మంత్రిమండలి
azadi ka amrit mahotsav

డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (డిఎపి) పై ఎన్బిఎస్ సబ్సిడీకి అదనంగా వన్ టైమ్ స్పెషల్ ప్యాకేజీని పొడిగించడానికి కేబినెట్ ఆమోదం


01.01.2025 నుండి తదుపరి ఉత్తర్వుల వరకు వర్తింపు
రైతులకు తక్కువ ధరలకు డీఏపీని నిరంతరం అందుబాటులో ఉంచడమే లక్ష్యం

Posted On: 01 JAN 2025 3:28PM by PIB Hyderabad

 డై -అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ)పై ఎన్ బిఎస్ సబ్సిడీకి అదనంగా మెట్రిక్ టన్నుకు రూ.3,500 ప్రత్యేక ప్యాకేజీని 01.01.2025 నుండి తదుపరి ఉత్తర్వుల వరకు పొడిగించాలన్న ఎరువుల శాఖ ప్రతిపాదనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందిరైతులకు డిఎపి ని తక్కువ ధరలో స్థిరంగా అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు

ప్రయోజనాలు:

రైతులకు డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (డిఎపిని సబ్సిడీతోవారు భరించ గలిగే,  న్యాయమైన ధరల వద్ద అందుబాటులో ఉంచుతారు

అమలు వ్యూహం-లక్ష్యాలు:

రైతులకు సహేతుకమైన ధరకు డీఏపీ ఎరువులు సజావుగా లభించేలా ఆమోదిత ఎన్బిఎస్ సబ్సిడీకి మించి మెట్రిక్ టన్నుకు రూ.3,500 చొప్పున ప్రత్యేక ప్యాకేజీని 01.01.2025 నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అందిస్తారు.

నేపథ్యం:

ఎరువుల తయారీదారులుదిగుమతిదారుల ద్వారా 28 రకాల  పీ అండ్ కే ఎరువులు రైతులకు సబ్సిడీ ధరలకు లభిస్తాయిపీ అండ్ కే  ఎరువులపై 01.04.2010 నుండి ఎన్బిఎస్ పథకం కింద సబ్సిడీ ఇస్తున్నారుకేంద్ర ప్రభుత్వం ధృఢ సంకల్పంతో రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూడై-అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీఎరువుల ధరను నిలకడగా ఉంచడం ద్వారా రైతులకు భారీ ఉపశమనం కల్పించిందిభౌగోళిక-రాజకీయ అవరోధాలుప్రపంచ మార్కెట్ పరిస్థితుల అస్థిరత ఉన్నప్పటికీ, 2024-25  ఖరీఫ్రబీలో రైతులకు సహేతుక ధరకు డిఎపిని అందించడం ద్వారా రైతు స్నేహపూర్వక విధానం పట్ల ప్రభుత్వం తన నిబద్ధతను కొనసాగించింది. 01.04.2024 నుంచి 31.12.2024 వరకు రూ.2,625 కోట్ల ఆర్థిక భారంతో ఎన్బీఎస్ సబ్సిడీకి మించి డీఏపీపై వన్ టైమ్  ప్రత్యేక ప్యాకేజీకి 2024 జూలైలో కేబినెట్ ఆమోదం తెలిపింది.

 

***


(Release ID: 2089351)