ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూ ఢిల్లీలో అష్టలక్ష్మి మహోత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 06 DEC 2024 8:37PM by PIB Hyderabad

అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ గారు, మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కోన్‌రాడ్ సంగ్మా గారు, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా గారు, సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేంసింగ్ తమాంగ్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు జ్యోతిరాదిత్య సింధియా గారు, సుకాంత మజుందార్ గారు, అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మిజోరం, నాగాలాండ్ ప్రభుత్వాల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులు , మహిళలు, ప్రముఖులారా,

 

 

మిత్రులారా,

 

ఈ రోజు మన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణ్ దివస్. బాబా సాహెబ్ రూపొందించిన రాజ్యాంగమూ, రాజ్యాంగానికి 75 సంవత్సరాలైన అనుభవమూ.. దేశ పౌరులందరికీ చాలా ప్రేరణనిస్తున్నాయి. నేను దేశ ప్రజలందరి తరఫున బాబా సాహెబ్‌కు నివాళిని అర్పిస్తూ, ఆయనకు నమస్కరిస్తున్నాను.    

 

 

మిత్రులారా,

 

గత రెండేళ్ళలో ఈ భారత్ మండపం జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు ఎన్నింటికో వేదికైంది. ఇక్కడే జి-20 శిఖరాగ్ర సమావేశం గొప్పగా విజయవంతం కావడం మనం చూశాం. అయితే, ఈ రోజు నిర్వహిస్తున్న కార్యక్రమం అంతకన్నా విశేష కార్యక్రమం. ఈ రోజు ఢిల్లీలో ఈశాన్య ప్రాంతానికి పెద్దపీట వేశారు. ఈశాన్య ప్రాంతాల వైవిధ్యభరిత, చైతన్యభరిత వన్నెలు కనువిందు చేసే ఇంద్రధనుస్సును దేశ రాజధానిలో ఆవిష్కరించాయి. అష్టలక్ష్మి మహోత్సవ్ ప్రారంభ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించుకోవడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. రాబోయే మూడు రోజుల్లో ఈ ఉత్సవం ఈశాన్య రాష్ట్రాల్లోని అపార అవకాశాలను యావత్తు దేశానికి, ప్రపంచానికి చాటిచెప్పనుంది. వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఒప్పందాలు కుదరనున్నాయి. ఈశాన్య రాష్ట్రాల ఉత్పత్తులను, ఆ ప్రాంత సంపన్న సంస్కృతిని ఇక్కడ ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా, ఈశాన్య ప్రాంతాల వంటకాలు ప్రతి ఒక్కరి మదిని దోచుకోవడం ఖాయం. ఈశాన్య ప్రాంతాల విజేతలకు చెందిన స్ఫూర్తిదాయకమైన గాథలు కూడా ఇక్కడ మారుమోగనున్నాయి. ఈశాన్య ప్రాంతానికి చెందిన పద్మ పురస్కారాల విజేతలు కొందరు ఇక్కడికి వచ్చారు.. ఈశాన్య ప్రాంతాల్లో పెద్దఎత్తున పెట్టుబడి అవకాశాలకు ఈ కార్యక్రమం తలుపులు తెరవనున్నందున ఇది అపూర్వ కార్యక్రమమని చెప్పాలి. ఇది ఈశాన్య ప్రాంత రైతులకు, చేతివృత్తి కళాకారులకే కాకుండా ప్రపంచ పెట్టుబడిదారులకు కూడా ఒక ముఖ్యమైన ఘట్టం. ఈశాన్య ప్రాంతాల శక్తియుక్తులు అసాధారణమైనవి. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనలను, సంతలను చూడడానికి వచ్చేవారు ఆ ప్రాంత వైవిధ్యాన్ని, సమృద్ధిని తెలుసుకోనున్నారు. ‘అష్టలక్ష్మి మహోత్సవ్’ నిర్వాహకులకు, ఈశాన్య ప్రాంత రాష్ట్రాల ప్రజలకు, పెట్టుబడిదారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయ అతిథులందరికీ నేను నా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

 

మిత్రులారా,

 

గత వంద- రెండు వందల ఏళ్ళను మళ్లీ ఒకసారి పరిశీలించినట్లయితే, పశ్చిమ దేశాలు అభివృద్ధి చెందడాన్ని మనం గమనించవచ్చు. పశ్చిమ దేశాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ప్రపంచమంతటా గొప్ప ప్రభావాన్ని కలగజేశాయి. ఆసక్తిదాయకం ఏమిటంటే, భారత్‌లో కూడా, మన వృద్ధి గాథకు రూపు రేఖలను కల్పించడంలో పశ్చిమ ప్రాంతం ఒక ముఖ్య పాత్రను పోషించింది. ప్రస్తుతం మనం 21వ శతాబ్దంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, ఈ శతాబ్దం తూర్పు ఆసియాకు, ముఖ్యంగా భారత్‌కు చెందిందనే మాటలు తరచుగా వినపడుతున్నాయి. ఈ సందర్భంగా భారత్ భవిష్యత్తు ఈశాన్య భారత్‌కు, ప్రత్యేకించి ఈశాన్య ప్రాంతానికి చెందిందని కూడా నేను ద్రుఢంగా నమ్ముతున్నాను. గత దశాబ్దాల్లో ముంబయి, అహమదాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలు ప్రధాన పట్టణ కేంద్రాలుగా ఎదిగాయి. అయితే, రాబోయే దశాబ్దాల్లో గౌహతి, అగర్తలా, ఇంఫాల్, ఇటానగర్, గాంగ్‌టక్, కోహిమా, షిల్లాంగ్, ఐజ్వాల్ వంటి నగరాలు వాటి అపార శక్తిసామర్థ్యాలను నిరూపించుకోనున్నాయి. ఈ ప్రయాణంలో ‘అష్టలక్ష్మి మహోత్సవ్’ వంటి కార్యక్రమాలు కీలక పాత్రను పోషించనున్నాయి.

అనేక ఉత్పత్తులు జీఐ (భౌగోళిక గుర్తింపు) ట్యాగ్‌ను సంపాదించుకొన్నాయి. ఇవి ఈశాన్య ప్రాంతాల సాటిలేని సృజనాత్మకతకు, చేతివృత్తి కళాకారుల పనితనానికి నిదర్శనం.

 

మిత్రులారా,

 

అష్ట లక్ష్ములలో ఆరో రూపం పేరు ‘వీర లక్ష్మి’.. ఈ దేవత ధైర్యసాహసాలకు, శక్తికి సంకేతం. ఈశాన్య ప్రాంతం మహిళా శక్తికి దీపస్తంభంలా నిలుస్తోంది. మణిపూర్‌లో జరిగిన నుపీ లాన్ ఉద్యమంలో మహిళలు అణచివేతకు ఎదురొడ్డి ధైర్య సాహసాలతో పోరాడి, విజయం సాధించారు. మన స్వాతంత్య్ర పోరాటంలో రాణీ గైదిన్‌లియూ, కనకలత బరువా, రాణి ఇందిరా దేవి, లల్‌నూ రోపిలియానీ వంటి ప్రసిద్ధ వ్యక్తుల తోడ్పాటులను భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకొన్నాం. ఈ వీర గాథలు దేశ ప్రజలందరికీ ప్రేరణను అందిస్తూ వస్తున్నాయి. ఈ రోజుకూ, ఈశాన్య ప్రాంత పుత్రికలు ఈ గర్వకారణమైన వారసత్వాన్ని నిలబెట్టుకొంటూ వస్తున్నారు. నేను ఇక్కడ ఉన్న స్టాల్స్‌ను చూసినప్పుడు వాటిలో చాలా వరకు స్టాల్స్‌ను మహిళలే నిర్వహిస్తున్నట్టు గమనించాను. ఈశాన్య ప్రాంత మహిళల్లో నిండి ఉన్న ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల స్ఫూర్తి ఈ ప్రాంతానికి సాటిలేని శక్తిని జోడిస్తోంది.

విధానాన్ని ప్రారంభించినప్పటి నుంచీ 2014 వరకు ఇచ్చిన మొత్తం బడ్జెటు కన్నా గడచిన దశాబ్ద కాలంలో ఈశాన్య ప్రాంతానికి కేటాయించిన నిధులు ఎక్కువగా ఉండడం విశేషం. కేవలం పది సంవత్సరాల్లో ఈ ఒక్క విధానం కిందే ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఒక స్పష్టమైన ఉదాహరణ ఇది.

 

మిత్రులారా,

 

ఈ పథకం ఒక్కటే కాకుండా ఈశాన్య ప్రాంత రాష్ట్రాల కోసమంటూ ప్రత్యేకంగా రూపొందించిన ఇతర అనేక కార్యక్రమాల్ని మేం ప్రారంభించాం. వాటిలో పీఎండివైన్ (PM-DevINE) పేరుతో ఉన్న ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం, నార్త్ ఈస్ట్ వెంచర్ ఫండ్ వంటి కార్యక్రమాలు ఉపాధి అవకాశాల్ని చాలా వరకు పెంచాయి. ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని మేం ఉన్నతి పథకాన్ని ప్రవేశపెట్టాం. ఈ పథకం పరిశ్రమలు వర్ధిల్లడానికి ఒక అనుకూల వాతావరణాన్ని ఏర్పరచి, మరిన్ని ఉద్యోగాల కల్పనకు బాట వేస్తుంది. భారత్‌లో అంతకంతకూ విస్తరిస్తున్న సెమీకండక్టర్ పరిశ్రమను, ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో ప్రత్యేకించి అసోంలో వ్యూహాత్మకంగా ప్రారంభించాం. ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న ఈ రంగానికి బలమైన ఊతాన్ని ఇవ్వాలని ఇలా చేశాం. ఈశాన్య ప్రాంతంలో ఈ తరహా పరిశ్రమల్ని ఏర్పాటు చేయడంతో దేశ, విదేశాల పెట్టుబడిదారులను ఈ ప్రాంతం ఆకర్షించి, ఈ ప్రాంతంలో కొత్త కొత్త అవకాశాల్ని కల్పించగలుగుతుంది.

 

మిత్రులారా,

 

భావోద్వేగాలు, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం.. అనే మూడు నదుల త్రివేణీ సంగమం ద్వారా ఈశాన్య ప్రాంత రాష్ట్రాన్ని మేం సంధానిస్తున్నాం. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల నిర్మాణమనే ఒక్క అంశంపైనే మేం శ్రద్ధ పెట్టడంలేదు. ఒక ఉజ్వలమైన, మరింత దీర్ఘకాలంపాటు మనుగడ సాధ్యమయ్యేందుకు పునాదిని కూడా మేం వేస్తున్నాం. దశాబ్దాల తరబడి సంధానం అనేది ఈశాన్య ప్రాంతాల్లో ఒక పెనుసవాలుగా ఉంటూ వచ్చింది. దూర ప్రాంత నగరాలకు చేరుకోవాలంటే రోజులు, వారాలు పట్టేది. అనేక రాష్ట్రాల్లో రైలు సేవలైనా అందుబాటులో ఉండేవికావు. ఈ విషయాన్ని గుర్తించి 2014లో మా ప్రభుత్వం భౌతిక, సాంఘిక, మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి పరచడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడంతో ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల నాణ్యతే కాక, జీవన నాణ్యత కూడా చాలా వరకు మెరుగైంది.

చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. గత పదేళ్ళలో ఈశాన్య ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య దాదాపుగా రెట్టింపు అయింది. పెట్టుబడులలోను, పర్యటనల పరంగాను చోటుచేసుకొన్న ఈ వృద్ధి ఈశాన్య ప్రాంతంలో కొత్త కొత్త వ్యాపార సంస్థలను, అలాగే అవకాశాలను తీసుకువచ్చింది. మౌలిక సదుపాయాల కల్పన మొదలు ఏకీకరణ వరకు, సంధానం నుంచి సామీప్యం వరకు, ఆర్థిక బంధాల నుంచి భావోద్వేగ బంధాల వరకు చూస్తే, ఈ ప్రయాణం మన అష్టలక్ష్ములు అనదగ్గ ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో అభివృద్ధిని ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత ఉన్నత స్థాయిలకు చేర్చింది.

 

 

మిత్రులారా,

 

అష్టలక్ష్మి రాష్ట్రాల యువతకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యాన్ని ఇస్తోంది. ఈశాన్య ప్రాంత రాష్ట్రాల యువత వారి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఎల్లవేళలా కోరుకుంటూ వచ్చారు. గత దశాబ్ద కాలానికి పైగా ఈశాన్య ప్రాంతంలోని ప్రతి రాష్ట్రంలో చిరకాల శాంతి ఏర్పడాలని ప్రజలు మనసా వాచా కోరుకుంటూ వచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి ప్రయత్నాలతో వేలాది యువజనులు హింసామార్గాన్ని వదిలిపెట్టి, అభివృద్ధి నవ పథాన్ని ఎంచుకొన్నారు.

 

ఈశాన్య ప్రాంతంలో గడచిన పదేళ్ళలో అనేక చరిత్రాత్మక శాంతి ఒప్పందాలపై సంతకాలయ్యాయి. రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకొన్నారు. ఫలితంగా ఈ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు చాలావరకు తగ్గిపోయాయి. ఏఎఫ్ఎస్‌పీఏను చాలా జిల్లాల్లో ఎత్తివేశారు. మనం కలిసికట్టుగా, ఈశాన్య ప్రాంతానికి ఒక ఉజ్వల భవిష్యత్తుకు రూపురేఖలు దిద్దుతున్నాం. ఈ లక్ష్య సాధనలో అవసరమైన ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

మిత్రులారా,

 

ఈశాన్య ప్రాంతానికి చెందిన విశిష్ట ఉత్పత్తులు ప్రపంచమంతటా మార్కెట్లకు చేరుకోవాలని మనమందరం కోరుకుంటున్నాం. దీనిని సాధించడానికి, ప్రతి జిల్లాకు చెందిన విశిష్ట ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ‘ఒక జిల్లా, ఒక ఉత్పత్తి’ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నాం. ఈ వస్తువులను ప్రదర్శనల్లోను, గ్రామీణ హాట్ బజార్లలోను చూడవచ్చు, కొనవచ్చు. ఈశాన్య ప్రాంతాల్లో అపురూప వస్తువులకు ఆదరణ లభించడానికి ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని అనుసరించండంటూ నేను సూచిస్తున్నాను. ఈ ఉత్పత్తులను నేను నా విదేశీ అతిథులకు తరచుగా బహుమతుల రూపంలో అందజేస్తూ, ఈ ప్రాంతంలోని అపురూప కళాత్మక వస్తువులకు, ఇక్కడి చేతివృత్తి కళాకారుల పనితనానికి ప్రపంచస్థాయి గుర్తింపు లభించేటట్లు చూస్తున్నాను. నా తోటి దేశ పౌరులను, ప్రత్యేకించి ఢిల్లీ ప్రజలకు వారి నిత్యజీవనంలో ఈశాన్య ప్రాంతాల వస్తువులను ఒక భాగంగా చేసుకోవలసిందిగా నేను కోరుతున్నాను.

 

 

 

మిత్రులారా,

 

ఈ రోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన మాటను చెప్పాలనుకొంటున్నాను. గత కొన్నేళ్ళుగా ఈశాన్య ప్రాంతంలోని నా సోదర, సోదరీమణులు గుజరాత్‌లో నిర్వహించే ఒక ముఖ్య సాంస్కృతిక కార్యక్రమానికి హాజరవుతూ వస్తున్నారు. గుజరాత్ పోర్‌బందర్‌లో మాధవ్‌పూర్ మేళా పేరుతో ఒక గొప్ప సంత జరుగుతుంది. దానిని చూడవలసిందిగా మీ అందరినీ నేను కాస్తంత ముందుగానే ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాను. రుక్మిణీదేవి, భగవాన్ శ్రీకృష్ణుల పరిణయోత్సవమే మాధవ్‌పూర్ జాతర. రుక్మిణీ దేవిని ఈశాన్య ప్రాంత పుత్రికగా భావిస్తూ ఉంటారన్న విషయం మీకు అందరికీ తెలుసు.  

 

ప్రతి ఏటా మార్చి- ఏప్రిల్ నెలల్లో వచ్చే రామనవమి సందర్భంగా ఏర్పాటు చేసే ఈ బజారులో పాలుపంచుకోవాల్సిందిగా ఈశాన్య ప్రాంతానికి చెందిన నా కుటుంబ సభ్యులందరికీ నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. ఇలాంటి మరో సంతను గుజరాత్ లో ఏర్పాటు చేయాలని నేను ప్రతిపాదిస్తున్నాను. ఆ బజారులో ఈశాన్య ప్రాంతానికి చెందిన మన ప్రతిభావంతులైన సోదర, సోదరీమణులు పాల్గొని వారి వస్తువులను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించడంతోపాటు, వారి అసాధారణ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కూడా అందుకోగలుగుతారు. భగవాన్ కృష్ణుడు, అష్టలక్ష్ముల ఆశీర్వాదాలతో ఈశాన్య ప్రాంతం 21వ శతాబ్దంలో అభివృద్ధి పథంలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ ఆశతో, ఈ ఉత్సవం, ఈ ప్రాంతం గొప్పగా విజయవంతం కావాలని కోరుకుంటూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

 

మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.

 

 


(Release ID: 2082400) Visitor Counter : 13