@font-face { font-family: 'Poppins'; src: url('/fonts/Poppins-Regular.ttf') format('truetype'); font-weight: 400; font-style: normal; } body { font-family: 'Poppins', sans-serif; } .hero { background: linear-gradient(to right, #003973, #e5e5be); color: white; padding: 60px 30px; text-align: center; } .hero h1 { font-size: 2.5rem; font-weight: 700; } .hero h4 { font-weight: 300; } .article-box { background: white; border-radius: 10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 40px 30px; margin-top: -40px; position: relative; z-index: 1; } .meta-info { font-size: 1em; color: #6c757d; text-align: center; } .alert-warning { font-weight: bold; font-size: 1.05rem; } .section-footer { margin-top: 40px; padding: 20px 0; font-size: 0.95rem; color: #555; border-top: 1px solid #ddd; } .global-footer { background: #343a40; color: white; padding: 40px 20px 20px; margin-top: 60px; } .social-icons i { font-size: 1.4rem; margin: 0 10px; color: #ccc; } .social-icons a:hover i { color: #fff; } .languages { font-size: 0.9rem; color: #aaa; } footer { background-image: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); } body { background: #f5f8fa; } .innner-page-main-about-us-content-right-part { background:#ffffff; border:none; width: 100% !important; float: left; border-radius:10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 0px 30px 40px 30px; margin-top: 3px; } .event-heading-background { background: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); color: white; padding: 20px 0; margin: 0px -30px 20px; padding: 10px 20px; } .viewsreleaseEvent { background-color: #fff3cd; padding: 20px 10px; box-shadow: 0 .5rem 1rem rgba(0, 0, 0, .15) !important; } } @media print { .hero { padding-top: 20px !important; padding-bottom: 20px !important; } .article-box { padding-top: 20px !important; } }
WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ స్థాయిలో బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్! హిందీ, బాలీవుడ్, శాస్త్రీయ, జానపద పాటలు పాడే బృందాలకు ముంబయిలో జరిగే వేవ్స్‌లో పాల్గొనే సువర్ణావకాశం!


మీకు 18 ఏళ్లు నిండాయా? అయితే 2 నిమిషాల వ్యవధి ఉన్న మీ బ్యాండ్ సంగీత ప్రదర్శన వీడియోను సమర్పించండి.. అంతర్జాతీయ బ్యాండ్లతో పోటీ పడేందుకు నమోదు ప్రక్రియ త్వరలోనే ప్రారంభం

అంతర్జాతీయ బ్యాండ్లతో పోటీపడనున్న భారత్‌లోని ఐదు అగ్రశ్రేణి బ్యాండ్లు - వైరాగీస్, సూఫీ రాకర్స్, సోల్స్ ఆఫ్ సూపీ X గౌరాన్ష్, ఎంహెచ్43, శివోహం

 Posted On: 13 FEB 2025 6:18PM |   Location: PIB Hyderabad

మీ వయసు 18 ఏళ్లు పైబడి ఉంటే.. మీ రక్తంలో సంగీతం ప్రవహిస్తుంటే.. అంతర్జాతీయ వేదికపై మెరిసిపోవాలన్న తపన మీకుంటే.. ప్రపంచంలోనే గొప్ప బ్యాండ్లతో పోటీ పడి నిజమైన తారగా మెరవాలని ఆకాంక్షిస్తుంటే.. చరిత్రలో మీ పేరును లిఖించే సువర్ణావకాశాన్ని వేవ్స్ మీకు అందిస్తోంది.

భారత్‌లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ అద్భుత విజయం తర్వాత బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ ఇంటర్నేషనల్‌ను నిర్వహించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, దూరదర్శన్, వేవ్స్ నిర్ణయించాయి. ముంబయిలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప సంగీత బ్యాండ్లను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాయి.

వేవ్స్ ఛాలెంజ్‌లో పోటీపడనున్న అంతర్జాతీయ బ్యాండ్లు

అంతర్జాతీయ బ్యాండ్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. పరిశీలన అనంతరం మొదటి 13 స్థానాల్లో నిలిచిన అంతర్జాతీయ బ్యాండ్లను భారత్‌లోని ఐదు అగ్ర బ్యాండ్లతో నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు ఎంపిక చేస్తారు. ఈ ప్రపంచంలో హిందీ, బాలీవుడ్, శాస్త్రీయ, జానపద గీతాలు పాడగలిగి, సొంత బ్యాండ్‌ ఉన్నవారు ఎవరైనా ఈ పోటీలకు నమోదు చేసుకోవచ్చు. మొదటి 5 స్థానాల్లో నిలిచిన అంతర్జాతీయ బ్యాండ్లు భారత్ కు చెందిన ఐదు అగ్ర బ్యాండ్లతో కలసి ప్రతిష్ఠాత్మక వేవ్స్ వేదికపై పాల్గొనే అవకాశాన్ని పొందుతాయి.

విజయం కోసం పోటీపడనున్న మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన బ్యాండ్లు

దేశం నలుమూలలకు చెందిన ప్రతిభను బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ ప్రదర్శించింది. నమోదు చేసుకున్న వాటిలో 26 బ్యాండ్లు పోటీకి ఎంపికయ్యాయి. ఇవి తుది దశ పోటీలకు చేరుకునేందుకు ప్రతివారం న్యాయనిర్ణేతలు ఇచ్చిన బాలీవుడ్, ఒరిజినల్స్ (బ్యాండ్లు సొంతంగా రూపొందించిన పాటలు), శాస్త్రీయం, జానపదం, సాహిత్యం అనే సవాళ్లను స్వీకరించి పోటీపడ్డాయి. ఫైనల్స్‌కు ఐదు బ్యాండ్లు చేరుకున్నాయి. వాటిలో ది వైరాగీస్ విజేతగా నిలిచింది. మొదటి రన్నరప్‌గా సూఫీ రాకర్స్, రెండో రన్నరప్‌గా సోల్స్ ఆఫ్ సూఫీ X గౌరాన్ష్ నిలిచాయి. ఎంహెచ్43, శివోహం టాప్ 5లో చోటు దక్కించుకున్నాయి.

సృజనాత్మకతకు, సంగీతాభివృద్ధికి ఉత్సవం  

ఈ కార్యక్రమం ప్రజలకు అందమైన అనుభూతిగా మిగిలిపోతుంది. వివిధ రకాల సంగీత ప్రదర్శనలను, విస్తృతమైన కళా ప్రక్రియలతో సాగే ఈ ప్రదర్శనలు- విభిన్న అభిరుచులున్న సంగీత ప్రియులకు ఉత్సవంగా మారనున్నాయి.

ఓవైపు సృజనాత్మకత, సంగీత సరిహద్దులును చెరిపేస్తూనే మరోవైపు సమాజ భావన, ఆవిష్కరణ, వృద్ధిని పెంపొందించడమే బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ ఇంటర్నేషనల్ లక్ష్యంగా పెట్టుకుంది. యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తాజా సంగీత అనుభూతిని ఇచ్చే వేదికగా మారేందుకు వేవ్స్ సిద్ధంగా ఉంది.

ఈ కార్యక్రమానికి సరిగమ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ప్రఖ్యాత కార్యక్రమ దర్శకురాలు శ్రుతి ఆనందిత వర్మ దర్శకత్వం వహించారు. కేతన్ సింగ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ పోటీలకు రాజా హసన్, శ్రద్ధా పండిట్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అంతర్జాతీయంగా ప్రసిద్ది పొందిన టోనీ కక్కర్, శ్రుతి పథక్, రాధికా చోప్రా, అమితాబ్ వర్మ మార్గనిర్దేశకులుగా ఉన్నారు.

ఈ పోటీలకు రిజిస్టర్ చేసుకోవడానికి, ఈ కార్యక్రమానికి సంబంధించిన తాజా సమాచారానికి వేవ్స్ అధికారిక వెబ్సైట్ www.wavesindia.org సందర్శించండి

పాల్గొనాల్సిన విధానం

ఈ పోటీల్లో పాల్గొనడానికి బ్యాండ్లు (గాయకుడితో సహా గరిష్టంగా ఐదుగురు సభ్యులుండాలి) తమ సంగీత ప్రతిభను తెలియజెప్పే ఆడియో-విజువల్ ప్రదర్శనను దూరదర్శన్ అధికారిక వెబ్సైట్ ద్వారా సమర్పించాలి. ఈ ప్రదర్శనలో ఇప్పటికే ఉన్న పాటలు, సంగీత కూర్పులు ఉండకూడదు.  ఈ పాట పూర్తిగా బ్యాండు రూపొందించినదే అయి ఉండాలి.

1.వీడియో సమర్పణ:

ఆధునిక, సంప్రదాయ, జానపద బాణీల మేళవింపుతో సొంతంగా రూపొందించిన సంగీతాన్ని ప్రదర్శిస్తూ తీసిన వీడియోను (గరిష్టంగా రెండు నిమిషాల వ్యవధి, 300ఎంబీ, ఎంపీ4 ఫార్మాట్) బ్యాండ్లు కచ్చితంగా సమర్పించాలి.

దూరదర్శన్ అధికారిక వెబ్సైట్లోని ‘‘వేవ్స్ ఇండియా’’ విభాగంలో ‘బ్యాటిల్ ఆప్ బ్యాండ్స్’ ఎంపిక చేసుకోవాలి. దిగువన పేర్కొన్న సూచనలు పాటిస్తూ నమోదు చేసుకోవాలి.

2.రిజిస్ట్రేషన్

బ్యాండ్ పేరు, నగరం, సంప్రదించాల్సిన వివరాలు, బ్యాండు సభ్యులు, సోషల్ మీడియా లింక్‌లు, ప్రదర్శన లింక్ వివరాలను రిజిస్ట్రేషన్ ఫారంలో నమోదు చేయాలి.

3.నిబంధనలు:

సమర్పించిన వాటిలో చెల్లుబాటయ్యే వీడియోలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా వీడియోలు ఉండాలి. నిబంధనలు పాటించకపోతే అనర్హతకు గురవుతారు.

సమాచారాన్ని సమర్పించడం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ప్రచార వినియోగం నిమిత్తం  వీడియోపై హక్కులు కోల్పోతారు.

వేవ్స్ గురించి

వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ (వేవ్స్) ప్రారంభ సంచిక మే 1 నుంచి మే 4 వరకు జరగనుంది. ప్రసార, డిజిటల్ మీడియా, ప్రకటనలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, ఈ-స్పోర్ట్స్, సంగీత విభాగాల్లో అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంగా వేవ్స్ ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. మీడియా, వినోద పరిశ్రమలో పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్ పాత్రను బలోపేతం చేయడానికి వేవ్స్ 2025 కీలకమైన ప్రకటనలు కార్యక్రమాలను వేవ్స్ 2025 చేపడుతోంది.


Release ID: (Release ID: 2103167)   |   Visitor Counter: 48