ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ప్రెసిడెంట్ కోస్టాకు ప్రధాని అభినందనలు
భారత్ – ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా కలసి పనిచేసేందుకు అంగీకరించిన ఇద్దరు నాయకులు
పరస్పర ప్రయోజనాన్ని అందించే భారత్-ఈయూ ఎఫ్‌టీఏను ముందుగా పూర్తి చేయడంపై అంగీకారం
प्रविष्टि तिथि:
07 JAN 2025 8:31PM by PIB Hyderabad
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీకి ఈ రోజు ఫోన్ చేశారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన ప్రెసిడెంట్ కోస్టాకు ప్రధాని అభినందనలు తెలియజేశారు. గత దశాబ్దంలో భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన గణనీయమైన పురోగతి గురించి చర్చిస్తూ, వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడులు, హరిత విద్యుత్, డిజిటల్ స్పేస్‌తో సహా వివిధ రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కలసి పనిచేసేందుకు ఇద్దరు నాయకులు అంగీకరించారు.
పరస్పర ప్రయోజనాలు అందించే భారత్ – ఈయూ ఎఫ్‌టీఏను ముందుగానే పూర్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఇరు పక్షాలకు అనుకూలమైన సమయంలో జరిగే భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశం కోసం నేతలిద్దరూ ఎదురుచూస్తున్నారు.
పరస్పరం ఆసక్తితో కూడిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తరచూ సంప్రదింపులు కొనసాగించేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు.
***
(रिलीज़ आईडी: 2091050)
आगंतुक पटल : 72
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam