యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
2024వ సంవత్సరానికి జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా 2025 జనవరి 17న అవార్డుల ప్రదానం
Posted On:
02 JAN 2025 2:26PM by PIB Hyderabad
యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2024వ సంవత్సరానికి జాతీయ క్రీడా పురస్కారాలను ఈ రోజు ప్రకటించింది. ఈ అవార్డుల విజేతలకు భారత రాష్ట్రపతి 2025 జనవరి 17న (శుక్రవారం) ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
కమిటీ సిఫారసుల ఆధారంగా చేసుకొని తగిన పరిశీలన ప్రక్రియను ముగించిన తరువాత ఈ కింద ప్రస్తావించిన క్రీడాకులకు, కోచ్‌లకు, విశ్వవిద్యాలయాలకు, సంస్థలకు పురస్కారాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది:
i. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024
క్రమ సంఖ్య
|
క్రీడాకారుడు, క్రీడాకారిణి పేరు
|
విభాగం
|
1.
|
శ్రీ గుకేశ్ డి
|
చదరంగం
|
2.
|
శ్రీ హర్‌మన్‌ప్రీత్ సింగ్
|
హాకీ
|
3.
|
శ్రీ ప్రవీణ్ కుమార్
|
పారా-అథ్లెటిక్స్
|
4.
|
కుమారి మను భాకర్
|
షూటింగ్
|
ii. 2024 2024వ సంవత్సరంలో క్రీడలు, ఆటలలో అసాధారణ ప్రదర్శనకు గాను అర్జున పురస్కారాలు
S. No.
|
క్రమ సంఖ్య
|
క్రీడాకారుడు, క్రీడాకారిణి పేరు
|
విభాగం
|
-
|
కుమారి జ్యోతి యర్రాజి
|
అథ్లెటిక్స్
|
-
|
కుమారి అన్ను రాణి
|
అథ్లెటిక్స్
|
-
|
కుమారి నీతు
|
బాక్సింగ్
|
-
|
కుమారి సవీతి
|
బాక్సింగ్
|
-
|
కుమారి వంతిక అగ్రవాల్
|
చదరంగం
|
-
|
కుమారి సలీమా తీతె
|
హాకీ
|
-
|
శ్రీ అభిషేక్
|
హాకీ
|
-
|
శ్రీ సంజయ్
|
హాకీ
|
-
|
శ్రీ జర్మన్‌ప్రీత్ సింగ్
|
హాకీ
|
-
|
శ్రీ సుఖ్‌జీత్ సింగ్
|
హాకీ
|
-
|
శ్రీ రాకేశ్ కుమార్
|
పారా-ఆర్చరీ
|
-
|
కుమారి ప్రీతి పల్
|
పారా-అథ్లెటిక్స్
|
-
|
కుమారి జీవన్‌జీ దీప్తి
|
పారా-అథ్లెటిక్స్
|
-
|
శ్రీ అజీత్ సింగ్
|
పారా-అథ్లెటిక్స్
|
-
|
శ్రీ సచిన్ సర్జెరావ్ ఖిలాడీ
|
పారా-అథ్లెటిక్స్
|
-
|
శ్రీ ధరంబీర్
|
పారా-అథ్లెటిక్స్
|
-
|
S శ్రీ ప్రణవ్ సూర్మా
|
పారా-అథ్లెటిక్స్
|
-
|
శ్రీ హెచ్. హొకాతొ సీమా
|
పారా-అథ్లెటిక్స్
|
-
|
కుమారి సిమ్‌రన్
|
పారా-అథ్లెటిక్స్
|
-
|
శ్రీ నవ్‌దీప్
|
పారా-అథ్లెటిక్స్
|
-
|
శ్రీ నితేశ్ కుమార్
|
పారా-బాడ్మింటన్
|
-
|
కుమారి తులసిమతి మురుగేశన్
|
పారా-బాడ్మింటన్
|
-
|
కుమారి నిత్య శ్రీ సుమతి శివన్
|
పారా-బాడ్మింటన్
|
-
|
కుమారి మనీషా రామదాస్
|
పారా-బాడ్మింటన్
|
-
|
శ్రీ కపిల్ పర్‌మార్
|
పారా-జూడో
|
-
|
కుమారి మోనా అగర్వాల్
|
పారా-షూటింగ్
|
-
|
కుమారి రుబీనా ఫ్రాన్సిస్
|
పారా-షూటింగ్
|
-
|
శ్రీ స్వప్నిల్ సురేశ్ కుశలే
|
షూటింగ్
|
-
|
శ్రీ సరబ్‌జోత్ సింగ్
|
షూటింగ్
|
-
|
శ్రీ అభయ్ సింగ్
|
స్క్వాష్
|
-
|
శ్రీ సాజన్ ప్రకాశ్
|
ఈత
|
-
|
శ్రీ అమన్
|
కుస్తీ
|
|
|
iii. 2024వ సంవత్సరంలో క్రీడలు, ఆటలలో అసాధారణ ప్రదర్శనకు గాను అర్జున (జీవనకాల) పురస్కారాలు
S. No.
|
క్రీడాకారుని పేరు
|
విభాగం
|
1.
|
శ్రీ శుచ సింగ్
|
అథ్లెటిక్స్
|
2.
|
శ్రీ మురళీకాంత్ రాజారామ్ పేట్‌కర్
|
పారా-స్విమింగ్
|
iv. 2024వ సంవత్సరంలో క్రీడలు, ఆటలలో అసాధారణ ప్రదర్శనకు గాను ద్రోణాచార్య పురస్కారం
A. రెగ్యులర్ కేటగిరీ:
S. No.
|
కోచ్ పేరు
|
విభాగం
|
1.
|
శ్రీ సుభాష్ రాణా
|
పారా-షూటింగ్
|
2.
|
కుమారి దీపాలి దేశ్‌పాండే
|
షూటింగ్
|
3.
|
శ్రీ సందీప్ సంగ్‌వాన్
|
హాకీ
|
B. జీవనకాల కేటగిరీ:
S. No.
|
కోచ్ పేరు
|
విభాగం
|
1.
|
శ్రీ ఎస్. మురళీధరన్
|
బాడ్మింటన్
|
2.
|
శ్రీ అమన్‌దో ఏంజెలొ కొలాకొ
|
ఫుట్‌బాల్
|
v. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్
S. No.
|
సంస్థ పేరు
|
1.
|
ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా
|
(vi) 2024వ సంవత్సరానికి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (ఎంఏకేఏ) ట్రోఫీ:
S. No.
|
విశ్వవిద్యాలయం పేరు
|
1
|
చండీగఢ్ విశ్వవిద్యాలయం
|
మొత్తం మీద విజేత విశ్వవిద్యాలయం
|
2
|
లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పీబీ
|
ఒకటో రన్నర్ అప్ యూనివర్సిటీ
|
3
|
గురు నానక్ దేవ్ యూనివర్సిటీ, అమృత్‌సర్
|
రెండో రన్నర్ అప్ యూనివర్సిటీ
|
క్రీడలలో నైపుణ్యాన్ని ఏటా గుర్తించి, తగిన బహుమతిని ఇవ్వడానికి జాతీయ క్రీడా పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు.
ఎవరైనా క్రీడాకారునికి లేదా క్రీడాకారిణికి వారు వెనుకటి నాలుగు సంవత్సరాల్లో క్రీడారంగంలో ప్రత్యేక, అత్యంత అసాధారణ ప్రదర్శనను కనబర్చినందుకుగాను ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని’ ఇస్తారు.
వెనుకటి నాలుగేళ్లలో చక్కని ప్రదర్శననిచ్చినందుకుగాను, అలాగే నాయకత్వం, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ వంటి గుణాలను కనబర్చినందుకు ‘క్రీడల్లోనూ, ఆటల్లోనూ అసాధారణ ప్రదర్శనను కనబర్చినందుకుగాను అర్జున పురస్కారాన్ని’ ఇస్తారు.
క్రీడాకారులు, క్రీడాకారిణులు క్రీడారంగానికి వారి ప్రదర్శనతో తోడ్పాటును ఇచ్చినందుకుగాను, అలాగే క్రియాశీల క్రీడా వృత్తిరంగం నుంచి పదవీ విరమణ పొందిన తరువాత కూడా క్రీడలను ప్రోత్సహించడానికి వారి వంతు సేవలను అందిస్తూ ఉన్న వారిని గౌరవించి, ప్రేరణను అందించేందుకు అర్జున (జీవనకాల) పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
‘క్రీడలలోనూ, ఆటల్లోనూ అసాధారణ కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య పురస్కారాన్ని’ అసాధారణ, ప్రతిభాన్విత కృషిని కొనసాగిస్తున్న కోచ్‌లకు, క్రీడాకారులు అంతర్జాతీయ ఈవెంట్‌లలో మంచి పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకొనేటట్టు చూసిన వారికి ప్రదానం చేస్తారు.
ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో మొత్తంమీద అగ్రగామి ప్రదర్శనను కనబర్చిన విశ్వవిద్యాలయానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ (ఎంఏకేఏ) ట్రోఫీని ఇస్తారు.
దరఖాస్తులను ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా ఆహ్వానించారు. క్రీడాకారులు, కోచ్‌లు, సంస్థలు ఒక ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా దరఖాస్తు పెట్టుకోవడానికి అనుమతినిచ్చారు. ఈ సంవత్సరం
ఈ పురస్కారాలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తులను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) వి. రామసుబ్రమణియన్ నాయకత్వంలో సభ్యులుగా ప్రముఖ క్రీడాకారులు, క్రీడా పాత్రికేయ రచన రంగంలో అనుభవజ్ఞులతో పాటు స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్లు వ్యవహరించిన ఓ ఎంపిక సంఘం పరిశీలించింది.
***
(Release ID: 2089644)
Visitor Counter : 92
Read this release in:
Odia
,
Malayalam
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Kannada