మంత్రిమండలి
కుదించిన వాల్తేర్ డివిజన్ తో విశాఖపట్నం డివిజన్: ప్రతిపాదిత సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లో మార్పు
Posted On:
07 FEB 2025 8:46PM by PIB Hyderabad
దిగువ పేర్కొన్న అంశాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది.
i. 28.02.2019లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వల్పంగా మార్పు చేశారు. దీని ప్రకారం.. కుదించిన రూపంలో వాల్తేర్ డివిజన్ కొనసాగుతుంది. అయితే ఈ డివిజన్ పేరు విశాఖపట్నంగా ఉంటుంది.
ii. వాల్తేరు డివిజన్లోని ఒక భాగమైన పలాస-విశాఖపట్నం-దువ్వాడ, కూనేరు-విజయనగరం, నౌపడ జంక్షన్-పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్-సాలూరు, సింహాచలం నార్త్-దువ్వాడ బైపాస్, వాడలపూడి-దువ్వాడ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్-జగ్గయ్యపాలెం స్టేషన్ల మధ్య సెక్షన్లు (సుమారుగా 410 కి.మీ.) ఇకపై కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్టు రైల్వేలో భాగం కానున్నాయి. వలసపాలన నాటి గుర్తులను మార్చాల్సిన నేపథ్యంలో వాల్తేరు పేరును విశాఖపట్నం డివిజన్ గా మార్చారు.
iii. వాల్తేర్ డివిజన్లోని మరో భాగమైన కొత్తవలస – బచేలి, కూనేరు-తేరువల్లి జంక్షన్, సింగాపూర్ రోడ్డు – కోరాపుట్ జంక్షన్, పర్లాకిమిడి – గున్పూర్ స్టేషన్ల మధ్య సెక్షన్లు (మొత్తం 680 కి.మీ.)తో ఈస్ట్ కోస్టు రైల్వేలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి రాయగడ కేంద్రం కానుంది.
కుదించినప్పటికీ, వాల్తేర్ డివిజన్ ను కొనసాగించడం వల్ల ఈ ప్రాంత ప్రజల అవసరాలు, ఆకాంక్షలను నెరవేరుస్తుంది.
***
(Release ID: 2100927)
Visitor Counter : 23