ప్రధాన మంత్రి కార్యాలయం
మాసేలో భారత కాన్సులేట్ జనరల్‌ను సంయుక్తంగా ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమాన్యుయెల్ మాక్రాన్
Posted On:
12 FEB 2025 4:58PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమాన్యుయెల్ మాక్రాన్ ఫ్రాన్స్‌లోని మాసేలో భారత కాన్సులేట్ జనరల్ (దౌత్య కార్యాలయం) ను సంయుక్తంగా ప్రారంభించారు.
భారత-ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలలో కాన్సులేట్ జనరల్ కార్యాలయ ప్రారంభం కీలకమైనదిగా భావిస్తున్నారు. శ్రీ మాక్రాన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక గౌరవమంటూ శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక సందర్భాన్ని వీక్షించడానికి వచ్చిన భారత సమాజ ప్రతినిధులు ఇరువురు నేతలకూ ఘన స్వాగతం పలికారు.
మాసే లో దౌత్య కార్యాలయం ప్రారంభించాలన్న నిర్ణయాన్ని ప్రధాన మంత్రి జూలై 2023 ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రకటించారు. ఈ కాన్సులేట్ జనరల్ దౌత్య సేవలు దక్షిణ ఫ్రాన్స్‌లోని ప్రోవెన్స్ అల్ప్స్ కోట్ డేజూర్, కోర్సికా, ఆక్సిటానీ, ఆవెర్న్-రోన్-ఆల్ప్స్ అనే నాలుగు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
ఫ్రాన్స్ దేశంలోని ఈ ప్రాంతం వ్యాపారం, పరిశ్రమలు, ఇంధనం, లగ్జరీ పర్యాటకాలకు ప్రసిద్ధి చెందింది. అంతేకాక ఈ ప్రాంతానికి భారతదేశంతో గణనీయమైన ఆర్థిక, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు కూడా ఉన్నాయి. ఫ్రాన్స్ లో జనాభా పరంగా రెండో అతి పెద్ద నగరమైన మాసే లో భారత దౌత్య కార్యాలయ ప్రారంభం భారత-ఫ్రాన్స్ బహుముఖీన సంబంధాలను మరింత బలపరచడంలో సహాయపడగలదని భావిస్తున్నారు.
(Release ID: 2102538)
Visitor Counter : 34
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam