మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకూర్ నేతృత్వంలో న్యూయార్క్ లో సామాజిక అభివృద్ధి కమిషన్-2025 63వ సదస్సులో పాల్గొననున్న భారత ప్రతినిధి బృందం
‘సంఘటితత్వాన్ని, ఐక్యతను బలోపేతం చేయడం’ అన్న ప్రాధాన్యతాంశంపై మంత్రుల సమావేశంలో
రేపు భారత ప్రకటనను సమర్పించనున్న శ్రీమతి ఠాకూర్
प्रविष्टि तिथि:
10 FEB 2025 2:34PM by PIB Hyderabad
సోమవారం నుంచి ఈనెల 14 వరకు జరగనున్న సామాజిక అభివృద్ధి కమిషన్ 63వ సదస్సులో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రీ ఠాకూర్ నేతృత్వంలో భారత్ పాల్గొనబోతోంది. సమ్మిళిత సామాజిక విధానాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచవ్యాప్తంగా సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించడంపై దృష్టిపెడుతూ.. కీలకమైన సామాజిక అభివృద్ధి అంశాలపై చర్చలను ప్రోత్సహించడం, భాగస్వామ్యాలను పెంపొందించడం ఈ సదస్సు లక్ష్యం.
ఈ సమావేశాల్లో కీలక చర్చల్లో భారత్ క్రియాశీలంగా పాల్గొంటుంది. ‘సంఘటితత్వాన్ని, ఐక్యతను బలోపేతం చేయడం’ అన్న ప్రాధాన్యతాంశంపై భారత ప్రకటనను సహాయమంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకూర్ మంగళవారం మంత్రుల సమావేశంలో సమర్పిస్తారు.
‘పునరావృత్తమవుతున్న, కీలకమైన సంక్షోభాల నేపథ్యంలో సామాజిక ఏకతను ప్రోత్సహించే విధానాలు’ వంటి అంశాలపై చర్చల్లో భారత ప్రతినిధి బృందం పాల్గొంటుంది. సార్వత్రిక హక్కుల ఆధారిత సామాజిక రక్షణ వ్యవస్థలపై జరిగే చర్చల్లోనూ ప్రతినిధులు భాగస్వాములవుతారు.
సామాజిక ఐక్యతను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన విధానాలు, కార్యక్రమాలను ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందం ప్రత్యేకంగా పేర్కొంటుంది.
ఈ సామాజిక అభివృద్ధి సదస్సు సందర్భంగా జరిగే చర్చలు.. సామాజిక రుగ్మతలను పరిష్కరించడంలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంతోపాటు సంక్షోభాలను ఎదుర్కొనగల సన్నద్ధతను మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు. అనుభవాలను పంచుకోవడానికి, అంతర్జాతీయ సహచరుల నుంచి అవసరమైన అంశాలను స్వీకరించడం ద్వారా మరింత దృఢమైన, ఐక్యతతో కూడిన సమాజ నిర్మాణానికి భారత్ కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 2101324)
आगंतुक पटल : 51