ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హర్యానాలోని పానిపట్‌లో అభివృద్ధిపనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి అనువాదం

Posted On: 09 DEC 2024 5:54PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జై,
భారత్ మాతా కీ జై,
భారత్ మాతా కీ జై,

హరి ధామమే హర్యానా... ఇక్కడ ప్రతిఒక్కరూ ఇతరులను మనసారా ‘రామ్ రామ్’ అంటూ పలకరిస్తారు.
హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ గారుఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్రజాదరణ పొందిన హుషారైన నేత శ్రీ నాయబ్ సింగ్ గారుకేంద్ర మంత్రిమండలిలో నా తోటి సభ్యులైన గౌరవనీయురాలు నిర్మలా సీతారామన్ గారుఈ భూమి పుత్రుడుపార్లమెంటు సభ్యుడుమాజీ ముఖ్యమంత్రిఅంతేకాకుండా ప్రభుత్వంలో నా సహచరుడైన శ్రీ మనోహర్ లాల్ గారుశ్రీ కృష్ణ పాల్ గారుహర్యానా ప్రభుత్వంలో మంత్రులు శృతి గారుఆర్తి గారుఎంపీలుఎమ్ఎల్ఏలుదేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ కేంద్రాలతో అనుబంధం ఉన్న సహచరులందరూ.. నా ప్రియ సోదరులుసోదరీమణులారా.
 

ఈ రోజు భారత్ మహిళా సాధికారత మార్గంలో మరో ముఖ్యమైన అడుగును వేస్తోందిఅనేక ఇతర కారణాల రీత్యా కూడా ఈ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉందిఈ రోజు 9వ తేదీఈ అంకెకు మన ధర్మ గ్రంథాలలో ఎంతో ప్రాధాన్యముంది. 9వ అంకె నవదుర్గలకు చెందిన శక్తులతో ముడిపడి ఉందినవరాత్రులలో మనం  తొమ్మిది రోజులను శక్తి ఆరాధనకు అంకితం చేస్తాంఈ రోజు కూడా మహిళలను గౌరవించుకోవడానికి అంకితం చేసిన రోజే.
మిత్రులారా,
రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశాన్ని ఇదే రోజు డిసెంబర్ 9న నిర్వహించారు.  రాజ్యాంగానికి 75 సంవత్సరాలు అయిన ఘట్టాన్ని దేశం ఉత్సవంగా జరుపుకొంటున్న క్రమంలో సమానత్వంసమగ్రాభివృద్ధి సిద్ధాంతాలను పరిరక్షించుకోవాలని గుర్తుకుతెచ్చే రోజూ ఈ రోజే.

మిత్రులారా,
ప్రపంచానికి ధర్మాన్నినీతిశాస్త్ర జ్ఞానాన్ని బోధించిన ఈ పూజనీయ భూమికి రావడమంటే అది నిజానికి ఒక భాగ్యంప్రస్తుతం కురుక్షేత్రలో ‘అంతర్జాతీయ గీత జయంతి మహోత్సవ్‌’ను కూడా నిర్వహిస్తున్నారుగీత పుట్టిన ఈ పవిత్ర భూమికి నేను నమస్కరిస్తున్నానునేను హర్యానా రాష్ట్రానికీదేశభక్తులైన హర్యానా  ప్రజలకూ స్నేహపూర్వకంగా ‘రామ్ రామ్’ అంటూ అభినందనలను తెలియజేస్తున్నాను. ‘ఏక్ హైతో సేఫ్ హై’ (మనం కలిసికట్టుగా
 ఉంటేసురక్షితంగా ఉంటాంఅనే మంత్రాన్ని హర్యానా అక్కున చేర్చుకొన్న పద్ధతి పూర్తి దేశానికి ఒక విశేష ఉదాహరణను అందించింది.
 

మిత్రులారా,
హర్యానాతో నాకున్న బంధంఈ భూమి అంటే నాకున్న అనురాగం.. ఇవి ఎవరికీ తెలియనివేమీ కాదుమీరు అందించిన గొప్ప మద్దతుఆశీర్వాదాలు ఇక్కడ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసే అవకాశాన్ని  ఇచ్చాయిదీనికిగాను హర్యానాలో ప్రతి ఒక్క కుటుంబానికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నానుసైనీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి కొన్ని వారాలే అయింది.  అయినప్పటికీఈ ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారుఈ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఎలాంటి ఖర్చులు భరించనక్కరలేకుండా లేదా ఎలాంటి సిఫార్సులతో పని లేకుండా వేలమంది యువజనులు ఏ విధంగా శాశ్వత ఉద్యోగాల్ని  సంపాదించుకొన్నారో పూర్తి దేశం గమనించింది.  ఇక్కడి డబల్-ఇంజిన్ ప్రభుత్వం ఇప్పుడు రెట్టింపు వేగంతో పని చేస్తోంది
 

మిత్రులారా,

ఎన్నికల కాలంలో హర్యానా మహిళలు ‘‘హమారా హర్యానానాన్-స్టాప్ హర్యానా’’ అని ఒక నినాదాన్ని వినిపించారుఈ నినాదాన్ని మేం మా సంకల్పంగా స్వీకరించాంఈ వాగ్దానంతోనే నేను మీ అందరినీ కలుసుకోవడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చానునేను చుట్టుపక్కల చూస్తూ ఉంటేతల్లులుసోదరీమణులు పెద్ద సంఖ్యల్లో తరలివచ్చిన దృశ్యాలే కనిపిస్తున్నాయి.  ఇది నిజంగా మనసులో ధైర్యాన్ని నింపేదిగా ఉంది.
 

మిత్రులారా,
దేశ మహిళలకుకుమార్తెలకు ఉద్యోగావకాశాలను సృష్టించడానికే ‘బీమా సఖి’ పథకాన్ని కాసేపటి కిందట ఇక్కడ ప్రారంభించారు.  బీమా సఖి కార్యక్రమంలో సర్టిఫికెట్లను కుమార్తెలకు ఈ రోజు ఇక్కడ పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా దేశమంతటా మహిళలకు నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను.
 

మిత్రులారా,
కొన్నేళ్ళ కిందట, ‘బేటీ బచావోబేటీ పఢావో’ ఉద్యమాన్ని పానీపత్ నుంచి ప్రారంభించే గౌరవం నాకు దక్కింది.  దీని సానుకూల ప్రభావం ఒక్క హర్యానాలోనే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించింది.  ఒక్క హర్యానాలోనేగత పదేళ్ళలో వేలాది పుత్రికల ప్రాణాలను కాపాడారుపదేళ్ళు అయిన తరువాత ఇప్పుడు మన సోదరీమణుల కోసంమన పుత్రికల కోసం ‘బీమా సఖి యోజన’ను ఈ పానీపత్ గడ్డ మీదినుంచే ప్రారంభించుకొన్నాం.  మహిళా సాధికారితకు ఎన్నో రకాలుగా పానీపత్ ఒక సంకేతంగా మారింది

మిత్రులారా,

భారత్ 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే సంకల్పాన్ని చెప్పుకొని ముందుకు సాగిపోతోంది.  1947 నాటి నుంచి అన్ని ప్రాంతాలఅన్ని సముదాయాల ఉమ్మడి శక్తే భారత్‌ను ఇప్పుడున్న స్థాయిలకు చేర్చింది.  ఏమైనప్పటికీ, ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని 2047 కల్లా సాధించాలంటే అందుకోసం మనం మన శక్తిి సంబంధించిన అనేక కొత్త వనరులను వినియోగించుకొనితీరాలి.  అలాంటి వనరుల్లో ఒక వనరు తూర్పు భారతం.  ఈశాన్య ప్రాంతం కూడా దీనిలో ఒక భాగంమరో కీలకమైన శక్తి వనరు మన దేశ మహిళా శక్తి అని చెప్పాలిఅభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడానికి మనకు మన అసంఖ్యాక మాతృమూర్తులసోదరీమణుల అదనపు శక్తి అవసరంవారి తోడ్పాటు మనకు గొప్ప ప్రేరణ శక్తి.  ఈ రోజు మహిళల నాయకత్వంలోని స్వయం సహాయ బృందాలుబీమా సఖిబ్యాంక్ సఖికృషి సఖీలు అభివృద్ధి చెందిన భారత్‌కు కీలక స్తంభాలుగా ఉంటున్నాయి.
  

మిత్రులారా,
మహిళలకు సాధికారితను కల్పించడంలో వారు ముందడుగు వేయడానికి తగినన్ని అవకాశాలను ఇవ్వడం ముఖ్యం.  వారి దారిలో ఎదురయ్యే ప్రతి ఒక్క అడ్డంకినీ తొలగించడమూ ముఖ్యమే.  మహిళలు వారు ముందంజ వేయడానికి అవకాశాలను ఇచ్చినట్లయితే దానికి బదులుగా వారు దేశానికి కొత్త కొత్త అవకాశాలను అందిస్తారు.  ఏళ్ళతరబడి మన దేశంలో అనేక వృత్తులు... మహిళల భాగస్వామ్యానికి అనుమతించకుండా ఉండిపోయాయి.  మన కుమార్తెల ఎదుగుదలలో అడ్డుపడుతున్న ప్రతి ఒక్క అంశాన్ని తొలగించాలని మా బీజేపీ ప్రభుత్వం సంకల్పించిందిప్రస్తుతంసైన్యంలో ముందు వరుసలో నిలిచే అవకాశాలను మహిళలకు ఇవ్వడాన్ని మీరు చూడవచ్చుమన కుమార్తెలు కూడా పెద్ద సంఖ్యలో పోరాట విమానాలను నడిపే పైలట్లుగా ఎదుగుతున్నారుచాలా మంది మహిళలు ప్రస్తుతం పోలీసు దళంలో చేరుతున్నారుదీనికి మించిమన కుమార్తెలు ప్రాధాన్యం ఉన్న కంపెనీలకు సారథ్య బాధ్యతలు వహిస్తున్నారు.  దేశవ్యాప్తంగా పరిశీలిస్తేమహిళల నాయకత్వంలో నడుస్తున్న రైతు సహకార సంఘాలుగానీపశువుల పెంపకం కేంద్రాల సహకార సంఘాలుగానీ 1200 వరకు ఉన్నాయిక్రీడల రంగంలో అయినావిద్య రంగంలో అయినా ప్రతి రంగంలోనూ మన కుమార్తెలు రాణిస్తున్నారుదీనికితోడుప్రసూతి సెలవును 26 వారాలకు పొడిగించడంతో లక్షల మంది మహిళలు ప్రయోజనాన్ని పొందారు.
  

మిత్రులారా,
ఒక క్రీడాకారిణి గానీలేదా క్రీడాకారుడు గానీ వారు సాధించిన పతకాన్ని సగర్వంగా ప్రదర్శించడమో లేదా ఎవరెస్ట్ శిఖరం మీద త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని నడవడమో.. ఇలాంటి దృశ్యాల్ని మనం చూసినప్పుడల్లాఈ సాఫల్యాన్ని సాధించడానికి వారు ఏళ్ళతరబడి పట్టువిడువక ప్రయత్నిస్తూ ఉంటారనిఎంతో అంకిత భావంతో కృషి చేస్తూ ఉంటారనీ మనం గ్రహించంఇదే విధంగా ఏళ్ళపాటు పట్టుదలతోనూఅలసట ఎరుగక చేసిన కృషి ద్వారానూ ఈ రోజు ఇక్కడ మొదలుపెట్టిన బీమా సఖి కార్యక్రమానికి పునాది పడిందిస్వాతంత్య్రం వచ్చి 60-65 ఏళ్ళయిన తరువాత కూడా భారత్‌లో చాలా మంది మహిళలకు వారికంటూ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు లేవుదీని అర్థం మహిళలను చాలా వరకు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం కానివ్వలేదన్నమాటేఈ అంతరాన్ని గుర్తించి మా ప్రభుత్వం మాతృమూర్తులకుసోదరీమణులకు జన్‌ ధన్ బ్యాంక్ ఖాతాలను తెరవడానికి ప్రాధాన్యాన్ని ఇచ్చిందిప్రస్తుతం 30 కోట్ల మందికి పైగా మహిళలకుకుమార్తెలకు జన్‌ధన్ ఖాతాలు ఉన్నాయని చెప్పడానికి ఈరోజు నేను గర్విస్తున్నానుఈ జన్‌ ధన్ ఖాతాలే లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించండి.  ఇవి లేకపోతేగ్యాస్ సబ్సిడీ మీ ఖాతాలలోకి నేరుగా జమ అయ్యేదే కాదుకోవిడ్-19 మహమ్మారి విజృంభించిన కాలంలో మీకు ఎలాంటి ఆర్థిక సహాయం అందేదేకాదుకిసాన్ కళ్యాణ్ నిధి సొమ్ము మహిళల ఖాతాల్లో జమయ్యేదీ కాదుసుకన్య సమృద్ధి యోజన కింద ఇస్తున్న అధిక వడ్డీ ప్రయోజనాన్ని పుత్రికలు అందుకొనేవారూ కాదు.  గృహ నిర్మాణానికి ఉద్దేశించిన డబ్బు నేరుగా మహిళల ఖాతాలకు బదిలీ అయ్యేదేకాదుదీనికి మించిచిన్న వ్యాపారాలను ఏర్పాటుచేసుకొనే సోదరీమణులు బ్యాంకుల సేవలకు నోచుకొనేవారు కాదుకోట్లాది మహిళలకు ముద్ర యోజనలో భాగంగా పూచీకత్తు లేని రుణాలను అందుకొనే అవకాశమూ దాదాపు అసాధ్యమైపోయేదిమహిళలకు ప్రస్తుతం వారి వంతు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు ఉన్నాయి కాబట్టివారి ముద్ర రుణాలను వారంతట వారే అందుకోగలుగుతున్నారుదీంతో మొట్టమొదటిసారిగాతాము ఎంపికచేసుకొన్న వ్యాపారాలను వారు మొదలుపెట్టగలుగుతున్నారు
 

మిత్రులారా,
బ్యాంకింగ్ సేవలను ప్రతి గ్రామానికి చేర్చడంలో మన సోదరీమణులు కీలకపాత్రను పోషించారు.  ఒకప్పుడు బ్యాంకు ఖాతాలే లేని మహిళలు ప్రస్తుతం బ్యాంక్ సఖిల హోదాలో ఇతరులను బ్యాంకింగ్ వ్యవస్థతో కలుపుతూ ఉండడం ప్రశంసనీయం.  డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలోరుణాలు ఎలా తీసుకోవాలోబ్యాంకింగ్ సౌకర్యాలను ఏవిధంగా చక్కగా ఉపయోగించుకోవాలో అన్నిటినీ ఈ తల్లులుఈ అక్కచెల్లెళ్ళు ప్రజలకు ఇట్టే నేర్పిస్తున్నారు.  ప్రస్తుతం లక్షల సంఖ్యలో బ్యాంక్ సఖీలు పల్లె ప్రాంతాల్లో అత్యవసర సేవలను అందజేస్తున్నారు.
  

మిత్రులారా,

ఒకప్పుడు మహిళలను బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించనీయనట్లుగానేబీమా రంగంలో కూడా వారు భాగస్తులు కాలేకపోయారుఈరోజు లక్షల కొద్దీ మహిళలను బీమా ఏజెంట్లుగాబీమా సఖీలుగా చేసేందుకు ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టారుఒకప్పుడు బీమా సేవలకు దూరంగా ఉంచిన మహిళలకు ఈ సేవలను ఇతరులకు దక్కేటట్లు చూడడంలో కీలకపాత్రధారులు అయ్యేందుకు ఈ కార్యక్రమం వీలుకల్పించిందిఈ పనిని చేస్తూవారు బీమా రంగం విస్తరణలోనూ ముఖ్యపాత్రను  పోషించనున్నారుబీమా సఖి యోజన ద్వారా లక్షల మంది మహిలకు ఉద్యోగావకాశాలను అందించాలని మేం లక్ష్యంగా పెట్టుకొన్నాం.  పదో తరగతి పాసైన సోదరీమణులుకుమార్తెలు ప్రత్యేక శిక్షణనుమూడు సంవత్సరాలపాటు ఆర్థిక సహాయాన్నిభత్యాలను అందుకోనున్నారుఒక ఎల్ఐసీ ఏజెంటు సగటున రూ.15,000 ఆదాయం ఆర్జిస్తారని పరిశ్రమ సమాచారాన్నిబట్టి తెలుస్తోందిదీని అర్థం ఏమిటి అంటేమన బీమా సఖులు ఏడాదికి రూ.1.75 లక్షలు కన్నా ఎక్కువే సంపాదించే అవకాశం ఉందన్నమాటఈ ఆదాయం వారి కుటుంబాలకు ఎంతో అవసరమైన ఆర్థిక మద్దతును అందించనుంది.
  

మిత్రులారా,
బీమా సఖీలు చేసే పనుల ప్రాముఖ్యాన్ని గమనిస్తే అది వారి నెలవారీ సంపాదనకన్నా మించిందని తెలుస్తుందిప్రజలందరికీ బీమా రక్షణ లభించాలన్న మన దేశం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడంలో వారికి కూడా పాత్ర ఉండబోతోందిసామాజిక భద్రతను పెంచడంలోపేదరికాన్ని నిర్మూలించడంలో ఈ ఉద్యమం చాలా ముఖ్యమైంది.  మీరు బీమా సఖిగా ఈ రోజు పోషిస్తున్న పాత్ర ‘అందరికీ బీమా’ ఉద్యమాన్ని బలపరుస్తుంది.
 

మిత్రులారా,

వ్యక్తులకు బీమా ఏవిధంగా సాధికారితను కల్పిస్తుందిఅది వారి జీవితాలను ఏవిధంగా మార్చివేస్తుందనే అంశాలలో కొన్ని స్పష్టమైన ఉదాహరణలను మనం చూశాం.  ప్రభుత్వం ‘ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన’ను ‘ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన’ను తీసుకువచ్చిందిఈ పథకాలు ఒక్కొక్కటీ రూ.2 లక్షల విలువైన బీమా రక్షణ సదుపాయాన్నిఅది కూడా చాలా తక్కువ ప్రీమియంలకే అందిస్తున్నాయిబీమా రక్షణకు నోచుకొంటామని ఏనాడూ ఊహించనైనా ఊహించని వ్యక్తులు అనేకమంది సహా దేశంలో 20,000 కోట్లకు పైగా ప్రజలు ప్రస్తుతం ఈ పథకాల ద్వారా బీమా అభయాన్ని పొందుతున్నారుఇంతవరకు చూసుకొంటేదాదాపుగా రూ. 20,000 కోట్ల క్లెయిములను పరిష్కరించారుఎవరైనా ఒక ప్రమాదానికి గురైతేనోతమ ప్రియతములలో ఎవరినైనా కోల్పోతేనో ఆ సవాలు వంటి కాలంలో రూ.2 లక్షల సొమ్ము లభించడం ఎంత కీలకమవుతుందో.. దీనిని గురించి ఒక్కసారి ఊహించండి.  బీమా సఖీలు ఒక్క బీమానే అందిస్తున్నారని కాదువారు అసంఖ్యాక కుటుంబాలకు కీలకమైన సామాజిక భద్రత ఛత్రాన్ని అందించడంతోపాటు ఎంతో ధర్మ బద్ధమైన సేవను కూడా అందిస్తున్నారని దీనికి అర్థం.
 

మిత్రులారా,
భారత్‌లో గ్రామీణ ప్రాంతాల మహిళలకు గడచిన పది సంవత్సరాలకు పైగా విప్లవాత్మక నిర్ణయాలను అమలుచేస్తున్న తీరు గుర్తింపునకుఅధ్యయనానికి అర్హమైందేబీమా సఖిబ్యాంకు సఖికృషి సఖిపశు సఖిడ్రోన్ దీదీలఖ్ పతి దీదీ (లక్షాధికారి సోదరి).. ఈ పేర్లు చూడడానికి సామాన్యమైనవిగానే కనిపించవచ్చుఅయితేఈ విధులను నిర్వర్తిస్తున్న మహిళలు భారతదేశ భవితను తిరగరాస్తున్నారుస్వయం సహాయ బృందం (ఎస్‌హెచ్‌జీఉద్యమం ముఖ్యంగా మహిళలకు సాధికారిత కల్పనలో ఒక సామాన్య గాథదీనిని చరిత్రలో గొప్పగా చెప్పుకొంటారుఎస్‌హెచ్‌జీలను గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక క్రాంతిని తీసుకురావడానికి శక్తిమంతమైన సాధనంగా మేం మార్చివేశాం.  ప్రస్తుతం దేశం నలుమూలలా పది కోట్ల మంది మహిళలు ఎస్‌హెచ్‌జీలతో ముడిపడి ఉన్నారు.  వారు వారి విధి నిర్వహణ ద్వారా జీవనోపాధిని సంపాదించుకొంటున్నారుగత దశాబ్ద కాలంలో ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీలకు రూ. 8 లక్షల కోట్లకు మించిన ఆర్థిక సహాయాన్ని అందించివారికి కొండంత అండగా నిలబడింది.

మిత్రులారా,
దేశవ్యాప్తంగా ఎస్‌హెచ్‌జీలతో అనుబంధం ఉన్న మహిళలందరికీ నేను ఒక విషయాన్ని స్పష్టం చేయదలచుకొన్నానుఅది ఏమిటంటే మీ పాత్ర ఎంత అసాధారణమైందిమీ తోడ్పాటు ఎంతటి ప్రాముఖ్యం కలిగిందన్నదే.  మీరు భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారేటట్లు ముందుకు తీసుకుపోతున్నారు.  ఈ ఉద్యమంలో సమాజంలోని అన్ని వర్గాల మహిళలుప్రతి ఒక్క కుటుంబంలోని మహిళలు భాగస్తులే.  ఈ ఎస్‌హెచ్‌జీల ఉద్యమం పల్లె ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ అభ్యున్నతికి మాత్రమే కాకుండాసామాజిక సద్భావననుసామాజిక న్యాయాన్ని వర్ధిల్లేటట్లు చేస్తుంది.  ఒక ఇంట్లో ఒక పుత్రిక చదువుకొందంటే రెండు కుటుంబాలకు మేలు జరుగుతుందనే మాట మన దేశంలో తరచుగా వినపడుతూ ఉంటుంది.  ఇదే విధంగా ఎస్‌హెచ్‌జీలు ఒక మహిళ ఆదాయాన్ని పెంచడం ఒక్కటే కాకుండాఆమె సభ్యురాలుగా ఉన్న కుటుంబంతోపాటు ఆ గ్రామంలో కూడా ఆత్మవిశ్వాసం పెరిగేందుకు తోడ్పడుతుంది.  మీరు చేసే పని ఎంతో ముఖ్యమైందీవెలకట్టరానిదీనూ.

మిత్రులారా,

మూడు కోట్ల మంది లఖ్‌పతి దీదీ (లక్షాధికారి సోదరీమణులు)లను తయారు చేయాలన్న లక్ష్యాన్ని గురించి కూడా నేను ఎర్రకోట బురుజుల మీది నుంచి ప్రకటించి ఉన్నాను.  ఇంత వరకు దేశమంతటా ఒక కోటి పదిహేను లక్షలకు పైగా లఖ్‌పతి దీదీలు రూపొందారు.  వారిలో ఒక్కొక్కరు ఏటా రూ.1 లక్షకు పైగానే సంపాదిస్తున్నారుప్రభుత్వం అమలుచేస్తున్న ‘నమో డ్రోన్ దీదీ’ పథకంతో లఖ్‌పతి దీదీ కార్యక్రమానికి మరింత మద్దతు లభిస్తోందిహర్యానాలో నమో డ్రోన్ దీదీ పథకానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.  హర్యానా ఎన్నికల సందర్భంగా నేను కొంతమంది సోదరీమణులతో మాట్లాడానువారిలో ఒక సోదరి డ్రోన్ పైలట్‌గా శిక్షణ పొందాననితమ బృందం ఏ విధంగా ఒక డ్రోన్‌ను సమకూర్చుకొందోననే విషయంతోపాటుపోయిన ఖరీఫ్ సీజన్‌లో పంటలలో పనిచేసేందుకు తాను ఏ విధంగా అవకాశాలు దక్కించుకొందో తెలియజేసింది.  ఆమె డ్రోన్ ఉపయోగించి దాదాపుగా 800 ఎకరాల పంట పొలాల్లో పురుగు మందులను వెదజల్లిందిఆమె ఎంత సంపాయించారో మీకు తెలుసా?  ఒకే సీజన్‌లో ఆమె రూ. 3 లక్షలు సంపాదించిందిఈ కార్యక్రమం వ్యవసాయం రూపురేఖలను మార్చడం ఒక్కటే కాకుండామహిళల జీవితాలలో వినూత్నమైన మార్పులను తీసుకువచ్చివారు ఆర్థిక స్వాతంత్య్రాన్నిసమృద్ధిని సాధించుకొనేటట్లుగా కూడా వారికి తోడ్పడుతోంది.

మిత్రులారా,
ప్రస్తుతం వేల మంది కృషి సఖీలకు ఆధునిక వ్యవసాయ పద్ధతులుప్రాకృతిక వ్యవసాయంలతోపాటు సుస్థిర వ్యవసాయ విధానాల పట్ల అవగాహనను పెంచడానికి తగిన శిక్షణను అందిస్తున్నారుఇంతవరకు సుమారు 70,000 మంది కృషి సఖిలు వారి సర్టిఫికెట్లను అందుకొన్నారుఈ కృషి సఖిలకు ప్రతి ఏటా రూ.60,000కు పైగా సంపాయించే శక్తియుక్తులు కూడా లభించాయి.  ఇదే మాదిరిగా, 1.25 లక్షల మందికి పైగా పశు సఖిలు పశుపాలనలో అవగాహన కల్పించే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.  కృషి సఖీలుపశు సఖీలు పోషిస్తున్న పాత్ర ఉపాధికల్పనకన్నా మించిందివారు మానవజాతికి అమూల్య సేవను అందిస్తున్నారురోగులకు సేవలు అందిస్తూ ప్రాణాలను నిలబెట్టడంలో నర్సులు ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లుగానేకృషి సఖిలు భావితరాలవారి కోసం భూమాతను పదిలంగా ఉంచుతున్నారుసేంద్రీయ సాగును ప్రోత్సహిస్తూవారు నేలకుమన రైతులకుభూగ్రహానికి మేలు చేస్తున్నారుఅలాగేపశు సఖీలు పశు సంరక్షణలో చెప్పుకోదగ్గ సేవలను అందిస్తూ మానవజాతికి అంతే పవిత్రమైన సేవను నిర్వర్తిస్తున్నారు.
 

మిత్రులారా,
కొంత మంది ప్రతి విషయాన్ని రాజకీయాలఓటు బ్యాంకుల అద్దాలలోనుంచే చూస్తారు.  వారు నేటి కాలంలో కొంత గందరగోళానికి లోనైగాభరా పడుతున్నారనిపిస్తోందితల్లులుఅక్కచెల్లెళ్ళుకుమార్తెల ఆశీస్సులు ఒక ఎన్నిక తరువాత మరొక ఎన్నికలో మోదీకి అనుకూలత ఎందుకు పెరుగుతున్నదీ వారు అర్థం చేసుకోలేకపోతున్నారు.  మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా భావించిఎన్నికల కాలంలో నామమాత్రపు ప్రకటనలకు దిగేవారు ఈ ప్రగాఢమైననిజమైన బంధాన్ని గ్రహించలేరు.

తల్లుల వద్ద నుంచిఅక్కచెల్లెళ్ళ వద్ద నుంచి నేను అందుకున్న అపారమైన ప్రేమాభిమానాలను అర్థం చేసుకోవాలంటే అందుకు గత పదేళ్ళ వెనుకటి కాలానికి తిరిగివెళ్ళి పరిశీలించక తప్పదుదశాబ్ద కాలం కిందట కోట్లాది మహిళలకు కనీస పారిశుధ్య వసతి అయినా లభించనే లేదుప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా టాయిలెట్లను నిర్మించారు.  పదేళ్ళ కిందటగ్యాస్ కనెక్షన్‌లు లేని మహిళలు కోట్ల సంఖ్యలో ఉన్నారు.  ‘ఉజ్జ్వల యోజన’ను తీసుకురావడం ద్వారా ఉచిత కనెక్షన్‌లను అందించారు.  సిలిండర్ ధరలను మరింత అందుబాటు స్థాయిలోకి తెచ్చారు.  చాలా ఇళ్ళలో నీటి సరఫరాకు పంపులే లేవు.  మేం ప్రతి కుటుంబానికి నీటి కనెక్షన్‌ను అందించే ఏర్పాట్లుచేశాంగతంలో ఆస్తి తమ పేరు మీద ఉన్న మహిళలు చాలా తక్కువ.  ప్రస్తుతం కోట్లాది మంది మహిళలు పక్కా ఇళ్ళకు యజమానులు అయినందుకు గర్వపడుతున్నారుదశాబ్దాల తరబడి మహిళలు లోక్ సభలోనురాష్ట్రాల అసెంబ్లీలలోను 33 శాతం రిజర్వేషన్ కావాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు.  మీరు అందించిన ఆశీర్వాదాలతో మేం చాన్నాళ్ళుగా ఈ డిమాండును నెరవేర్చే అదృష్టాన్ని దక్కించుకొన్నాంపరిశుద్ధమైన ఆలోచనలతోనిజాయతీగా కృషి చేసినపుడు మాతృమూర్తులసోదరీమణుల మనఃపూర్వక దీవెనలను పొందవచ్చు.   
మిత్రులారా,
రైతుల సంక్షేమం కోసం మా డబల్ ఇంజిన్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో కృషి చేస్తోందిమొదటి రెండు పదవీకాలాల్లో హర్యానా రైతులు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్‌పీరూపంలో రూ.1.25 లక్షల కోట్లకు పైచిలుకు సొమ్మును అందుకున్నారు.  ఈ మూడో పదవీకాలంలో వరికిచిరుధాన్యాలకుపెసర్ల రైతులకు ఇప్పటికే రూ.14,000 కోట్లను ఎమ్ఎస్‌పీ రూపంలో అందజేశాం.  దీనికి అదనంగా రూ.800 కోట్లకు పైగా నిధులను కరవుబాధిత రైతులకు సాయం చేయాలని కేటాయించాం.  హరిత క్రాంతికి సారథిగా హర్యానాను నిలపడంలో చౌధరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం పోషించిన ప్రముఖ పాత్రను మనమందరం తగిన విధంగా గుర్తించుకొన్నాం.  ఇప్పుడు, 21వ శతాబ్దంలో... ఏర్పాటు చేస్తున్న మహారాణా ప్రతాప్ హార్టికల్చర్ యూనివర్సిటీ పండ్లుకాయగూరల ఉత్పత్తిలో హర్యానా నాయకత్వ పాత్ర పోషించడంలో కీలకం కానుందిఈరోజు మహారాణా ప్రతాప్ హార్టికల్చర్ యూనివర్సిటీ కొత్త కేంపస్ నిర్మాణానికి శంకుస్థాపనను పూర్తి చేశారు.  ఇది ఈ రంగంలో అధ్యయనాలు చేసే యువతకు ఆధునిక సదుపాయాలను అందిస్తుంది.
 

మిత్రులారా,
ఈ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందంటూ మీ అందరికీప్రత్యేకించి హర్యానా అక్కచెల్లెళ్ళకు నేను మరోసారి హామీనిస్తున్నానుఈ డబల్ ఇంజిన్ ప్రభుత్వం తన మూడో పదవీకాలంలో మూడింతల వేగంతో పనిచేస్తుందిఈ ప్రగతి సాధనలో మహిళా సాధికారిక పాత్ర మరింతగా పెరుగుతూనే ఉంటుందిమీ ప్రేమమీ ఆశీస్సులు మాకు ఎల్లవేళలా లభిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నానుఈ ఆశతోఅందరికీ మరోసారి నేను నా హృదయపూర్వక అభినందనలనుశుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.
 
నాతో కలిసి ఈ మాటలు పలకండి..
 
భారత మాతా కీ జై.
 
భారత మాతా కీ జై.
 
భారత మాతా కీ జై.
 
మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.
గమనికఇది ప్రధానమంత్రి ఉపన్యాసానికి అనువాదంప్రధాని హిందీలో మాట్లాడారు.

 

***


(Release ID: 2082960) Visitor Counter : 25