ప్రధాన మంత్రి కార్యాలయం
భారత, పీఎం XI క్రికెట్ జట్లతో ఆస్ట్రేలియా ప్రధాని సమావేశంపై హర్షం వ్యక్తంచేసిన భారత ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
28 NOV 2024 6:50PM by PIB Hyderabad
భారత, పీఎం XI క్రికెట్ జట్లతో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ సమావేశంపై భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భారత క్రికెటర్ల అద్భుత ఆరంభాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు.
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి శ్రీ ఆంటోనీ అల్బనీస్ చేసిన ఓ పోస్టుకు స్పందిస్తూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“నాకు మంచి మిత్రుడైన ప్రధానమంత్రి @AlboMP ని భారత, పీఎం XI జట్లతో చూడడం సంతోషంగా ఉంది.
ఈ సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. 140 కోట్ల మంది భారతీయులకు మెన్ ఇన్ బ్లూ పై గట్టి నమ్మకముంది.
మున్ముందు ఇంకా అద్భుతమైన ప్రదర్శన కోసం ఎదురు చూస్తున్నాను.’’
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2078884)
आगंतुक पटल : 56
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam