ప్రధాన మంత్రి కార్యాలయం
సైనిక దినోత్సవం సందర్భంగా భారత సైన్యం అచంచల ధైర్యసాహసాలకు అభివాదం చేసిన ప్రధానమంత్రి
భారత సైన్యం... పట్టుదల, వృత్తిపరమైన నైపుణ్యం, అంకిత భావానికి ప్రతీక: ప్రధానమంత్రి
సాయుధ బలగాలు, వారి కుటుంబాల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధానమంత్రి
Posted On:
15 JAN 2025 9:18AM by PIB Hyderabad
ఈ రోజు సైనిక దినోత్సవం సందర్భంగా భారత సైన్యం అచంచల ధైర్యసాహసాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభివాదం చేశారు. భారత సైన్యం పట్టుదల, వృత్తిపరమైన నైపుణ్యం, అంకితభావానికి ప్రతీక అని అన్నారు. “సాయుధ బలగాలు, వారి కుటుంబాల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొన్నేళ్లుగా మేము అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాం. ఆధునికీకరణపై దృష్టి పెట్టాం" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
'ఈ రోజు, సైనిక దినోత్సవం సందర్భంగా... మన దేశ భద్రతకు రక్షణగా నిలుస్తున్న భారత సైన్యం అచంచల ధైర్యసాహసాలకు నా వందనం. అలాగే, ప్రతిరోజూ కోట్లాది మంది భారతీయుల భద్రతకు భరోసా ఇస్తున్న వీర జవాన్ల త్యాగాలను కూడా స్మరించుకుంటున్నాం. భారత సైన్యం సంకల్పం, వృత్తి సామర్ధ్యం, అంకితభావానికి ప్రతీక. మన సరిహద్దులను కాపాడడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో మానవతా సహాయం అందించడంలో కూడా మన సైన్యం తన ప్రత్యేకతను చాటింది. సాయుధ బలగాలు, వారి కుటుంబాల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొన్నేళ్లుగా అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి ఆధునికీకరణపై దృష్టి సారించాం. రానున్న రోజుల్లోనూ ఇది కొనసాగుతుంది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.
***
(Release ID: 2093191)
Visitor Counter : 7
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam