రక్షణ మంత్రిత్వ శాఖ
ఏరో ఇండియా-2025 నేపథ్యంలో బహుళ రక్షణ ప్రతినిధి బృందాలను కలిసిన రక్షణ కార్యదర్శి
Posted On:
12 FEB 2025 8:00AM by PIB Hyderabad
ఏరో ఇండియా-2025 కార్యక్రమం నేపథ్యంలో రక్షణ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్, ఫిబ్రవరి 11న బెంగుళూరులో పలు ద్వైపాక్షిక సమావేశాలని నిర్వహించారు. మొజాంబిక్ దేశ రక్షణ కార్యదర్శి కాసిమీరో ఆగస్టో ముయియో, శ్రీలంక రక్షణ కార్యదర్శి, విశ్రాంత ఎయిర్ వైస్ మార్షల్ సంపత్ తుయాకొంత, సురినామ్ దేశ శాశ్వత రక్షణ కార్యదర్శి జయంత్ కుమార్ బిదేశీ, మంగోలియా స్టేట్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ గంఖయుగ్ దేగ్వదోర్జ్, నేపాల్ రక్షణ కార్యదర్శి రామేష్వొర్ దంగల్, మారిషస్ శాశ్వత కార్యదర్శి దేవేంద్రె గోపాల్, కాంగో దేశ శాశ్వత కార్యదర్శి మేజర్ జనరల్ లుక్వికిలా మెటిక్విజా మార్సెల్ లతో శ్రీ రాజేష్ కుమార్ పలు దఫాల్లో సమావేశాలను నిర్వహించి చర్చలు జరిపారు .
ఈ సమావేశాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న రక్షణ సహకార ఒప్పందాల గురించి, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల గురించి చర్చించారు. ముఖ్యంగా రక్షణ పరిశ్రమల మధ్య సహకార బలోపేతంపై సమావేశాలు దృష్టి కేంద్రీకరించాయి. అనంతరం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మమెంట్ కి చెందిన, ఫ్రాన్స్ దేశ ఇంటర్నేషనల్ డైరెక్టరేట్, లెఫ్ట్ నెంట్ జనరల్ గెయిల్ డియాజ్ డి ట్వెస్టా తో శ్రీ రాజేష్ కుమార్ సమావేశమై సంయుక్త ప్రాజెక్టులు, రక్షణ పారిశ్రామిక సహకారం గురించి చర్చలు జరిపారు.
***
(Release ID: 2102541)
Visitor Counter : 35