ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రేపు ఢిల్లీలో భారత్ టెక్స్ 2025లో పాల్గొననున్న ప్రధానమంత్రి


ముడి పదార్థాల నుంచి తుది ఉత్పత్తుల వరకు మొత్తం వస్త్ర రంగాన్ని కవర్ చేయనున్న కార్యక్రమం

ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల నుంచి పాల్గొననున్న పాలసీమేకర్స్, సీఈవోలు, ఎగ్జిబిటర్స్, అంతర్జాతీయ కొనుగోలుదారులు

Posted On: 15 FEB 2025 1:51PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు సాయంత్రం జరగనున్న భారత్ టెక్స్ 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొనిప్రసంగించనున్నారు.

ఈనెల 14 నుంచి 17 వరకు భారత్ మండపంలో జరిగే ఈ కార్యక్రమం ముడి పదార్థాల నుంచి ఉపకరణాలు సహా తుది ఉత్పత్తుల వరకు మొత్తం వస్త్ర రంగాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురానుంది.

భారత్ టెక్స్ ప్లాట్‌ఫామ్ రెండు వేదికల ద్వారా మొత్తం వస్త్ర రంగాన్ని గురించి తెలియజెప్పే అతిపెద్దసమగ్రమైన కార్యక్రమం. 70కి పైగా సమావేశాలురౌండ్‌టేబుల్స్ప్యానెల్ చర్చలుమాస్ట‌ర్ క్లాసుల‌ను ఈ ప్రపంచ స్థాయి స‌ద‌స్సులో నిర్వ‌హిస్తున్నారు.

ప్రత్యేక ఆవిష్కరణలుఅంకుర సంస్థల ప్రదర్శనలతో పాటుగాప్రముఖ పెట్టుబడిదారుల నుంచి నిధులు సాధించే లక్ష్యంతో హ్యాకథాన్‌ ఆధారిత అంకుర సంస్థలఆవిష్కరణల ఉత్సవాలుటెక్ ట్యాంకులుడిజైన్ స‌వాళ్ల‌ను కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించనున్నారు.

ప్రపంచస్థాయి పాలసీ మేకర్స్సీఈఓలుఐదు వేల మందికి పైగా ఎగ్జిబిటర్లు, 120కి పైగా దేశాల నుంచి ఆరు వేల మంది అంతర్జాతీయ కొనుగోలుదారులుఇతర సందర్శకులు భారత్ టెక్స్ 2025లో పాల్గొననున్నట్లు అంచనాఇంటర్నేషనల్ టెక్స్‌టైల్ మాన్యుఫ్యాక్చరర్స్ ఫెడరేషన్ (ఐటిఎంఎఫ్), ఇంటర్నేషనల్ కాటన్ అడ్వైజరీ కమిటీ (ఐసిఎసి), యూరాటెక్స్టెక్స్‌టైల్ ఎక్చేంజ్యుఎస్ ఫ్యాషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ (యుఎస్ఎఫ్ఐఎవంటి 25కి పైగా ప్రముఖ ప్రపంచస్థాయి టెక్స్‌టైల్ సంస్థలుసంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి.


(Release ID: 2103893) Visitor Counter : 30