ప్రధాన మంత్రి కార్యాలయం
రాణి వేలు నాచ్చియార్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి స్మృత్యంజలి
प्रविष्टि तिथि:
03 JAN 2025 10:59AM by PIB Hyderabad
ధీరవనిత రాణీ వేలు నాచ్చియార్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు స్మృత్యంజలి ఘటించారు. అసాధారణ ధైర్య సాహసాలతో వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన రాణి... యుద్ధ వ్యూహా రచనలో కూడా దిట్టగా పేరుగాంచారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో రాస్తూ...
“రాణి వేలు నాచ్చియార్ జయంతి సందర్భంగా ఆ ధీర వనితను స్మరించుకుందాం. అసాధారణ ధైర్య సాహసాలతో వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆమె, యుద్ధ వ్యూహ రచనలో గొప్ప ప్రజ్ఞ చూపేవారు. పీడనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడే ఎన్నో తరాలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు. మహిళల సాధికారత కోసం ఆమె ఇతోధికంగా చేసిన కృషిని నేటికీ గుర్తు చేసుకుంటాం” అని ప్రధాని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2089913)
आगंतुक पटल : 84
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam