ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం..దేశీయంగా విలువ ఆధారిత వ్యవస్థను బలపరచడం..


‘2070కల్లా నెట్ జీరో’ లక్ష్య సాధనకు మద్దతివ్వడం..

ఇవీ జాతీయ కీలక ఖనిజాల మిషన్ ధ్యేయాలు: ప్ర‌ధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 30 JAN 2025 1:12PM by PIB Hyderabad

దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించాలనీదేశీయంగా విలువ ఆధారిత వ్యవస్థ (వేల్యూ చైన్స్‌)ను బలపరచాలనీ, ‘2070కల్లా  నికర నెట్ జీరో’ లక్ష్య సాధనకు మద్దతివ్వడం.. ఇవీ జాతీయ కీలక ఖనిజాల మిషన్ (నేషనల్ క్రిటికల్ మినరల్స్..ఎన్‌సీఎంఎంధ్యేయాలని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

జాతీయ కీలక ఖనిజాల మిషన్‌ను గురించి కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఒక వ్యాసం రాశారుదీనిపై  శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ:
‘‘
దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడందేశంలో  విలువ ఆధారిత వ్యవస్థ (వేల్యూ చైన్స్‌)ను బలపరచడం, ‘2070కల్లా నెట్ జీరో’ లక్ష్యాన్ని సాధించడానికి మద్దతివ్వడం.. ఈ ధ్యేయాలను జాతీయ కీలక ఖనిజాల మిషన్ ఎలా నెరవేర్చుకోవాలనుకొంటున్నదీ కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి (@kishanreddybjp) తన వ్యాసంలో వివరించార’’ని పేర్కొన్నారు.

 

 

***

MJPS/ST


(రిలీజ్ ఐడి: 2097609) సందర్శకుల సూచీ సంఖ్య : : 70