ప్రధాన మంత్రి కార్యాలయం
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
11 FEB 2025 1:16PM by PIB Hyderabad
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. “పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు దేశసేవకే అంకితమైన దార్శనికుడు. సమాజంలోని అట్టడుగు స్థాయి వ్యక్తి అభ్యుదయం కోసం శ్రమించాలన్న ఆయన ఆదర్శం, బలమైన దేశంగా ఎదిగేందుకు మనం చేస్తున్న కృషికి స్ఫూర్తిని అందిస్తూనే ఉంది” అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికలో సందేశమిస్తూ:
“పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. పండిట్ జీ దేశసేవకే అంకితమైన దార్శనిక తత్వవేత్త. సమాజంలోని అట్టడుగు స్థాయి వ్యక్తి అభ్యున్నతి కోసం సైతం పని చేయాలన్న ఆయన ఆదర్శం, శక్తిమంతమైన దేశంగా అవతరించాలన్న మన కృషికి బలాన్నిస్తోంది. ఆయన త్యాగం, ఆశయాలూ.. ప్రగతి, ఐక్యత కోసం మనం చేసే ప్రయత్నాలకు మార్గదర్శనం చేస్తున్నాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
MJPS/VJ/SKS
(रिलीज़ आईडी: 2101708)
आगंतुक पटल : 69
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam