ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పార్లమెంటుపై 2001లో దాడి సందర్భంగా అమరులైన వారికి ప్రధానమంత్రి శ్రద్ధాంజలి

Posted On: 13 DEC 2024 10:21AM by PIB Hyderabad

పార్లమెంటుపై 2001లో దాడి జరగగా ఆ దాడిని అడ్డుకొనే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వీరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:

‘‘పార్లమెంటుపై 2001లో దాడి జరిగిన సందర్భంగా ఆ దాడిని అడ్డుకొనే క్రమంలో ప్రాణత్యాగానికైనా వెనుదీయక అమరులైన వీరులకు శ్రద్ధాంజలి ఘటించాను.  వారు చేసిన త్యాగం మన దేశ ప్రజలకు ఎప్పటికీ ప్రేరణను అందిస్తూ ఉంటుంది.  ఆ వీరులు కనబరిచిన ధైర్య సాహసాలకు, అంకిత భావానికి మనం సదా కృతజ్ఞులమై ఉంటాం.’’


(Release ID: 2084292) Visitor Counter : 26