ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రయాగ్ రాజ్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

Posted On: 13 DEC 2024 5:17PM by PIB Hyderabad

గౌరవనీయ ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ ఆనందీబెన్ పటేల్ గారుగౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారూగౌరవనీయ ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య గారుబ్రజేశ్ పాఠక్ గారుఉత్తర ప్రదేశ్ కు చెందిన గౌరవనీయ మంత్రులుగౌరవనీయులైన పార్లమెంటుశాసనసభ సభ్యులుమేయర్ గారుప్రయాగ్ రాజ్ జిల్లా పంచాయతీ అధ్యక్షులుఇతర విశిష్ట అతిథులునా ప్రియమైన సోదర సోదరీమణులారా.

ప్రయాగరాజ్ లోని  పవిత్ర సంగమ భూమికి భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లుతున్నానుమహా కుంభమేళాకు వస్తున్న సాధువులురుషులందరికీ నా నమస్కారాలుమహా కుంభమేళాను విజయవంతం చేయడానికి రాత్రింబవళ్లు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఉద్యోగులుకార్మికులుపారిశుద్ధ్య సిబ్బంది కృషిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానుఇలాంటి బృహత్తరమైన అంతర్జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించడంప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు స్వాగతం పలకడానికిసేవలందించడానికి సన్నద్ధమవడం, 45 రోజుల పాటు నిరంతరాయంగా మహా యజ్ఞం నిర్వహించడం బృహత్తరమైన కార్యక్రమంలో భాగంగా కొత్త నగరాన్ని నిర్మించడం —  చర్యలు ప్రయాగరాజ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తున్నాయివచ్చే ఏడాది జరిగే మహా కుంభమేళా మన దేశ సాంస్కృతికఆధ్యాత్మిక అస్తిత్వాన్ని అత్యున్నత స్థాయిలో నిలుపుతుంది మహా కుంభమేళాను ఒక్క వాక్యంలో వర్ణిస్తే.. అదిలా ఉంటుందని నేనెంతో ఆత్మవిశ్వాసంతోభక్తితో ఇలా చెప్పగలను - ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించే ఐక్యతా మహా యజ్ఞం కార్యక్రమం గొప్పదైవిక విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

 

మిత్రులారా,

 

భారతదేశం పవిత్ర ప్రదేశాలుపవిత్ర తీర్థయాత్రలకు నిలయంఇది గంగయమునసరస్వతికావేరినర్మద వంటి లెక్కలేనన్ని పూజనీయమైన నదులకు నిలయం నదుల పవిత్రతఅనేక పుణ్యక్షేత్రాల ప్రాధాన్యంవాటి వైభవంసంగమంవాటి కలయిక — ఇవన్నీ ప్రయాగ వైభవాన్ని ప్రతిబింబిస్తాయిప్రయాగ మూడు పవిత్ర నదుల సంగమ ప్రాంతం మాత్రమే కాదు.. ఇది అద్వితీయమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ప్రదేశంప్రయాగ గురించి ఇలా అంటారుమాఘ్ మకర్ గత్ సబీ జబ్ హోయీ.. తీర్థపతిహిం ఆవ్ సబ్ కోయీ.. - అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో అన్ని దివ్య శక్తులుఅన్ని పుణ్యక్షేత్రాలురుషులుమహర్షులుఆధ్యాత్మికవేత్తలంతా ప్రయాగకే వస్తారు ప్రాంత ఆధ్యాత్మిక ప్రాశస్త్యం లేకుండా పురాణాలకు సంపూర్ణత చేకూరదువేదాల్లోని శ్లోకాలు కీర్తించిన పవిత్ర భూమి ప్రయాగరాజ్.

 

సోదరీ సోదరులారా,

 

అడుగడుగునా పవిత్ర ప్రదేశాలున్న పుణ్యభూమి ప్రయాగప్రతి మార్గమూ ఉన్నత స్థానాలకు చేరుస్తుంది శ్లోకంలో ఇలా చెప్తారుత్రివేణీం మాధవం సోమంభరద్వాజం  వాసుకిమ్.. వందే అక్షయ-వటం శేషప్రయాగం తీర్థనాయకంఇది త్రివేణీ సంగమ త్రిముఖ ప్రభావాన్ని వివరిస్తుందివేణీ మాధవ్ మహిమసోమేశ్వరుడి ఆశీస్సులుభరద్వాజ రుషి ఆశ్రమ పవిత్రతనాగరాజు వాసుకి విశిష్ట ప్రాధాన్యంఅక్షయ వట అమరత్వంశేషుడి నిత్య కృప – ఇదీ మన తీర్థరాజం ప్రయాగ.. ఇది తీర్థయాత్రల్లో అగ్రగామిప్రయాగ అంటే: ‘చారి పదార్థ్ భరా భండారు’.. అంటే ధర్మంఅర్థంకామంమోక్షం అనే నాలుగు జీవిత లక్ష్యాలను సాధించే ప్రదేశం ప్రయాగప్రయాగరాజ్  భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు.. బలమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించే క్షేత్రం పవిత్ర భూమిని పదేపదే సందర్శించడాన్ని ప్రయాగఇక్కడి ప్రజలు అందించిన ఆశీర్వాదంగా నేను భావిస్తానుగత కుంభమేళా సమయంలో సంగమంలో స్నానం చేసే భాగ్యం నాకు కలిగిందిమళ్లీ నేడు  కుంభమేళా ప్రారంభానికి ముందు పవిత్ర సంగమాన్ని దర్శించడం ద్వారా గంగా మాత ఆశీస్సులు పొందే భాగ్యం నాకు మరోసారి లభించిందిఈవేళ సంగమ్ ఘాట్ వద్ద పవిత్ర స్నానమాచరించానుహనుమంతుడిని దర్శించుకున్నానుఅక్షయ వట వృక్షం ఆశీస్సులు పొందానుభక్తుల సౌకర్యార్థం హనుమాన్ కారిడార్అక్షయ వట కారిడార్ నిర్మిస్తున్నారుసరస్వతి కూప పునరుద్ధరణ ప్రాజెక్టు గురించిన వివరాలు కూడా తెలుసుకున్నానునేడు వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం ఇక్కడ జరిగింది పరివర్తనాత్మక పరిణామాల పట్ల మీ అందరికీ నా అభినందనలు.

 

మిత్రులారా,

 

మన దేశ సాంస్కృతికఆధ్యాత్మిక ప్రస్థానానికి మహా కుంభమేళా  పవిత్రమైనసజీవ సాక్ష్యంవేలాది సంవత్సరాలుగా ఇది అవిచ్ఛిన్నంగా సాగుతోందిమతాన్నిజ్ఞానాన్నిభక్తినికళలను ఒక దివ్య సంగమంలోకి తెచ్చే కార్యక్రమం ఇదిమన గ్రంథాల్లో ఇలా చెప్పారు: ‘‘దశ తీర్థ సహస్రాణితిస్రః కోట్యాస్తతా అపరః.. సమ ఆగచ్ఛింతి మాఘ్యాం తుప్రయాగే భరతర్షభ’’.. అంటేప్రయాగ సంగమంలో పవిత్ర స్నానం అనేకమైన పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శించుకుని సంపాదించుకున్న పుణ్యాలలతో సమానమైనదిప్రయాగలో స్నానమాచరించిన వారు సకల పాపాల నుంచి విముక్తి పొందుతారురాజులుచక్రవర్తుల కాలమైనాలేదా వలస పాలన సాగిన శతాబ్దాల  కాలమైనా.. ఎన్నో తరాలుగా - కుంభమేళాపై ఉన్న అపారమైన విశ్వాసం అలాగే కొనసాగుతోందికుంభమేళాను  బాహ్య శక్తీ నడిపించడం లేదు.. అంతర్గత మానవీయ చేతన దీనిని నడిపిస్తుండడమే ఇందుకు కారణం చేతన సహజంగానే జాగరూకమైదేశం నలుమూలల నుంచి ప్రజలను  సంగమ తీరానికి చేరుస్తుందిగ్రామస్తులుపట్టణవాసులునగరవాసులు అందరూ ఒకేలా ప్రయాగ్ రాజ్ కు పయనమవుతారు సామూహిక చేతన ఒక అరుదైనశక్తిమంతమైన అంశంసాధువులురుషులుపండితులుజన సామాన్యమూ కలిసి త్రివేణి సంగమంలో ఇక్కడ పుణ్యస్నానాలను ఆచరిస్తారుకుల విభేదాలు తొలగిపోతాయిశాఖాపరమైన ఘర్షణలు మసకబారుతాయిలక్షలాది మంది ప్రజలు ఒకే ప్రయోజనంఉమ్మడి విశ్వాసంతో ఏకమవుతారు మహా కుంభమేళా సందర్భంగా.. వివిధ రాష్ట్రాలకు చెందినవివిధ భాషలు మాట్లాడేవివిధ కులాలుసంప్రదాయాలకు చెందినవివిధ విశ్వాసాలను కలిగి ఉన్న కోట్లాది మంది ప్రజలు కూడా ఇక్కడికి వస్తారుఅయినప్పటికీ సంగమ నగరానికి చేరుకోగానే వాళ్లంతా ఒక్కటే అవుతారుఅందుకే మహా కుంభమేళా నిజంగా ఏకతా మహాయాగమని నేను పునరుద్ఘాటిస్తున్నానుఅన్ని రకాల భేద

భావాలుపక్షపాతాలను ఇది రూపుమాపుతుందిసంగమంలో మునక వేసే ప్రతీ భారతీయుడూ ఏక భారత్శ్రేష్ట భారత్ అనే మహత్తరమైన దార్శనికతను ప్రదర్శిస్తాడు.

 

మిత్రులారా,

 

మహా కుంభమేళా సంప్రదాయంలో చెప్పుకోదగిన అంశాల్లో ఒకటి దేశానికి దిశానిర్దేశం చేయగల సామర్థ్యంకుంభమేళా సందర్భంగా దేశం ఎదుర్కొంటున్న సమస్యలుసవాళ్లపై విస్తృతంగా చర్చలు జరిగాయిసాధువుల మధ్య జరిగిన  చర్చలుసంభాషణలు దేశ ప్రజల ఆలోచనల్లో చాలావరకూ నవోత్తేజాన్ని నింపిప్రగతి పథంలో కొత్త మార్గాలను అన్వేషించేలా చేశాయిచారిత్రకంగా సాధువులుఆధ్యాత్మిక నేతలు ఇలాంటి సమావేశాలలో దేశానికి సంబంధించి అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారుఆధునిక సమాచార సాధనాల రాకకు ముందుకుంభమేళా వంటి కార్యక్రమాలే ప్రధాన సామాజిక మార్పులకు పునాది వేశాయిఇలాంటి కార్యక్రమాల్లో సాధుసంతులుపండితులు ఒక్కచోటికి వచ్చి ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలాభవిష్యత్తును నిర్దేశించే విధంగా సమాజంలోని సుఖదుఃఖాలపై చర్చిస్తారునేటికీ కుంభమేళా వంటి మహత్తర కార్యక్రమాల ఔచిత్యంలో ఎలాంటి మార్పూ లేదుఇవి సమాజానికి సానుకూల సందేశాన్ని పంపుతూ.. నిరంతర జాతీయ చింతనా స్రవంతిని పెంపొందిస్తూనే ఉన్నాయిఇలాంటి కార్యక్రమాల పేర్లుప్రాంతాలుమార్గాలు వేర్వేరుగా ఉండొచ్చు.. ప్రజలు మాత్రం ఒకే లక్ష్యంతో ఐక్యంగా ఉంటారు.

 

మిత్రులారా..

 

కుంభమేళాఇతర తీర్థయాత్రలకు అపారమైన ప్రాముఖ్యం ఉన్నప్పటికీగత ప్రభుత్వాలు వాటి ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాయిఆయా సమయాల్లో  భక్తులు తరచూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అప్పటి ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించేవిభారతీయ సంస్కృతి,  విశ్వాసాలతో ఎటువంటి అనుబంధం లేకపోవటమే నిర్లక్ష్యానికి అసలైన కారణంగా కనిపిస్తుందిఅయితే నేడు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకి  భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించే వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నారు.   "డబుల్-ఇంజిన్” ప్రభుత్వం కుంభమేళాకి హాజరయ్యే భక్తులకు  మంచి సౌకర్యాను కల్పించడాన్ని తన కర్తవ్యంగా భావిస్తోందిభక్తుల కోసం చేసే ఏర్పాట్లు  సజావుగా జరిపేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల ఖర్చుతో అనేక కార్యక్రమాలు చేపట్టాయిమహాకుంభ్ కి తగిన ఏర్పాట్లు చేయడంలో వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయడం ఎంతో అభినందనీయంప్రపంచ దేశాలు సహా దేశం నలుమూలల నుండి మేళాకి వచ్చే భక్తులకు  ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు,  రవాణా సౌకర్యాల మెరుగుదల పై దృష్టి కేంద్రీకరిస్తున్నారుఅయోధ్యవారణాసిరాయ్ బరేలీ,  లక్నో వంటి నగరాలకు ప్రయాగ్రాజ్ తో అనుసంధానాన్ని  గణనీయంగా మెరుగుపర్చారునేను తరచుగా ప్రస్తావించే  సమగ్రమైన “హోల్ ఆఫ్ గవర్నమెంట్” విధానం  మహా కుంభ్ సన్నాహాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

 

మిత్రులారా..

 

అభివృద్ధికి తగిన ప్రాధాన్యాన్ని ఇస్తూనేదేశ వారసత్వ పరిరక్షణసుసంపన్నం వైపు దృష్టి సారించాందేశవ్యాప్తంగా రామాయణ సర్క్యూట్శ్రీ కృష్ణ సర్క్యూట్బౌద్ధ సర్క్యూట్,  తీర్థంకర సర్క్యూట్ వంటి వివిధ ప్రత్యేక  పర్యాటక యాత్రలను అభివృద్ధి చేస్తున్నాం.   కార్యక్రమాలు గతంలో పెద్దగా పట్టించుకోని చారిత్రాత్మకఆధ్యాత్మిక కేంద్రాల వైపు పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ‘స్వదేశ్ దర్శన్ యోజన’,  ‘ప్రసాద్’ పథకం వంటి కార్యక్రమాల ద్వారా తీర్థయాత్రా కేంద్రాల వద్ద  సౌకర్యాలను విస్తరిస్తున్నాంరామమందిర నిర్మాణం అయోధ్యా నగరంలో ఎంతటి  అద్భుతమైన పరివర్తనకి కారణమయ్యిందో మనకి తెలుసు.  విశ్వనాథ్ ధామ్మహాకాల్ మహాలోక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందాయిప్రయాగ్రాజ్‌, అక్షయ్ వట్ కారిడార్హనుమాన్ టెంపుల్ కారిడార్భరద్వాజ్ రుషి ఆశ్రమ కారిడార్ వంటి ప్రాంతాల్లో ఇదేరకమైన పునరుజ్జీవనాన్ని గమనించవచ్చుభక్తులకు మెరుగైన సేవలందించేందుకు సరస్వతి కూపంపాతాళపురినాగవాసుకిద్వాదశ మాధవుని ఆలయాల పునరుద్ధరణ పనులను కూడా చేపట్టారు.

 

ప్రయాగరాజ్ నిషాద రాజు రాజ్యమని మనకి తెలుసుమర్యాద పురుషోత్తముడుగా రాముడి అవతరణలో శృంగవేర్పూర్కు ముఖ్యమైన స్థానం ఉందికేవత్ తో రాముని అనుబంధం గాధ,  ఈనాటికీ మనకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయికళ్ళెదుట తన ప్రభువు కనపడగానే కేవత్ అతులిత భక్తితో ఆయన పాదాలను కడిగితన పడవలో నది దాటించాడుఅద్వితీయ భక్తికిభగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడ్డ స్నేహాన్ని   గాథ  ప్రతిబింబిస్తుందిసర్వశక్తిమంతుడైన భగవంతుడు కూడా ఒక్కో సందర్భంలో భక్తుని సహాయం కోరగలడని  కథ మనకు తెలియజేస్తుందిశ్రీరాముడునిషాదరాజుల మధ్య ఏర్పడ్డ పవిత్ర స్నేహానికి చిహ్నంగా శృంగవేర్పూర్ ధామ్ ను  అభివృద్ధి పరుస్తున్నాంఇక్కడ ఏర్పాటు చేసే శ్రీరామ,  నిషాదరాజుల విగ్రహాలు భవిష్యత్తు తరాలకు సమానత్వంసామరస్యాలను గుర్తు చేస్తాయి

 

మిత్రులారా..

 

కుంభమేళా వంటి భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం విజయవంతమవడంలో పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందిమహాకుంభ్  సన్నాహాల్లో భాగంగా నమామి గంగే కార్యక్రమాన్ని వేగవంతం చేశాంప్రయాగ్రాజ్ నగరంలో పారిశుధ్యంవ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాంపరిశుభ్రతను గురించి అవగాహన పెంచేందుకు గంగాదూత్లుగంగా ప్రహారీలుగంగా మిత్రల సేవలను వినియోగించుకుంటాంఈసారి కుంభ్ పరిశుభ్రత బాధ్యతను పారిశుద్ధ్య నిర్వహణలో నిమగ్నమైన 15,000 మందికి  పైగా సోదర సోదరీమణులు చేపడతారుకుంభ్ సన్నాహాల్లో అంకితభావంతో అవిశ్రాంతంగా పనిచేస్తున్న  పారిశుధ్య కార్మికులకు ముందస్తుగా  నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుకోట్లాది సందర్శకులకు పవిత్రమైనపరిశుభ్రమైన ఆధ్యాత్మిక అనుభవం లభించేది మీ కృషి వల్లనే..  మీరు చేసే పవిత్రమైన సేవ వల్ల ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుని పుణ్యంలో మీకు భాగం లభిస్తుందిఎంగిలి పళ్ళాలను ఏరివేయడం ద్వారా శ్రీకృష్ణుడు మనకు పని విలువను బోధించినట్లుగామీరు చేసే పని కూడా కార్యక్రమ ప్రాముఖ్యాన్ని  పెంచుతుందితెల్లవారుజామున విధులను ప్రారంభించిఅర్థరాత్రి వరకూ శ్రమపడేది మీరే. 2019 కుంభమేళాలో పరిశుభ్రతకి పెద్దపీట లభించడం అందరి ప్రశంసలను అందుకుందిఅనేక దశాబ్దాలు కుంభమేళాలుమహాకుంభ్లలో పాల్గొన్న వారు కూడా తొలిసారిగా ఇటువంటి అత్యున్నతస్థాయి పరిశుభ్రతనుసమర్థవంతమైన నిర్వహణను చూశారుఅందుకు కారణమైన మీకు,  మీ పాదాలను కడిగడం ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను సమయంలో నేను అనుభవించిన సంతృప్తిసంతోషం మరచిపోలేని అనుభవంగా మిగిలిపోయింది.

 

మిత్రులారా..

 

కుంభమేళా ఆర్థికపరమైన కార్యకలాపాలకు మంచి ఊతాన్ని కల్పిస్తుందని మనం తరచూ విస్మరిస్తుంటాంమేళాకి సన్నాహకంగా ఇప్పటికే  ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు ఎలా ఊపందుకుంటున్నాయో గమనించవచ్చుసుమారు ఒకటిన్నర నెలల పాటు ప్రతిరోజూ లక్షలాది మంది సందర్శించే  ఒక కొత్త నగరం సంగం ఒడ్డున వెలుస్తుందిఇంతటి భారీకార్యక్రమాన్ని  నిర్వహించేందుకు ప్రయాగ్రాజ్లో పెద్ద సంఖ్యలో పనిచేసే వారు అవసరమవుతారు. 6,000 మందికి పైగా పడవ సరంగులు,  వేలాది మంది దుకాణదారులు,  శాస్త్రవిధులు,  పూజాకార్యక్రమాలుధ్యానం వంటి సంప్రదాయాల్లో  సహాయం చేసే వారి అవసరం గణనీయంగా పెరుగుతుందిఅంటే లెక్కకుమించి  ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నమాటసరఫరా వ్యవస్థను నిరంతరాయంగా నిర్వహించేందుకు వ్యాపారులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచీ  వస్తువులను తెప్పించుకోవలసి రావచ్చు.. దాంతో ప్రయాగ్రాజ్ కుంభమేళా ప్రభావం చుట్టుపక్కల జిల్లాలకు కూడా విస్తరిస్తుందిఇక ఇక్కడికి వచ్చే స్థానికేతర భక్తులు రైళ్లువిమానాలను వినియోగిస్తారుదాంతో ఆర్థిక వ్యవస్థకు మరింత లాభం చేకూరుతుంది ...  విధంగామహా కుంభ్ సామాజిక ఐక్యతను పెంపొందించడమే కాక ప్రజలకు  ఆర్థిక సాధికారతను కూడా కల్పిస్తుంది.

