సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ యానిమే, మాంగ పోటీ కామిక్స్, యానిమేషన్లకు భారత్ లో పెరుగుతున్న ఆదరణ
Posted On:
17 FEB 2025 5:23PM by PIB Hyderabad
పరిచయం
భారత్ లో యానిమే రంగం, మాంగా కామిక్ బుక్స్ పట్ల పెరుగుతున్న ఆసక్తి, ఆదరణల దృష్ట్యా ఈ రంగంలో సృజనకారులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించే వేదికగా వేవ్స్ యానిమే అండ్ మాంగా (వామ్!) పోటీ ఏర్పాటవుతోంది. మీడియా, ఎంటర్టైన్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఈఏఐ) సహకారంతో సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తున్న ఈ పోటీ, ప్రసిద్ధ జపాన్ శైలులను స్థానిక శైలులతో అనుసంధానించేందుకు కళాకారులను ప్రోత్సహిస్తుంది. వీరు రూపొందించే కళాత్మక ఉత్పత్తులు అటు భారతీయ మార్కెట్లకే కాక, అంతర్జాతీయ మార్కెట్లకు కూడా అనువుగా ఉండగలవు. ప్రచురణ, పంపిణీ, పరిశ్రమ వర్గాలతో ప్రత్యక్ష అనుసంధానం వంటి అవకాశాలను కల్పించే ఈ పోటీ కళాత్మక అభివ్యక్తికి, నూతన సృజనకారులకూ చక్కని అవకాశాలను కల్పిస్తుంది. 11 నగరాల్లో ఏర్పాటయ్యే రాష్ట్రస్థాయి పోటీలు ముంబయి లో జరిగే వేవ్స్-2025 జాతీయస్థాయి పోటీతో ముగుస్తాయి.

ముంబయి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్స్ లో మే 1 నుంచీ 4 వరకూ జరిగే ‘వేవ్స్’ (ప్రపంచ ఆడియో విజువల్, వినోద రంగ సదస్సు) ప్రతిష్ఠాత్మక ‘క్రియేట్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా వామ్! పోటీ ఏర్పాటవుతోంది. మీడియా, వినోద రంగాల్లో సృజన, భాగస్వామ్యాలు, చర్చలు వంటి అంశాలకు వేవ్స్ సదస్సు వేదికగా నిలుస్తుంది. ఈ రంగంలో నూతన అవకాశాలను చర్చించేందుకు, భవిష్యత్ ప్రణాళికలను రచించేందుకూ పలు దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. వేవ్స్ లో కీలకమైన క్రియేట్ ఇన్ ఇండియా పోటీలకు 70,000కు పైగా దరఖాస్తులు అందాయి. పోటీల్లో పాల్గొనే స్థానిక సృజనకారులకు ప్రపంచ వేదికపై తమ సృజనను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. యానిమే మాంగాల్లో పెరుగుతున్న భారత్ ముద్ర కు వామ్! పోటీ అద్దం పడుతుంది. ఈ పోటీ కళాత్మక సంప్రదాయాలను సమకాలీన కథన రీతులతో అనుసంధానిస్తుంది.
ప్రత్యేక సంస్థలు, విభాగాలు

