ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యునైటెడ్ కింగ్‌డమ్ రాజు చార్లెస్ - III తో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


భారత్, బ్రిటన్‌ల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిబద్ధత కొనసాగిస్తామని పునరుద్ఘాటన

కామన్‌వెల్త్, వాతావరణ మార్పు, సుస్థిరత్వం..ఈ అంశాలపై పరస్పర ఆలోచనల వెల్లడి

క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్న ఇరువురు నేతలు

Posted On: 19 DEC 2024 6:15PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రిటన్ రాజు చార్లెస్ - III తో  ఈరోజు మాట్లాడారు.

రెండు దేశాల మధ్య ఉన్న చరిత్రాత్మక సంబంధాలను వారు ఉభయులు ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకొంటూ, భారతదేశం- యునైటెడ్ కింగ్‌డమ్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచుకోవాలన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు.

వారు  కామన్‌వెల్త్  పైనా, ఇటీవలె సమోవాలో ముగిసిన  కామన్‌వెల్త్  ప్రభుత్వాధినేతల సమావేశం పైనా తమ అభిప్రాయాల్ని ఒకరికొకరు తెలియజేసుకొన్నారు.

వాతావరణ మార్పు, సుస్థిరత్వ సాధన సహా ఇరు  దేశాల ప్రయోజనాలూ ఇమిడి ఉన్న అనేక అంశాలపైన కూడా వారు చర్చించారు.  ఈ అంశాల్లో రాజు చార్లెస్ - III  తరచు తన సమర్థనతోపాటు చొరవను ప్రదర్శిస్తుండడాన్ని ప్రధాని ప్రశంసించారు. భారత్ అమలుచేస్తున్న అనేక కార్యక్రమాలను ప్రధాని రాజు దృష్టికి తీసుకువచ్చారు.

త్వరలో క్రిస్మస్, నూతన సంవత్సరం పండుగలు రానున్న సందర్భంగా వారిరువురూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకొన్నారు.

రాజు చార్లెస్ - III కు మంచి ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలగాలని అభిలషిస్తూ  ప్రధానమంత్రి శుభాకాంక్షలను వ్యక్తంచేశారు.

 


(Release ID: 2086692)