ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆదాయపు పన్ను చట్టం-1961 సమగ్ర సరళీకరణ దిశగా ఆదాయపు పన్ను బిల్లు- 2025ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్రం
Posted On:
13 FEB 2025 3:54PM by PIB Hyderabad
ఆదాయపు పన్ను బిల్లు-2025ను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆదాయపు పన్ను చట్టం-1961 భాష, నిర్మాణాన్ని సరళీకరించే దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు.
ఈ సరళీకరణ విధానాన్ని మూడు ప్రధాన సూత్రాలు నిర్దేశిస్తున్నాయి:
-
స్పష్టతను, అన్వయాన్నీ పెంచడం కోసం రాతనీ, భాషా నిర్మాణాన్ని సరళీకరించడం.
-
పన్ను విధానంలో ప్రధాన మార్పులు లేకపోవడం వల్ల కొనసాగింపునకు, కచ్చితత్వానికి అవకాశం కల్పించడం.
-
పన్ను రేట్లలో మార్పులు లేవు.. తద్వారా పన్ను చెల్లింపుదారుల అంచనాలను పరిరక్షించవచ్చు.
త్రిముఖ విధానాన్ని అవలంబించారు:
-
-
పఠన సౌలభ్యాన్ని మెరుగుపరచడం కోసం భాషా సంక్లిష్టతను తొలగించడం.
-
మెరుగైన నిర్వహణ కోసం అనావశ్యకమైన, పునరావృత్తమైన నిబంధనలను తొలగించడం.
-
రిఫరెన్సును సులభతరం చేయడం కోసం విభాగాలను తార్కికంగా పునర్వ్యవస్థీకరించడం.
సంప్రదింపులు, పరిశోధన ఆధారిత విధానం
పన్ను చెల్లింపుదారులు, వాణిజ్య సమూహాలు, పారిశ్రామిక సంఘాలు, వృత్తిపరమైన సంస్థలతో సంప్రదింపుల ద్వారా భాగస్వాములందరినీ ప్రభుత్వం ఇందులో విస్తృతంగా భాగస్వాములను చేసింది. ఆన్లైన్ లో వచ్చిన 20,976 సూచనల్లో ఔచిత్యవంతంగా ఉన్న వాటిని పరిశీలించి అవకాశమున్న చోట పొందుపరిచారు. పారిశ్రామిక, పన్ను నిపుణులతో సంప్రదింపులు జరిపారు. ఆచరణీయత కోసం ఆస్ట్రేలియా, యూకేల సరళీకరణ నమూనాలను అధ్యయనం చేశారు.
సరళీకృతం చేయడం వల్ల కలిగిన పరిమాణాత్మక ఫలితాలు
ప్రభావం
ఈ సమీక్ష చట్టం పరిమాణాన్ని గణనీయంగా తగ్గించింది. ఇది దీనిని మరింత క్రమబద్ధీకరించడంతోపాటు, నిర్వహణ మెరుగవుతుంది. కీలకమైన తగ్గింపులను కింది పట్టికలో సంగ్రహంగా పేర్కొనడమైనది:
అంశం
|
ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961
|
ప్రతిపాదిత ఆదాయపు పన్ను చట్టం- 2025
|
మార్పు (తగ్గింపు/పెంపు)
|
పదాలు
|
512,535
|
259,676
|
తగ్గినది: 252,859 పదాలు
|
అధ్యాయాలు
|
47
|
23
|
తగ్గినది: 24 అధ్యాయాలు
|
విభాగాలు
|
819
|
536
|
తగ్గినది: 283 విభాగాలు
|
పట్టికలు
|
18
|
57
|
పెరిగినది: 39 పట్టికలు
|
సూత్రాలు
|
6
|
46
|
పెరిగినది: 40 సూత్రాలు
|
గుణాత్మకమైన మెరుగుదల
-
-
చట్టం అందరికీ అర్థమయ్యే విధంగా సరళమైన భాష.
-
సవరణల క్రోఢీకరణ ద్వారా అనేక విభజనలను తగ్గించడం.
-
స్పష్టతను పెంచడం కోసం వ్యవహారంలో లేని, అనావశ్యకమైన నిబంధనల తొలగింపు.
-
పఠన సౌలభ్యాన్ని పెంచడం కోసం పట్టికలు, సూత్రాల ద్వారా నిర్మాణాత్మకమైన హేతుబద్ధీకరణ.
-
కొనసాగింపునకు అవకాశమిస్తూ వినియోగాన్ని మెరుగుపరిచేలా ప్రస్తుత పన్ను సూత్రాలను పరిరక్షించడం.
సరళమైన, స్పష్టమైన పన్ను విధానాన్ని రూపొందించడం ద్వారా సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభుత్వ నిబద్ధతను ఆదాయపు పన్ను బిల్లు- 2025 ప్రతిబింబిస్తోంది.
***
(Release ID: 2102837)
Visitor Counter : 54
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Khasi
,
Urdu
,
Hindi
,
Nepali
,
Marathi
,
Punjabi
,
Gujarati
,
Tamil