అర్హత వివరాలు

పోటీల వివరాలు
తేదీ
|
నగరం
|
వేదిక
|
నమోదు
|
నవంబర్ 22, 2024
|
గౌహతి
|
ఎన్ఈడీఎఫ్ఐ కన్వెన్షన్ సెంటర్
|
Closed
|
నవంబర్ 24, 2024
|
కలకత్తా
|
హెరిటేజ్ స్కూల్
|
Closed
|
నవంబర్ 26, 2024
|
భువనేశ్వర్
|
శ్రీశ్రీ విశ్వవిద్యాలయం
|
Closed
|
నవంబర్ 28, 2024
|
వారణాసి
|
సన్ బీమ్ సన్ సిటీ స్కూల్
|
Closed
|
నవంబర్ 30, 2024
|
ఢిల్లీ
|
ఐఐఎంసీ వసంత్ కుంజ్
|
Closed
|
తెలియవలసి ఉంది
|
బెంగుళూరు
|
తెలియవలసి ఉంది
|
Click Here
|
తెలియవలసి ఉంది
|
ముంబయి
|
తెలియవలసి ఉంది
|
Click Here
|
తెలియవలసి ఉంది
|
అహ్మదాబాద్
|
తెలియవలసి ఉంది
|
Click Here
|
తెలియవలసి ఉంది
|
నాగపూర్
|
తెలియవలసి ఉంది
|
Click Here
|
తెలియవలసి ఉంది
|
హైదరాబాద్
|
తెలియవలసి ఉంది
|
Click Here
|
తెలియవలసి ఉంది
|
చెన్నై
|
తెలియవలసి ఉంది
|
Click Here
|
మే 1– 4, 2025
|
ఫైనల్ పోటీ
|
జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్స్
|
రాష్ట్ర స్థాయి విజేతలు
|
నియమనిబంధనలు:
o అన్ని విభాగాలకూ అప్పటికప్పుడు స్క్రిప్టులను అందిస్తారు.
o మాంగా విభాగంలో అందించే దరఖాస్తులను మాత్రమే పత్రాల రూపంలో స్వీకరిస్తారు. మిగతా అన్ని విభాగాల్లో దరఖాస్తులను డిజిటల్ రూపంలో మాత్రమే స్వీకరిస్తారు.
o పోటీలో పాల్గొనేవారు ప్రకటించిన గడువులోగా తమ ప్రాజెక్టు పనిని నిర్దేశిత విధానంలో పూర్తి చేసి అందించవలసి ఉంటుంది.
o మాంగా (విద్యార్థులు, నిపుణులు): ఫిజికల్ కాపీ లేదా డిజిటల్ రూపంలో, 2 పేజీల్లో కనీసం 4 ప్యానళ్ళను ఇంకు, రంగుల్లో చిత్రీకరించాలి.
o వెబ్ టూన్ (విద్యార్థులు): ఇంకు, రంగుల్లో 7 ప్యానళ్ళు.
o వెబ్ టూన్ (వృత్తి నిపుణులు): ఇంకు, రంగుల్లో 10 ప్యానళ్ళు.
o యానిమే (విద్యార్థులు) : అందిన స్క్రిప్టు ఆధారంగా 10 సెకనుల యానిమేషన్ ఫిలిమ్.
o యానిమే (వృత్తి నిపుణులు): అందిన స్క్రిప్టు ఆధారంగా 15 సెకనుల యానిమేషన్ ఫిలిమ్.
పోటీ తేదీలు, పురస్కారాల వివరాలు
- పోటీలన్నీ ఆఫ్లైన్ పద్ధతిలో నిర్దిష్ట ప్రాంతంలో జరుగుతాయి, పాల్గొనదలచిన వారు పోటీలు జరిగే ప్రాంతానికి చేరుకోవాలి.
- పేర్ల నమోదు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది, అభ్యర్ధుల పరీక్ష 9.30 గంటలకు.
- పోటీ ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
- కాస్ ప్లే (తమ అభిమాన పాత్రల ఆహార్యాన్ని అనుకరించడం) సహా ఇతర పోటీలు ఒకేరోజున – సాయంత్రం 6 నుంచీ 8 గంటల వరకూ జరుగుతాయి.
- మే 1 నుంచీ 4 వరకూ ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్స్ లో ఏర్పాటైన వేవ్స్ సమిట్ లో భాగంగా వామ్! ఫైనల్స్ జరుగుతాయి.
- పోటీలో విజేతలకు ఖర్చులన్నీ భరించి, జపాన్ యానిమే, ఇతర అంతర్జాతీయ కార్యక్రమాల పర్యటనను బహుమతిగా అందిస్తారు. సమాచార ప్రసార శాఖ సహకారాన్ని అందిస్తుంది.
వామ్! కాస్ ప్లే పోటీ
వామ్! పోటీల్లో విద్యార్థులు, సిబ్బంది సహా బయటి వ్యక్తులూ ఎటువంటి రిజిస్ట్రేషన్ రుసుము లేకుండా పాల్గొనవచ్చు. తప్పనిసరిగా యానిమే, మాంగా, గేమింగ్ లేదా భారతీయ కామిక్స్‌లోని పాత్రల ఆధారంగా కాస్ ప్లే లు ఉండాలి. సృజనాత్మకత, వాస్తవికతలకే పెద్దపీట. కాస్ట్యూములు, ఇతర సామగ్రి (ప్రాప్‌లు) స్వయంగా తయారు చేసినవై ఉండాలి. కళాత్మక పరిమితులు లేవు, అయితే వస్తువులు, ఆయుధాలు తప్పనిసరిగా పని చేయనివి (హాని చేసే అవకాశం లేనివి) అయ్యుండాలి, కార్యక్రమానికి ముందు జరిగే తనిఖీల్లో అనుమతులు పొందాలి.
పాల్గొనేవారు హుందాగా ప్రవర్తించాలి... అభ్యంతరకర ప్రవర్తన అనర్హతకు దారి తీయగలదు. కాస్ట్యూమ్ ఖచ్చితత్వం, నైపుణ్యం, పనితీరు, సృజనాత్మకత, ప్రేక్షకులను ఆకట్టుకునే గుణం ఆధారంగా న్యాయమూర్తుల నిర్ణయం ఉంటుంది. పాల్గొనేవారు వారి పాత్ర లేదా దుస్తులు గురించిన ప్రశ్నలకు సమాధానమిచ్చే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా ఉంటుంది. పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ 90 సెకన్లు ప్రదర్శన నిమిత్తం, 1 నిమిషం పాత్ర పరిచయం, న్యాయమూర్తులతో మాటామంతీ కి కేటాయిస్తారు. న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. మొదటి ముగ్గురు విజేతలకి నగదు బహుమతులు ఉంటాయి, పోటీలో పాల్గొన్న అందరికీ ఈ-సర్టిఫికేట్‌లను అందిస్తారు.
ఉల్లేఖనం:
పీడీ ఎఫ్ ఫైల్ ఇక్కడ
*****
(Release ID: 2104256)
Visitor Counter : 23