 

మిత్రులారా..

 

మునుపటితో పోలిస్తే 2025 మహాకుంభ్ సాంకేతికతపరంగా ఎంతో అభివృద్ధి చెందిన సమయంలో జరుగుతోందిగతంలో కంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లను వినియోగించే వారి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిందిడేటా ఇప్పుడున్నంత చవకగా 2013లో లభ్యమయ్యేది కాదుమొబైల్ ఫోన్ గురించి పరిమిత సాంకేతిక పరిజ్ఞానం గలవారు కూడా ఉపయోగించగల యూజర్-ఫ్రెండ్లీ యాప్‌ లు నేటి ఫోన్లలో ఉన్నాయితొలిసారి కుంభమేళాలో వినియోగం కోసం కృత్రిమ మేధ (ఏఐ), చాట్బాట్ టెక్నాలజీ ఆధారిత ‘కుంభ్ సహాయక్ చాట్బాట్‌’ ను ప్రారంభించాను  చాట్బాట్ ద్వారా 11 భారతీయ భాషల్లో సమాచారాన్ని పంచుకునే వీలు కలుగుతుందిసంప్రదాయంసాంకేతికతల మేలు కలయికతో తయారైన  నవీనతర సౌకర్యాన్ని  విరివిగా వినియోగించుకోవాలని కోరుతున్నానుఉదాహరణకు, ‘ఐక్యతా మహా యజ్ఞంగా మహాకుంభ్’ వంటి ఇతివృత్తంతో ఫోటోగ్రఫీ పోటీని నిర్వహించవచ్చుఇటువంటి కార్యక్రమాలు యువతను విశేషంగా ఆకర్షిస్తాయిదాంతో వారు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనే అవకాశముంది ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా  షేర్ చేసినప్పుడు అనేక వన్నెలుభావోద్వేగాలతో నిండిన అందమైన రంగుల హరివిల్లు ఆవిష్కృతమవుతుందిచెప్పేదేముంది.. అనంతమైన అవకాశాలకు ద్వారాలు తెరిచినట్టేమరోమాటమహా కుంభ్ అనుభూతి మరింత వ్యాపించేలా ఆధ్యాత్మికతప్రకృతికి సంబంధించిన పోటీలను కూడా నిర్వహించవచ్చు.

 

మిత్రులారా..

 

నేడు భారత్ సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు వేగంగా అడుగులు వేస్తోందిమహా కుంభ్ నుండి వెలువడే ఆధ్యాత్మికసామూహిక శక్తి మన సంకల్పానికి మరింత బలాన్ని చేకూర్చగలదని విశ్వసిస్తున్నానుమహాకుంభమేళాలో ఆచరించే పుణ్య నదీస్నానం చారిత్రకపరమైన మరపురాని అనుభూతిని కలిగించుగాక!  పవిత్రమైన గంగా యమునా సరస్వతి నదుల సంగమం మానవాళి సంక్షేమానికి దోహదపడుగాకఇదే మనందరి సమిష్టి అభీష్టంసంగమపురి  ప్రయాగ్రాజ్ ని సందర్శించే ప్రతి భక్తునికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఅందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలుఅందరూ నాతో కలిసి అనండి..

 

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

గంగా మాతా కీ జై!

గంగా మాతా కీ జై!

గంగా మాతా కీ జై! 

ధన్యవాదాలు!


(Release ID: 2086687) Visitor Counter : 8