మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
‘జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్: త్రూ ది ఏజెస్’ పుస్తకాన్ని న్యూఢిల్లీలో ఆవిష్కరించనున్న శ్రీ అమిత్ షా గౌరవ అతిథిగా శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
01 JAN 2025 5:07PM by PIB Hyderabad
కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా 2025 జనవరి 2న న్యూఢిల్లీలో జరగబోయే ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడంతోపాటు అధ్యక్ష బాధ్యతలను కూడా నిర్వహించనున్నారు. కేంద్ర విద్యా శాఖా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొంటారు. ప్రముఖ రచయితలు, విద్యావేత్తలు, మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ల ప్రస్తుత స్థితిగతులను ‘జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్: త్రూ ది ఏజెస్’ పుస్తకంలో పొందుపరిచారు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ల కథను సంబంధిత విషయ నిపుణులతోపాటు ఆ ప్రాంతాల గురించి అంత పెద్దగా అవగాహన లేని వ్యక్తులకు కూడా ఈ గ్రంథం సమగ్రంగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది. మూడు వేల సంవత్సరాలకు మించిన ఆ ప్రాంత చరిత్రను ఈ గ్రంథంలో ఏడు భాగాలలో వివరించారు. కాలానుగుణంగా ఉన్న ప్రాముఖ్యాన్నీ, భారతదేశ చరిత్రకు సంబంధించిన ఓ విశాల యవనికలో ఈ ప్రాంతానికున్న పాత్రనూ అత్యంత శ్రద్ధతో చిత్రిక పట్టి మరీ నిదర్శనాలుగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసెర్చ్ సంయుక్త సహకారంతో సిద్ధం చేసి హిందీలోనూ, ఇంగ్లిషులోనూ ప్రచురించారు.
***
(Release ID: 2089347)
Visitor Counter : 54