సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రయాగ్ రాజ్ లో ఆలిండియా రేడియో ప్రత్యేక ఎఫ్ఎం ఛానల్ 'కుంభ్ వాణి', 'కుంభ మంగళ్ ధ్వని'లను ప్రారంభించిన యూపీ


ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా జరిగే అన్ని రోజులు

అక్కడ జరిగే కార్యక్రమాలపై ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ప్రసారం చేయనున్న కుంభవాణి ఛానల్

మహా కుంభమేళా సంప్రదాయాన్ని దేశానికి, ప్రపంచానికి ప్రచారం చేయడంతో పాటు భక్తులకు ముఖ్యమైన సమాచారాన్ని అందించనున్న కుంభవాణి ఛానల్

Posted On: 10 JAN 2025 7:54PM by PIB Hyderabad

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు ప్రయాగ్ రాజ్ లోని సర్క్యూట్ హౌస్ లో మహా కుంభమేళా 2025 కోసం ప్రత్యేకించిన ఆల్ ఇండియా రేడియో కుంభవాణి (103.5 మెగాహెర్ట్జ్ప్రత్యేక ఎఫ్ఎమ్ ఛానెల్ ను ప్రారంభించారుఈ చారిత్రాత్మక సందర్భంలో కేంద్ర సమాచారప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కూడా ఆన్ లైన్ లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కుంభమేళా మంగళ ధ్వనిని కూడా ప్రారంభించారు.

కుంభ్ వాణి ఛానల్ ను ప్రారంభించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకిసమాచారప్రసార మంత్రిత్వ శాఖకు శ్రీ యోగి ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ ఎఫ్ ఎమ్ ఛానల్ ప్రజాదరణలో కొత్త శిఖరాలను చేరుకోవడమే కాకుండాఎంతో ఉత్సుకత ఉన్నా... కుంభమేళాకు రాలేని మారుమూల గ్రామాల ప్రజల వద్దకు మహాకుంభ్ ను ఈ ఛానల్ తీసుకువెళుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగించిన కేంద్ర సమాచారప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు  సంతోషంకృతజ్ఞతలు తెలియజేశారుతక్కువ వ్యవధిలోనే ఈ ప్రత్యేక ఎఫ్ఎం ఛానెల్ ను ప్రారంభించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కుంభమేళాలో పాల్గొనడానికి ప్రయాగ్ రాజ్ కు రాలేని వారికి కుంభ్ వాణి అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రయోజనకరంగా ఉంటుందిఅంతేగాకఈ చారిత్రాత్మక మహా కుంభమేళా వాతావరణాన్ని దేశానికిమొత్తం ప్రపంచానికి కూడా చేరుస్తుందిభారత ప్రజా సేవా ప్రసార సంస్థ ప్రసార భారతి తీసుకున్న ఈ కార్యక్రమం దేశంలోని చారిత్రక ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ప్రోత్సహించడమే కాకుండాభక్తులకు ముఖ్యమైన సమాచారాన్ని అందించడంతో పాటువారి ఇంట్లోనే సాంస్కృతిక శోభను అనుభూతి చెందేలా చేస్తుంది.

కుంభ్ వాణి గురించి…

కుంభ్ వాణి ఛానల్పరిచయంప్రసార వ్యవధి

ప్రసార కాలం: 10 జనవరి 2025 నుండి 26 ఫిబ్రవరి 2025 వరకు

ప్రసార సమయంఉదయం 5:55 నుంచి రాత్రి 10:05 వరకు

ఫ్రీక్వెన్సీఎఫ్ఎమ్ 103.5 మెగాహెర్ట్జ్

కుంభ్ వాణి  ప్రత్యేక కార్యక్రమాలు:

ప్రత్యక్ష ప్రసారం:

ప్రధాన స్నాన ఆచారాల ప్రత్యక్ష ప్రసారం (జనవరి 14, 29, ఫిబ్రవరి 3).

కుంభమేళా కార్యకలాపాలపై రోజువారీ లైవ్ రిపోర్టింగ్.

సాంస్కృతిక వారసత్వంపై ప్రత్యేక ప్రజెంటేషన్:

'శివ మహిమసీరియల్ ప్రసారం.

భారతీయ సాంస్కృతిక వారసత్వం పై ప్రత్యేక కార్యక్రమాలు.

టాక్ షోలు:

'నమస్కారం ప్రయాగరాజ్' (ఉదయం 9:00-10:00).

'సంగం ఒడ్డు నుంచి' (సాయంత్రం 4:00-5:30).

స్పెషల్ హెల్త్ కౌన్సిలింగ్:

'హలో డాక్టర్కార్యక్రమంలో స్టూడియో నుంచి వైద్యుల ఆరోగ్య సలహాలు (లైవ్).

కుంభమేళా వార్తలు:

మెయిన్ న్యూస్ బులెటిన్లు (ఉదయం 8:40, మధ్యాహ్నం 2:30 , రాత్రి 8:30).

ప్రత్యేక కవరేజీ:

రాష్ట్ర ప్రభుత్వంవివిధ శాఖలు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల కవరేజీ.

యువతమహిళలువిదేశీ సందర్శకులపై ప్రత్యేక కార్యక్రమం.

ముఖ్యమైన ప్రకటనలు:

ప్రయాణంఆరోగ్యంపరిశుభ్రతపోయినదొరికిన వస్తువులు,  చేయవలసినవిచేయకూడని వాటికి సంబంధించిన సమాచారం ప్రసారం చేస్తారు

ఆలిండియా రేడియో అన్ని వేళలా పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ గా ప్రత్యేక పాత్రను పోషిస్తోందిభారతీయ సాంస్కృతిక వారసత్వంసంప్రదాయాలకు ప్రాచుర్యం కల్పిస్తోంది. 2013 కుంభమేళా, 2019 అర్ధ కుంభమేళా సమయంలో కుంభ్ వాణి ఛానల్ శ్రోతల్లో అధిక ప్రజాదరణ పొందిందిఅదే సంప్రదాయానికి అనుగుణంగా 2025 మహా కుంభమేళా కోసం ఈ ప్రత్యేక ఛానల్ ను పునరుద్ధరించారు.

ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్కేబినెట్ మంత్రులు స్వతంత్ర దేవ్ సింగ్నంద గోపాల్ గుప్తా (నంది),  ఓం ప్రకాశ్ రాజ్భర్ప్రసార భారతి బోర్డు చైర్మన్ నవనీత్ సెహగల్ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి గౌరవ్ ద్వివేదిఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్రగ్యా పాలివాల్ గౌర్డైరెక్టర్ జనరల్ దూరదర్శన్ కంచన్ ప్రసాద్దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ జనరల్ ప్రియా కుమార్ ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

***


(Release ID: 2092256) Visitor Counter : 18