర్చించడానికి జీవనంలో వివిధ రంగాలకు చెందిన వారిని ఈ వేదిక ఒక చోటుకు తీసుకువస్తుంది. వక్తలు వారి ప్రేరణాత్మక జీవన యాత్రలను గురించి, కీలక అంశాలపై వారి ఆలోచనల గురించి తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా యువ శ్రోతలను ఆకర్షిస్తుంది.
శుక్రవారం చర్చావేదికలో నేను కూడా పాల్గొంటాను.
@LeadWithSoul”
***
MJPS/ST
(Release ID: 2104874)
Visitor Counter : 18
Read this release in:
Malayalam
,
Gujarati
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada