ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో చెస్ చాంపియన్ కోనేరు హంపి భేటీ
प्रविष्टि तिथि:
03 JAN 2025 8:42PM by PIB Hyderabad
చదరంగ క్రీడలో విజేత కోనేరు హంపి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమయ్యారు. భారతదేశానికి గొప్ప గర్వకారణంగా నిలిచినందుకు కోనేరు హంపిని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ, ఆమె పదునైన మేధస్సు, అచంచల దృఢనిశ్చయం తేటతెల్లం అయ్యాయన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కోనేరు హంపి నమోదు చేసిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘కోనేరు హంపినీ, ఆమె కుటుంబాన్నీ కలుసుకోవడం సంతోషాన్ని కలిగించింది. ఆమె క్రీడారంగంలో ప్రతిభావంతురాలు. అంతేకాదు, వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్న క్రీడాకారులకు ఆమె ఓ స్ఫూర్తి. ఆమె సునిశిత మేధస్సు, మొక్కవోని దృఢ సంకల్పం ఈసరికే సుస్పష్టమయ్యాయి. భారతదేశానికి గొప్ప గర్వకారణంగా ఆమె నిలవడం ఒక్కటే కాకుండా, నైపుణ్యం అంటే ఏమిటో కూడా సరికొత్తగా నిర్వచించారు’’
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2090385)
आगंतुक पटल : 57
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam