రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

జనవరి 21-29 మధ్య రాష్ట్రపతి భవన్ సందర్శకులకు అనుమతి లేదు జనవరి 11, 18, 25 తేదీల్లో గార్డ్ సెరిమనీ ఉండదు

Posted On: 09 JAN 2025 4:08PM by PIB Hyderabad

రాష్ట్రపతి భవన్ (సర్క్యూట్ 1)ని 2025 జనవరి 21 నుంచి 29 తేదీల మధ్య సాధారణ ప్రజలు సందర్శించడానికి వీలు కల్పించకుండా మూసి ఉంచుతారు. గణతంత్ర దినోత్సవ కవాతు, బీటింగ్ రిట్రీట్ సెరిమనీ (గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల ముగింపును సూచిస్తూ సైన్యం ఆధ్వర్యంలో జరిగే ఒక కార్యక్రమం) ల కారణంగా రాష్ట్రపతి భవన్ ను మూసివేయనున్నట్లు రాష్ట్రపతి సచివాలయం తెలియజేస్తోంది.

 

గణతంత్ర దినోత్సవ కవాతు కు రిహార్సల్ నిర్వహించే కారణంగా 2025 జనవరి 11, 18, 25వ తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో ‘ది చేంజ్ ఆఫ్ గార్డ్ సెరిమనీ’ని కూడా ఏర్పాటు చేయడం లేదు.

 

 


(Release ID: 2091653) Visitor Counter : 7