ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిధి 74 నుంచి 100శాతానికి పెంపు


పెన్షన్ ఉత్పత్తుల నియంత్రణ, సమన్వయం, అభివృద్ధికి ఫోరం ఏర్పాటు: కేంద్ర బడ్జెట్ 2025-26

పునరుద్ధరించిన సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ ప్రారంభమయ్యేది ఈ ఏడాదే

కంపెనీ విలీనాలు మరింత వేగవంతంగా ఆమోదం: సంబంధిత విధానాల హేతుబద్ధీకరణ - సులభతరం కానున్న ప్రక్రియ

Posted On: 01 FEB 2025 1:21PM by PIB Hyderabad

2025-26 కేంద్ర బడ్జెట్‌ను ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెడుతూ, రాబోయే ఐదేళ్లలో మన వృద్ధి సామర్థ్యాన్ని, ప్రపంచంతో పోటీతత్వాన్ని పెంపొందించే ఆరు రంగాల్లో గణనీయమైన మార్పులే  లక్ష్యంగా సంస్కరణలను ప్రారంభించడం తమ  ప్రధాన ఉద్దేశమని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి వ్యాఖ్యానించారు.

వీటిలో ఒకటి ఆర్థిక రంగం, దీనిలో బీమా, పెన్షన్లు, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలు (బీఐటీ) మొదలైన రంగాలు భాగంగా ఉంటాయి.

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిధిని ప్రస్తుతం ఉన్న 74శాతం నుండి 100శాతానికి పెంచినట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రీమియం మొత్తాన్ని పూర్తిగా భారత్‌లో పెట్టుబడి పెట్టే కంపెనీలకు ఈ పరిధి పెంపు వర్తిస్తుందని ఆమె పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న రక్షణ నియమాలు, షరతులను సమీక్షించి వాటిని సరళీకరిస్తామని ప్రకటించారు.

పెన్షన్ రంగం

పెన్షన్ ఉత్పత్తుల నియంత్రణాత్మక సహకారం, అభివృద్ధి కోసం ఒక ఫోరంను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి వివరించారు.



కేవైసీ సరళీకరణ

కేవైసీ ప్రక్రియను సరళీకృతం చేయడంపై గతంలో చేసిన ప్రకటనను అమలు చేయడానికి, పునరుద్ధరించిన సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీని ఈ ఏడాది ప్రారంభిస్తామని శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు. కాలానుగుణంగా నవీకరించడానికి క్రమబద్ధీకరించబడిన వ్యవస్థను కూడా అమలు చేస్తామన్నారు.

 
కంపెనీల విలీనం

కంపెనీ విలీనాలను త్వరితగతిన ఆమోడ్డించడానికి అవసరమైన విధానాలను హేతుబద్ధీకరిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి తెలిపారు. ఫాస్ట్-ట్రాక్ విలీనాల పరిధిని కూడా విస్తృతం చేసి, ప్రక్రియను సులభతరం చేస్తామని ఆమె ప్రకటించారు.

ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలు

సుస్థిరమైన విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి అలాగే 'ముందుగా భారత్ అభివృద్ధి (ఫస్ట్ డెవలప్ ఇండియా)' స్ఫూర్తితో, ప్రస్తుత బీఐటీ నమూనాను పునరుద్ధరించి, పెట్టుబడిదారులకు మరింత అనుకూలంగా మారుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.

 

***


(Release ID: 2098500) Visitor Counter : 80